"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Saturday, 31 December 2016

మన అమర గాయకులు

మన తపాలా శాఖ 30-12-2016 న పది మంది అమర గాయకులు గౌరవార్థం ఒకేసారి పది తపాలా బిళ్లలను విడుదల చేసింది. వీటిపై షంషాద్ బేగం, గీతా దత్, హేమంత కుమార్ , ముఖేష్ , కిషోర్ కుమార్ , మహ్మద్ రఫీ, మన్నాడే, తలత్ మహమూద్, భూపేన్ హజారికా, టి. యం. సౌందర్యరాజన్ చిత్రాలు చోటుచేసుకున్నాయి. 

Sunday, 25 December 2016

సామ్రాట్ విక్రమాదిత్య

మన తపాలా శాఖ 22-12-2016 న సామ్రాట్ విక్రమాదిత్య పై ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఉజ్జయిని రాజధానిగా ప్రజలను జనరంజకంగా పాలించిన విక్రమాదిత్యుని కొలువులో భట్టి అనే మంత్రి ఉండేవాడని , వారు ఇద్దరు దేశ సంచారం చేసి రకరకాల సమస్యలను నివృత్తి చేశారనే కధలు "భట్టి విక్రమార్క కథలు" ( భేతాళ కథలు) పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అలాగే గుణాఢ్యని కథాసరిత్సాగరం  లోను, బృహత్కథామంజరి లోను విక్రమాదిత్యుని గురించి గొప్పగా చెప్పబడినది . 
క్రీస్తు పుట్టకముందు 57 ఏళ్ళనుండి మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వీరి పేరుతో 'విక్రమ శకం' పేరుతో కాలమానం ఉంది. చరిత్రకు అందని ఈ సామ్రాట్ విక్రమాదిత్య పై తపాల బిళ్ళను విడుదల చేయటం ముదావహం. 
Samrat Vikramadittya 

Saturday, 24 December 2016

కూచిపూడి నృత్యం


The Sangeet Natak Akademi currently confers classical status on six Indian classical dance styles: namely Bharatanatyam(TamilNadu), Kathak (North India), Kathakali (Kerala), Kuchipudi (Andhra Pradesh), Manipuri (Manipur), Odissi(Odisha),
India Post Issued a set of six stamps on these Indian classical Dances on 20-10-1975 
KUCHIPUDI - DANCE

మన భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను సుప్రసిద్ధం చేయటానికి తపాల శాఖవారు 20-10-1975 న ఆరు తపాల బిళ్ళలనువిడుదల చేసారు. వాటిలో మన తెలుగు వారి సాంప్రదాయపు కూచిపూడి నాట్యానికి  కుడాచోటు లభించింది.  
ప్రమంచవ్యాప్తంగా తెలుగు వారికి కాళాజగత్తు లో ఒక గుర్తింపు తెచ్చిన నృత్యం కూచిపూడి నృత్యం. 
భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది నవ్య ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. భరతనాట్యం తో కొంత సారూప్యం కలిగిన కూచిపూడి నృత్యం తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉంటుంది. దీని రూపకర్త 15 వ శాతబ్దికి చెందిన సిద్దేంద్ర యోగి. 
మన కూచిపూడి నాట్యం తో  పాటు దేశీయ నృత్య రీతులు అయిన  భరత నాట్యం, ఒడిస్సీ, కధాకళి ,మణిపూరి, హిందుస్తానీ నృత్య రీతులను కుడా ప్రతిబింబిస్తూ మొత్తం ఆరు తపాల బిళ్ళలు విడుదలచేసారు.


Greetings of Marry christmas

India post released a set of two postage stamps and a miniature   on 23-12-2016 in view of Season's Greetings of Marry Christmas  

భారత తపాలా శాఖ క్రిస్టమస్ పర్వ దినం శుభాకాంక్షలు తెలుపుతూ రెండు ప్రత్యేక తపాలా బిళ్ళలు 23-12-2016 న విడుదల చేసింది. వీటిపై క్రిస్టమస్ వృక్షం , శాంతా క్లాస్ ( బహుమతుల క్రిస్టమస్ తాత) ముద్రించారు. 
ఇంతకు ముందు 25-12-1999 న క్రిస్టమస్ పై ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు.
ఏసు క్రీస్తు జయంతి -2000

 70 ఏళ్ల తపాలా చరిత్రలో క్రిస్టమస్ కు విడుదల చేసిన తపాల బిళ్ళలు విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కావటం విశేషం. 

Saturday, 10 December 2016

విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం

A special cover was released on the ocassion of the inauguration of Andhra Pradesh Postal circle at Vijayawada on 11th October 2016
నూతన ఆంద్ర ప్రదేశ్ కు విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం ఏర్పాటు సందర్భంగా 11-10-2016 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  దీనిపై ఆంధ్రప్రదేశ్ పటం తో పాటు ఆంధ్రకు సంబంధించిన ఏడు తపాలా బిళ్ళల బొమ్మలు చూడవచ్చు. 
 Inauguration of Andhra Pradesh Postal circle 

Friday, 9 December 2016

అద్భుతమైన ఆలయం - అక్షరధామ్

Set of two Commemorative Stamps (Se-tenant pair) on Akshardham Temple, New Delhi and Pramukh Swami Maharaj was released by India Post on the occasion of Pramukh Swami Maharaj’s 96th Janma Jayanti Mahotsav held at Surat on 7th December 2016.
దేశ రాజధాని న్యూ దిల్లీ లో గల అద్భుతమైన ఆలయం - అక్షరధామ్, దాని నిర్మాణ సూత్రధారి ప్రముఖ్ స్వామి మహారాజ్ ల పై మన తపాలా శాఖ 7-12-2016 న జంట తపాలా బిళ్ళలు విడుదల  చేసింది 
 Se-tenant- Akshardham Temple, New Delhi and Pramukh Swami Maharaj

విదేశీ రామ చిలుకలు

Department of Posts issued six Commemorative Stamps and two Miniature Sheets on Exotic Birds on 5th December 2016
మన తపాలా శాఖ 5-12-2016 న విదేశీ రామ చిలుకలు పేరుతో ఆరు తపాలా బిళ్ళలు రెండు మినియేచర్స్ విడుదల చేసింది. వీటిపై విదేశాలలో కనిపించే అందమైన చిలుకల చిత్రాలు ఉన్నాయి 
Blue Throated Macaw, Sun Conure, Magnum Amazon

Cape Parrot, Hyacinth Macaw and Lesser Sulphur Crested Cockatoo 

Monday, 5 December 2016

Andhra Pradesh Social Welfare Residential Educational Institutions

A special cover was released in Vijayawada on 27th October 2016 to celebrate 30 years of Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society.


Wednesday, 16 November 2016

జాతీయ బాలల దినోత్సవం -2016

A set of 2 stamp and a miniature sheet was released by India Post on 14th November 2016 as part of Children's day with the theme "Picnic"
జాతీయ బాలల దినోత్సవం -2016 
ప్రతి సంవత్సరం నవంబర్ 14 న పండిట్ నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళల పై ముద్రిస్తారు. 
అలాగే ఈ ఏడాది  తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో పిక్నిక్ అనే అంశంపై వచ్చిన  ఉత్తమ చిత్రాలన్ని  బాలల దినోత్సవం  14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళల గా  విడుదల చేసారు.

Thursday, 3 November 2016

జాతీయ ఐక్యతా దినం

జాతీయ ఐక్యతా దినం గా సర్దార్ వల్లభాయ్ పటేల్  జన్మ దినం జరుపుకుంటున్న సందర్భంగహ 31-10-2016 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది. చీలికలు పీలికలు గా ఉన్న భారత దేశానికి ఒక సమగ్రతను సమకూర్చి ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ గారి  జయంతిని (అక్టోబర్ 31) నేడు దేశ సమగ్రతా దినం గా జరుపుకుంటున్నాం 
సర్దార్ వల్లభాయ్ పటేల్


మన దేశ మొదటి ఉప ప్రధాని, గృహ మంత్రి గా 560 పైగా ఉన్న సంస్థానాలను భారత్ లో విలీనంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం మన తపాలా శాఖ ఇప్పటివరకు విడుదల చేసిన తపాలా బిళ్ళలు. 


Vallabhai Patel ( 31 October 1965 ) - 90th Birth Anniversary

31 October 1975- Vallabhai Patel  - Birth Centenary


15 December 1997- Sardar Vallab Bhai Patel

27 November 2008 -Sardar Vallabhbhai Patel National Police Academy Hyderabad
DEFINITIVE STAMP - ISSUED ON 23 JAN 2001

DEFINITIVE STAMP - ISSUED ON 19 -05- 2016

Sunday, 30 October 2016

దీపావళి పై అమెరికా విడుదల చేసిన తపాలా బిళ్ళ

దీపావళి పండుగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ  అమెరికా తపాలా శాఖ 5-10-2016 న విడుదల చేసిన తపాలా బిళ్ళ. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి జ్ఞాన కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు. 

Saturday, 29 October 2016

వారణాసి పై తపాలా బిళ్ళ

Department of Posts released a commemorative stamp on Varanasi City on 24th October 2016.
Varanasi City - 2016
ప్రసిద్ధ హిందూ పుణ్య క్షేత్రం వారణాసి పై  మన తపాలా శాఖ 24-10-2016 న ఒక తపాలా 
బిళ్ళను విడుదల చేసింది. 
ఇంతకు ముందు వారణాసి స్నానవాటికల పై 3-10-1983 లో ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసారు. 
Ghats Of Vaaranasi -1983

Friday, 28 October 2016

అంతరించే ప్రమాదంలో ఉన్న భారతదేశ పక్షులు

ప్రమాదంలో ఉన్న భారతదేశ పక్షులు పై మన తపాలా శాఖ 17-10-2016 న విడుదల చేసిన నాలుగు తపాలా బిళ్ళలు. 

Saturday, 8 October 2016

స్వచ్ఛ భారత్

A set of 2 commemorative stamp and a miniature sheet on Swachh Bharat was released by India Post  on 2nd October 2016.

స్వచ్ఛ భారత్ 

Monday, 5 September 2016

మదర్ తెరిసా కి తపాలా బిళ్ళల తో నివాళి

To celebrate the canonisation of Mother Teresa as a saint, Department of Posts released a commemorative stamp in form of Miniature Sheet on 4-09-2016.
ప్రేమే లక్ష్యం - సేవే మార్గం అని ప్రబోధించిన మానవతా మూర్తి మదర్ తెరిసాకి దైవత్వాన్ని ఆపాదించిన సందర్భంగా మన తపాలా శాఖ 4-09-2016 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను మినియేచర్ లో భాగంగా విడుదల చేసారు.
  


ఇంతకు మునుపు మానవతా మూర్తి ,నోబెల్ అవార్డ్ గ్రహీత మదర్ తెరిస్సా పై మన తపాల శాఖ  1980 లో ఆమె జీవించి ఉండగానే ఒక తపాల బిళ్ళ ను విడుదల చేసింది. ఆమె మరణాంతరం   1997 లో ఒక  మినిఏచర్ ను , 2009 లో మరొక  సాధారణ తపాల బిళ్ళ ను విడుదల చేసింది. 
మదర్ తెరిస్సా మరణాంతరం 1997 లోను, ఆమె శతజయంతి సందర్బంగా 2010 లోను   ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసాయి. 
Other Commemorative Stamps released on   
MOTHER TERESA (1910 - 1997)
 
మరి కొన్ని తపాలా బిళ్ళలు కొరకు ఈ కింది పోస్ట్ చుడండి

Monday, 29 August 2016

Indian Metal Crafts

Department of Posts released a set of six commemorative stamps, Miniature Sheet and Sheetlet on Indian Metal Crafts on 26th August 2016.
Set of six stamps depicts Iron Surahi (pitcher), Bronze Nataraja (depiction of the God Shiva performing divine dance), Copper Pandan (container used to store betel leaf, betel nut, dry tobacco, lime etc.), Brass Incense Burner, Silver Spouted Lota (spherical water vessel) and Gold Gajalakshmi Lamp (lamp with motif of Lakshmi, the deity of wealth)

Thursday, 25 August 2016

షిర్డీ నాగ సాయిబాబా - మచిలీ పట్నం

Special Cover on World’s biggest Shirdi Sai Baba idol of Machilipatnam, Andhra Pradesh, on 13th August 2016.

ప్రపంచంలో ఈ తరహా విగ్రహాలలో పెద్దది అయిన షిర్డీ నాగ సాయిబాబా , మచిలీ పట్నం పై 13-08-2016 న తపాలా శాఖ ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది. 

Wednesday, 24 August 2016

Golden Girls of India - Pride of Nation

Special Cover on Golden Girls of India - P.V. Sindhu, Sakshi and Dipa - Pride of Nation - on 22nd August 2016.

 Golden Girls of India - Pride of Nation 

రియో ఒలంపిక్ క్రీడలలో వెండి పతకం  సాధించిన మన తెలుగు బిడ్డ  P.V. సింధు , మరియు మహిళా క్రీడా రత్నాలు సాక్షి మాలిక్ , దీపా కర్మాకర్ ల పై 22-08-2016 న  జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. అలాగే కర్ణాటక పోస్టల్ సర్కిల్ భారత ప్రభుత్వం ఇచ్చే క్రీడా పురస్కారాలు సందర్భంగా ఖేల్ రత్న - 2016 పేరుతో మరొక ప్రత్యేక తపాలా కవర్ 31-08-2016 న విడుదల చేసింది. 

Karnataka Postal Circle issued a Special Cover in honour of four Rajiv Gandhi Khel Ratna 2016 Awardees on 31st August 2016 at Bengaluru. (Special Cover approval no. KTK/14/2016).