"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Sunday, 13 April 2014

ఓటు విలువ తెలుసుకో

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. 
మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మన పాలకులను ఎన్నుకోవాలి. 
స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.  
దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.  
ఓటు విలువ పామరులకు తెలియజేయాటానికి అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయానికి  విస్తృతం గా ప్రచారం చేయటానికి మన తపాలా శాఖ 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయం లోనే  ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 13-1-1967 న విడుదల చేసింది. 57 ఏళ్ళు అయినా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు. 
అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి  ఓటు అమ్ముకున్న అమాయకులను చూసాం.  నేడు అమాయకులు లేరు కాని ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ మంది రకరకాల ప్రలోబాలకు లొంగి  తమ ఓటును అమ్ముకుంటున్నారు.  ఈ తీరులో పెను మార్పు రావాలి.  
General Election – Indian Stamps depicting Voters, Polling Booth


ఈ ఎన్నికలు అధికారం లో ఉన్న వారికి , లేని వారికి ఇద్దరికీ సమ న్యాయం కల్పిస్తూ, పక్షపాత  రహితంగా, రాగ ద్వేషాలకు తావు లేకుండా వివాద రహితంగా జరిపించేది మన భారత ఎన్నికల సంఘం. చాలావరకు ఇది తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంది. కాని దానిని చేతానా రహితంగా చేసే రాజకీయం నేడు ప్రభిలింది. 
1950 లో ఏర్పడిన ఈ సంఘం తన విడిలో 60 సంవత్సారాలు పూర్తి చేసుకున్న వేళ 25-01-2010 లో ఒక తపాల బిళ్ళ విడుదల చేసారు.  
60 YEARS OF ELECTION COMMISSION OF iNDIA

ఎన్నికల సంస్కరణ లో ఎన్నికల సంఘం పాత్ర తో పాటు ఓటరుగా మన పాత్ర కుడా చాలా ఉంటుందన్న సంగతి గమనించాలి. ఏదో ఒక విదంగా గెలవాలి, తరువాత దోచుకోవాలి అనే దోపిడి నాయకులకు బుద్ది వచ్చేలా మన ఓటు తో చెప్పాలి. దుర్మార్గుల దౌష్ట్యం కన్నా మంచి వారి మౌనం సమాజానికి చెడు చేస్తుంది. లక్షల కోట్ల అవినీతిని చూస్తూ ఇంకా మౌనం ఉండటం మంచిది కాదు.  తప్పు ని తప్పు గా చెప్పలేక పోవటం కుడా తప్పే.  తప్పును సమర్దించటానికి మరొక తప్పు ఎత్తి చూపటం దుర్మార్గులు చేసే పని.  సమయం వచ్చింది. మేలుకో 
ఓటు విలువ తెలుసుకో -బతుకులో వెలుగు నింపుకో !

Tuesday, 8 April 2014

భద్రాచలం - ప్రత్యేక తపాల ముద్ర

The Inaugural cover of Pictorial Cancellation  at Bhadrachalam 
Issued date : 09 April 1976. 

ఆంద్ర అయోధ్యగా పిలవబడే భద్రాచలం కు మన తపాల శాఖ వారు 09 -04 -1976 లో ఒక ప్రత్యేక పోస్టల్ ముద్రను(Pictorial cancellation) కేటాయించారు.
భద్రాచలం  శ్రీ సీతా రామా స్వామి ఆలయం పేరు వింటే జ్ఞప్తికి వచ్చే వ్యక్తి, ఆలయ నిర్మాణం చేసి  భక్త రామదాసుగా కీర్తించబడే కంచర్ల గోపన్న. భద్రాచల ఆలయ విశిష్టతను, చరిత్రను చాటేలా భక్త రామదాసు బొమ్మతో ఈ పోస్టల్ ముద్రను రూపొందించారు. 
ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై భద్రాచల సితారామాలయ శిఖరం పై ప్రతిష్టించి ఉన్నకలశం 'శ్రీ చక్రం' ను ముద్రించారు.