Skip to main content

Posts

Showing posts from July, 2014

విజయవాడలో వైభవంగా ముగిసిన తపాలా బిళ్ళల ప్రద్రర్శన (APPEX -2014)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు జరిగి   వైభవంగా ముగిసినది.  2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన    తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో తెలంగాణా ,ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి తపాల బిళ్ళల సేకరణ కర్తలు పాల్గొని తమ తమ సేకరణలను ప్రదర్శించారు.  ఈ సందర్బం గా తపాలా శాఖ వారు ఆరు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు.  వీటిలో మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా  'తెలుగు వెలుగులు '  పేరుతో తెనాలి కి చెందిన   శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ  సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య  అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే.    ఈ ప్ర దర్శన కు  సాయి కృష్ణ కు  వెండి -రజిత  ( SILVER- BRONGE ) పతకం   బహుమతిగా వచ్చింది.   తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ ప్రదర్శన విశేషాలను  మన పాటకుల  కొరకు తదుపరి టపాలో పరిచయం చేస్తాను  శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ    ప్రదర్శించిన   'తెలుగు వెలుగులు 'ను వీక్షించు చున్నబ్లాగు రచయిత కొడాలి శ్రీనివాస్  APPEX-2014 లో విడుదల చేసిన ప్రత్యేక తపాలా

విజయవాడ లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాల బిళ్ళల ప్రదర్శన - APPEX 2014

విజయవాడ లో 2014 జూలై 24, 25, 26 తేది లలో  మూడు రోజులు పాటు  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలబిళ్ళల ప్రదర్శన జరగబోతున్నది.  విజయవాడ లో   1993 లో APPEX '93 పేరుతో ఈ రాష్ట్ర స్థాయి తపాల బిళ్ళల ప్రదర్శన జరింగింది.  మరల ఇప్పుడు  దాదాపు రెండు దశాబ్దాల తరువాత మన విజయవాడ లో ఈ తపాలబిళ్ళల వేడుక జరుగ బోతున్నది.   రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి జరుగుతున్న ఈ తపాల బిళ్ళల ప్రదర్శన ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. దీనికి విజయవాడ లో ఉన్న 'వేదిక' వేదిక గా నిలబోతున్నది. ఈ ప్రదర్శన సందర్బం గా మూడు రోజులలో మూడు ప్రతేక తపాల కవర్లు విడుదల చేయబోతున్నారు. మరిన్ని వివరాలకు - 0866-2577092,2578064 సంప్రదించవచ్చు. E-mail : appex2014vja@gmail.com APPEX 93 లో జరిగిన  ప్రదర్శన లో మన  ఒంగోలు గిత్త పై విడుదల చేసిన ప్రత్యేక తపాల కవరు Special cover on Ongole Bull  by India Post on 18-09-1993, on the occasion of APPX'93,at Vijayawada

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

On 26 - 12 -  1986 , The Department of Posts,India released a commemorative postage stamp on ALLURI SEETARAMA RAJU అల్లూరి సీతారామ రాజు (1897 - 1924 ) - సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించాలని తుది వరకు పోరాడి ప్రాణాలు విడిచిన విప్లవ వీరుడు మన అల్లూరి.మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి , వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసి తెల్ల వాళ్ళ పై సమర శంఖంఉదాడు.  దేశ దాస్య విముక్తి కొరకు ప్రాణ త్యాగం చేసిన ఈ విప్లవ వీరుని గౌరవార్దం 26 - 12 - 1986 న  మన తపాల శాఖ వారు ఒకప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.   First day cover on Alluri Seetharama Raju