శత వంసంతాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందనాలు.
ఈ విశ్వవిద్యాలయానికి 50 వసంతాలు నిండిన వేళ స్వర్ణోత్సవ సందర్భంగా 15-3-1969 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

ఈ విశ్వవిద్యాలయానికి 50 వసంతాలు నిండిన వేళ స్వర్ణోత్సవ సందర్భంగా 15-3-1969 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

A Commemoretive postage stamp on15 - 3 - 1969 Osmania university - Hyderabad
![]() |
OSMANIA UNIVERSITY- FIRST DAY COVER |
ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1918 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. 1,600 ల ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజాం రాజ్యానికి వచ్చి 25 ఏళ్ళు గడిచిన సందర్భంగా హైదరాబాద్ స్టేట్ తపాలా శాఖ 1936 లో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
![]() |
1936 లో హైదరాబాద్ స్టేట్ విడుదల చేసిన తపాలా బిళ్ళ |
Comments