"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 25 April 2016

జలో రక్షతి రక్షితః

MEGHADOOT POST CARDS ON  GROUND WATER PROTECTION
నీరే ప్రాణకోటికి జీవాధారం. అలాంటి జలాన్ని సంరక్షిస్తేనే మనం సుభిక్షితంగా జీవిస్తాం. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయటానికి మన తపాల శాఖ మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ పై సందేశాలను ముద్రించింది. 
2004 లో నార చంద్రబాబు అద్వర్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ కొరకు నడుంకట్టి దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. ఇంకుడు గుంటల ఆవశ్యకతను తెలియజేసి అదొక మహా యజ్ఞం లా చేపట్టింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 25 పైసల ఈ 'మేఘదూత్ పోస్ట్ కార్డ్స్' ఇచ్చే సందేశాలు గమనించండి. అయిన మనలో స్పందన లేదు. దాని పలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అప్పటిలా ఈ యజ్ఞాన్ని అపహాస్యం చేయకుండా మనస్పూర్తిగా చేపడదాం. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్బ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపండి. స్వర్ణ ఆంధ్రకు జై కొట్టండి.  
జలో రక్షతి రక్షితః
నీరు లేక ప్రగతి లేదు - నీరు లేక జగతి లేదు 
భూగర్బ జలం అముల్యమైనది -దానిని ఆదాచేయండి, కాపాడండి.
Ground Water is Precious ... Save it and Protect it
Ground Water is Precious ... Conserve, Augment, Protect 
భూగర్బ జలం అమూల్యము - కాపాడటం మన కర్తవ్యం 
Artificial recharge through Contour Bunding in Hilly Tettain
పారే నీటికి అడ్డు కట్ట వేయండి - నీటిని నిల్వ చేయండి 
Artificial recharge through Check Dams
ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే - వడిసి పట్టు 
Every Drop Counts ... Commit, Collaborate, Conserve
ఇంటింట ఇంకుడు గుంట - భవిషత్ కు జే గంట 
Roof Top Rain water Harvesting
వర్షపు నీటిని నిల్వచేయండి - నీటి ఎద్దడిని వెళ్ళగొట్టండి 

Friday, 15 April 2016

భారత రత్న బి. ఆర్. అంబేద్కర్ తపాల బిళ్ళ


Commemorative Stamp on Dr. B. R. Ambedkar & Constitution of India - 30th September 2015.
Dr.B.R. అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా మన తపాల శాఖ 30-9-2015 న మరొక  స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది.  Dr.B.R. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగం పేరుతో ఈ తపాలా బిళ్ళ విడుదలైంది . 
భారత రాజ్యంగ నిర్మాతగా ,దళిత బడుగు వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించటానికి రిజర్వేషన్స్ , ప్రతేక హక్కులు కల్పించిన నేతగా , మేధావిగా , బౌద్ద మతాభిమానిగా, అబినవ మనువుగా  కొనయాడబడే వ్యక్తి భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ (1891-1956). 
Dr.B.R. Ambedkar and Constitution of India 

వీరి గౌరవార్దం మన తపాల శాఖ ఇప్పటివరకు వివిధ సందర్బాలలో ఇంతకు పూర్వం  ఆరు తపాల బిళ్ళలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ, చాచా నెహ్రు ల తరువాత అత్యధిక తపాల బిళ్ళలు విడుదల చేసింది  అంబేద్కర్ పైనే 
75వ జయంతి 14-4-1966 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. B.R. Ambedkar  - 75th Birth Anniversary
Date of Issue - 14 -04-1966
83వ జయంతి 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. B.R. Ambedkar  - 83rd  Birth Anniversary
Date of Issue - 14 -04-1973

 అంబేద్కర్ శత జయంతి ని పురస్కరించుకొని 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. Bhimrao Ramji Ambedkar  - Birth Centenary
Date of Issue - 14 -04-1991


భారత రత్న బాబాసాయబ్ అంబేద్కర్ మరణాంతరం (6-12-1956) ముంబాయి లో  బౌద్ద మత పద్దతిలోఅంత్య క్రియలు జరిగాయి.  వారి తుది సంస్కారాలు జరిగిన ప్రదేశం లో 5-12-1971 న   బౌద్ద చైత్యం వలె నిర్మించిన స్మారక కట్టడం   ' చైత్య భూమి '. 
భారత తపాల శాఖ  అంబేద్కర్ 112 వ జయంతి ని పురస్కరించు కొని 14-04-2013 నఈ చైత్య భూమి  పై ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసింది.

Dr.B.R. Ambedkar - Chaity Bhoomi
 Chaity Bhoomi -  Mumbai - FDC
రోజువారి వాడకం లో ఉపయోగించే తపాల బిళ్ళలు ( Definitive Stamps) కుడా రెండు విడుదల చేసారు 
One on 14th April 2001(300), and  Second one on  9th March,2009(200)
 Definitive Stamp - 9th March,2009
Definitive Stamp - 14th April 2001