"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 26 March 2013

విప్లవ యోధులు రాజగురు,సుఖదేవ్,భగత్ సింగ్

India Post released a stamp on 22nd March 2013
 to honor  Shiv Ram Hari Rajguru, a freedom fighter,revolutionist and colleague of Bhagat Sing and Sukhadev.   
Shiv Ram Hari Rajguru
విప్లవ యోధుడు శివరాం హరి రాజగురు (24-08-1908 - 23-03-1931)గౌరవార్దం మన తపాల శాఖ 22- 3- 2013 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ ని దారుణంగా కొట్టి వారి మరణానికి కారకుడైన పోలిస్ ఆపీసర్ ను హత్య చేసి ప్రతీకారం తీసుకున్న కేసులో భగత్ సింగ్, సుఖదేవ్ ల తో పాటు 1931 మార్చ్ 23 న ఉరి కంభం ఎక్కిన విప్లవ సింహం రాజగురు. 
భారత పాకిస్తాన్ సరిహద్దులో సట్లేజ్ నది వడ్డున గల హుస్సైనివాల  గ్రామంలో ఈ విప్లవ యోధులకు అంత్యక్రియలు చేసారు. పాకిస్తాన్ మన నుండి విడదిసినప్పుడు ఇది వారి భూభాగం లోకి పోయింది. 1961 లో మన ఆధీనంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్ కు ఇచ్చి హుస్సైనివాల  ను మనం తీసుకున్నాం . 1971లో పాకిస్తాన్ -భరత్ యుద్ధం లో పాకి సైనికులు హుస్సైనివాల  ను ఆక్రమించి అక్కడ ఉన్న భగత్ సింగ్,సుఖదేవ్,రాజగురుల స్మారక విగ్రహాలను ద్వంసం చేసారు. వాటిని మరల 1973 లో తిరిగి ప్రతిస్టించబడ్డాయి. ప్రతి ఏడాది మార్చ్ 23 న ఇక్కడ ' షాహీద్ మేళా' జరుగుతుంది.  
ఈ తపాలా బిళ్ళ పై హుస్సైనివాల  లో ఆనాడు ప్రతిష్టించిన ఈ ముగ్గురి స్మారక విగ్రహాలు కుడా చిత్రించారు. 
హుస్సేంవాలా లో ఉన్న సుఖదేవ్,భగత్ సింగ్, రాజగురు స్మారక విగ్రహాలు 
ఇంతకు ముందు మన భారత తపాల శాఖ వారు 1968 లో విప్లవ యోధుడు సర్దార్ భగత్ సింగ్ గౌరవార్దం ఒక తపాలా బిళ్ళ విడుదల  చేసారు. ఇప్పుడు రాజగురు కు తపాలా బిళ్ళ విడుదల చేసారు. అలాగే  భగత్ సింగ్ ముఖ్య అనుచరుడు సుఖదేవ్ కు,భగత్ సింగ్ తో పాటు అసంబ్లీ లో బాంబ్ లు విసిరిన భుక్తేస్వర దత్ లకు  కుడా  తపాలా బిళ్ళలు విడుదల చేయాలి. 
Bhagat Sing 
Date of Issue : 19-10-1968
Bhagat Sing - FDC 
భగత్ సింగ్ ,రాజ గురు, సుఖదేవ్ లు ఉరి కంభం ఎక్కి 50 సంవత్సరాలు అయిన సందర్బం గా ఈ అమర వీరులకు నివాళి అర్పిస్తూ మన తపాలా శాఖ 23-03-1981 లో ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది 
HOMAGE TO MARTYRS