"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 27 April 2017

ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల

India Post released a set of 3 stamp of Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana on 26th April 2017.

భారత తపాలా 26-04-2017 న మన తెలుగు కవయిత్రులు  శ్రీ వెంకటాచల  మహత్యం రాసిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ (1730-1817)  మరియు ఆతుకూరి (కుమ్మరి) మొల్లమాంబ  (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)రామాయణ కల్పవృక్షం తో పాటు  వేయి పడగలు రాసిజ్ఞానపీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయత,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గార్ల పై  గుంటూరు బృందావన్ గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని అన్నమయ్య కళావేదికపై 26-04- 2017 సాయంత్రం గ  6.15 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఒకేసారి ఇలా ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల కావటం శుభపరిణామం. దీనికి కృషి చేసిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అభినందనలు. 
 Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana

No comments: