Skip to main content

Posts

Showing posts from August, 2019

మొదటి ప్రపంచ యుద్ధం లో భారతీయులు

మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 20 - 08- 2019 న మన తపాలా శాఖ నాలుగు మియేచర్స్ ను  15 తపాలా బిళ్లలను విడుదల చేసింది. ఈ భయంకర యుద్ధంలో మన దేశ సిపాయిలు ఎంతోమంది అసువులు బాసారు. వారికి నివాళిగా ఇవి విడుదల చేశారు.     వాయు సేన లో పోరాడిన యోధులు   వివిధ ప్రదేశాలలో ఉన్న మన వీరుల స్మారక కట్టడాలు    వివిధ ప్రదేశాలలో  జరిగిన యుద్ధ సన్నివేశాలు                                        

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు

మన తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు(ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.  తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అక్కినేని 256 సినిమాలలో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకున్న నట సామ్రాట్. దేశంలో రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు దాదా సాయబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అందాల నటుడు.  Special cover on Akkineni Nageswararao 

మహాత్మా గాంధీ జ్ఞాపికలు

మన తపాలా శాఖ వారు ఆగష్టు 15 ,2019న మన దేశంలో ఉన్న మహాత్మా గాంధీ జ్ఞాపికలపై  ఒక పోటీ నిర్వహించి వాటిలో ఉత్తమం అయిన ఫోటో లతో రెండు తపాలా బిళ్ళలు విడుదల చేశారు. వీటిపై గోవా లో ఉన్న స్థానిక బాలికతో ఉన్న గాంధీజీ విగ్రహం , ఢిల్లీ లో ఉన్న ఉప్పు సత్యాగ్రహం కు 11 మందితో  వెళుతున్న గాంధిజీ విగ్రహం( గాంధీ గెరా మూర్తి ) చోటు చేసుకున్నాయి. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి. 

సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలు

Scented Stamps on Indian Perfumes India post Issued Two miniature sheets and 4 stamps each Rs.25/- on Indian Perfumes Sandal wood and Jasmine on 01-08-201 మన తపాలా శాఖ 01- 08 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను , రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి గంధపు చెక్క, మల్లె పువ్వు వాసనలతో వచ్చాయి.  

INDIA -KOREA JOINT ISSUE

India  and Republic of Korea jointly released new set of two stamps and a miniature for on  30-07-2019  on diplomatic relations between India and Korea