"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Sunday, 27 January 2013

విశాఖ ఉక్కు - ఆంధ్ర హక్కు

A Special cover on Visakhapatnam Steel Plant (RINL-VSP)
by India Post on 17-09-1993, on the occasion of APPX'93,at Vijayawada 

'విశాఖ ఉక్కు - ఆంధ్ర హక్కు' అనే నినాదం తో 1971 లో  తెలుగు వారు కేంద్రప్రభుత్వం తో పోరాడి సాధించుకున్న అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ - విశాఖ  ఉక్కు కర్మాగారం.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (Rashtriya Ispat Nigam Limited) గా నామకరణం చేసిన ఈ కర్మాగారానికి తెలుగు ప్రజలనుండి పెద్ద ఎత్తున నిరసన ఎదురుకావటం తో  దాని పేరును రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గా మార్చటం జరిగింది.
విజయవాడ లో 17-9-93 న  జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శన  APPEX '93 సందర్బంగా మన తపాలా శాఖ 'GATEWAY TO WORLD CLASS STEEL' పేరుతో విశాఖ స్టీల్ పై   ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసింది.

Thursday, 17 January 2013

స్వామి వివేకానంద 150 వ జయంతి

India Post released a set of 4 stamp on 12th January 2013 to celebrate 150th birth anniversary of Swami Vivekananda.
స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా మన తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 12-1-2013 న నాలుగు ప్రత్యేక తపాలా బిళ్ళలు ఒక తపాలా బిళ్ళల సంచిక (Sheetlet) ను విడుదల చేసింది.
Swami vivekanada - Sheetlet


Swami vivekanada
Swami vivekanada

Swami vivekanada

Swami vivekanada
Swami vivekanada - First day cover


Wednesday, 9 January 2013

మహాకవి గురజాడ వెంకట అప్పారావు

India Post Issued a Special Postal Cover On well known Telugu Poet, writer Gurajada Venkata Apparao,  on 28 -1- 1995, in the occasion of VIZNUPEX- '95
మన భారత తపాలా శాఖ వారు విజయనగరం లో జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శన  (VIZNUPEX-'95) సందర్బంగా మహాకవి గురజాడ వెంకట అప్పారావు  గారికి నివాళిగా 27-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. 
ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం మహారాజ కళాశాల బొమ్మ తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు.
21-09-2012 న గురజాడ వారి 150 వ జయంతి సందర్బం గా కుడా విజయనగరం లోనే మరొక ప్రత్యేక తపాలా కవర్ విడుదలచేసారు. తెలుగు భాషకి వారు చేసిన కృషికి నివాళిగా ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయవలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
Special Cover - Gurajada Venkata Apparao
Date of Issue - 27-01-1995
మహాకవి గురజాడ వెంకట అప్పారావు (1862-1915)దేశమంటే మట్టి కాదోయ్‌ ! దేశమంటే మనుషులోయ్‌ !!
అని ప్రభోదించిన మన ప్రజా కవి శ్రీ గురజాడ.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది.
19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు. గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది.

Tuesday, 8 January 2013

చార్మినార్,కొండపల్లి బొమ్మలు

Two Special Coves Issued by India post in  HYPEX – GOLD – 2013
హైదరాబాద్ ఫిలాటలిక్ మరియు హాబీ సంఘం (The Hyderabad Philatelic & Hobbies Society) వారు తమ సంఘ స్వర్ణోత్సవ సందర్బం గా  తపాలా బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శన HYPEX – GOLD – 2013, అనే పేరుతో   2013 జనవరి 4 నుండి 6 వరకు సికింద్రాబాద్ (హైదరాబాద్ ) లో ఏర్పాటు చేసారు. 
ఈ సందర్బంగా మన తపాలా శాఖ వారు రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేసారు. 
ది. 5-1-2013 న విడుదలైన ప్రత్యేక కవరు పై హైదరాబాద్ 'చార్మినార్', దానిపై  ప్రత్యేక తపాలా ముద్రగా 'రామ చిలుక' ముద్రించారు.
ది. 6-1-2013 న విడుదలైన ప్రత్యేక కవరు పై 'కొండపల్లి బొమ్మలు', దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మన జాతీయ పక్షి 'నెమలి' బొమ్మను ఉపయోగించారు.

Special Cover – Hyderabad Charminar
  Date Of Issue:-05.01.2013
Special Cover – Kondapalli Toys 
Date Of Issue:- 06.01.2013.

Friday, 4 January 2013

భారత తపాల శాఖ 2012 లో విడుదల చేసిన తపాలా బిళ్ళలు


Stamps Issued by India Post - 2012
భారత తపాల శాఖ  2012 లో  వివిధ సందర్బాలలో విడుదల చేసిన మొత్తం తపాలా బిళ్ళలు- 43,
మినియెచర్ షీట్స్ - 5, సావనీర్ షీట్ -1 వీటి విలువ రు. 360/-
ఈ ఏడాది మన తెలుగు వారికి సంభందించి ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల కాలేదు.
Total No. of stamps Issued by India Post :  42 + philately day = 43
Possible setenant combinations:
Civil Aviation, Dargah Sherif, Warli-Shekawati paintings, Olympics, Biodiversity, India-Israel, Lighthouse.
No. of Miniature Sheets: 5
No. of Sheetlets: 7 (Warli paintings, and  5 sets olympics, India-Israel)


Total Face Value of Stamps - Rs. 360 

100 years of Indian Science Congress

India Post issued a postal stamp on 3rd January 2013 to commemorate 100 years of Indian Science Congress.
Indian Science Congress Association (ISCA) is a premier scientific organisation of India, started in the year 1914 , with Headquarters at Kolkata.


The Centenary session of the Indian Science Congress is being held from 3rd to 7 th of January, 2013 at Kolkata.
The theme of the centenary session is "Science for shaping the future of India".


Indian Science Congress
Towards Scientific Temper:
The design of the stamp depicts the spirit of the centenary session of the Indian Science Congress. A child, tender, mouldable and the future of India, is observing a flower through a magnifying lens.
First Day Cover - ISC