"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 27 December 2012

చిట్టి రాయబారులు -నా తపాలా బిళ్ళల సేకరణ



నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు సందర్బంగా 
'చిట్టి రాయబారులు' 
ఆకట్టుకుంటున్న తపాలా బిళ్ళల సేకరణ 
అనే శీర్షిక తో 26-12-2012 న ఈనాడు దినపత్రిక  గుంటూరు జిల్లా సంచికలో ఒక వార్తా కధనం వచ్చింది. ఈ వార్తా కధనం లో నేను 1984 నుండి సేకరించిన తపాలా బిళ్ళల గురంచి, వాటిలో తపాలాబిళ్లల పై మన తెలుగు భాష, సంస్కృతి, జాతి వెలుగులు గురించి, స్టాంప్స్ ఆఫ్ ఆంధ్ర బ్లాగు గురించిన వివరాలు ప్రచురించారు. పూర్తి వివరాలకు కింది చిత్రాన్ని క్లిక్ చేయండి.
News in Eenaadu- Prof.Kodali Srinivas

Link :http://eenadu.net/district/inner.aspx?dsname=Guntur&info=gnt-panel3

Tuesday, 25 December 2012

ఆచార్య నాగార్జునుడు

India post Issued a Special Cover in Decennial celebrations of Guntur Numismatic & Philatelic Society (GNPS)on 4- 12 -2004. The cancellation on cover Shows the Statue of Acharya Nagarjunudu.
GNPS - దశాబ్ది ఉత్సవాల సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్
Acharya Nagarjuna (150-250 CE) is widely considered the most important Buddhist philosopher. He is credited with founding the Madhyamaka school of Mahayana Buddhism He is traditionally supposed to have written several treatises on rasayana alchemy as well as serving a term as the head of Nalanda University.
Acharya Nagarjuna Statue is often depicted in composite form comprising human and naga characteristics. Often the naga aspect forms a canopy crowning and shielding his human head. The notion of the naga is found throughout Indian religious culture, and In Buddhism, it is a synonym for a wise person.

ప్రత్యేక తపాలా ముద్ర -ఆచార్య నాగార్జునుడు 
GNPS  దశాబ్ది ఉత్సవాల సందర్బంగా  భారత తపాలా శాఖ 4-12-2004 న గుంటూరు లో ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ఉన్న తపాలా ముద్రను  ఆచార్య నాగార్జునుడు నాగ పడగ నీడలో ఆసీనుడై ఉన్న చిత్రం తో రూపొందించబడినది. ఇది గుంటూరు జిల్లా లో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రతిష్టించిన నాగార్జుని విగ్రహం యొక్క రూపం. బౌద్ద మతం లో నాగు పాము పడగ మేధావికి చిహ్నం గా పరిగణిస్తారు.
ఆచార్య నాగార్జునుడు (150-250 CE) 
బౌద్ద ఆచార్యుడు, మహాయాన బౌద్ధం ప్రచారకుడు, శూన్య వాద తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త, ఆయుర్వేద వైద్యుడు. అమరావతి మరియు శ్రీపర్వతం (నందికొండ/నాగార్జునసాగర్) ప్రాంతాలలో క్రీస్తు తరువాత 150-250 ఏళ్ల మద్య నివసించాడని చరిత్రకారుల అభిప్రాయం.

Monday, 24 December 2012

దీప స్తంభాలు - Light Houses of India

India Post issued Two stamps and  Miniature sheet , featuring Light Houses of India on 23 December 2012 with face value Rs 20 and Rs 5. These stamps depicts Light House of Alleppey and Mahabalipuram.
 Light House of Alleppey and Mahabalipuram
భారత తపాలా శాఖ 23-12-2012 న కేరళ లో ఉన్న అలెప్పి, తమిళనాడు లో ఉన్న మహాబలి పురం  లలో గల దీప స్తంభాలు(Light Houses) ఇతివృత్తంగా అందమైన ఒక లఘు బొమ్మ (మినియెచర్) మరియు రెండు తపాలా బిళ్ళలు విడుదలచేసింది.

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. కాకతీయ సామ్రాజ్యము(1083-1326)వెల్లివిరిసిన కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి.
కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత బహుమనీ సుల్తానులుగోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ చర్య తో భారత దేశం లో విలీనం చెందింది.
గొప్ప విషయం ఏమిటంటే, ఇంతకు ముందు నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కాక ముందు వారి  పాలనలో వాడిన తపాలా బిళ్ళపై కాకతీయుల ఓరుగల్లు కోట ద్వారం ముద్రించబడినది. మన తపాలా శాఖ వారు ఇంతవరుకు ఒక్క తపాలా బిళ్ళ కుడా కాకతీయుల పై విడుదల చేయలేదు.
నిజాం ప్రభుత్వం విడుదల చేసిన తపాల బిళ్ళ- కాకతీయ ద్వారం -వరంగల్లు 
తపాలా శాఖ వారు ప్రముఖ చారిత్రిక ప్రదేశాలకు ప్రత్యేక తపాలా ముద్రను కేటాయించటం ఒక సాంప్రదాయం. దానిలో భాగంగా వరంగల్లుకు ఒక ప్రత్యక తపాల ముద్రను  1-8-1975 లో కేటాయించారు. ఈ తపాలా ముద్రలో  కాకతీయుల ప్రతాప చిహ్నం గా బాసిల్లె కోట ద్వారం ఉంటుంది.
అలాగే 1981 లో ప్రతాప రుద్రుడు బొమ్మతో ఒక ప్రత్యేక తపాలా ముద్ర ను APPEX -81 లో విడుదల చేసారు. ఈ చిన్న గుర్తింపులు మాత్రమే మన కాకతీయుల చరిత్ర కు సంభందించినవి.
Special cover and Pictorial Post mark on
KAKATIYA GATE -WARANGAL (కాకతీయ ద్వారం -ఓరుగల్లు )
Date of Issue: 1-08-1975
The Special postal cancellation shows The last King 
Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.  
Date of Issue: 12-1-1981
కాకతీయులకు తపాలా బిళ్ళల పై గుర్తింపు ఏది?
ఇప్పటికైనా ఘన చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా మన తెలుగు వారి కీర్తి చాటేలా భారత తపాలా శాఖ వారు ప్రత్యేక తపాలా బిళ్ళలను ఈ కాకతీయ ఉత్సవాల సందర్బంగా విడుదల చేయాలి. రాణి రుద్రమ దేవి, కాకతీయ కోట ద్వారం, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి వంటి వాటిని ఇతివృత్తం గా తపాలా బిళ్ళలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి. పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందాలంటే తపాలా బిళ్ళలు విడుదల చేసి దేశ వ్యాప్త ప్రచారం చేయాలి.

అలాగే  గోవా, యానం(పుదిచ్చేరి) ప్రాంతాల విమోచనలకు గుర్తింపుగా తపాల బిళ్ళను విడుదల చేసిన తపాలా శాఖ  హైదరాబాద్ సంస్తానం (నిజాం) విమోచనకు కుడా తపాలా బిళ్ళ విడుదల చేయాలి. 

Saturday, 22 December 2012

గణితమేధావి శ్రీనివాస రామానుజన్


Every year December 22, the birthday of  Srinivasa Ramanujam is celebrated as National Mathematics Day.’  In view of this  India Post released a commemorative  postal stamp on  on  22-12-2012.

National Mathematics Day
Date of  Issue : 22 December 2012
 జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు.





Srinivasa Ramanajan - First Day Cover
ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది)
కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యాపారం చేసారు. ఒక్కో తపాలా బిళ్ళ 1000 రూపాయల దాకా అమ్మటం జరిగింది.
ఇంతక మునుపు 1994 లో బేగం అక్తర్ కు విడుదల చేసిన తపాలా బిళ్ళ విడుదల చేయకుండా ఆపటం దానిని డీలర్స్ 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే విడుదల చేయకుండా 2005 లో ఉపసంహరించిన గురు గ్రంధ సాయబ్ కుడా దాదాపు 1200 రూపాయలు పైనే పలుకుతున్నది. 1994 లో విడుదల చేసి మధ్యలో ఉపసంహరించిన నీటి పక్షులు కు సంబందించిన నాలుగు తపాలా బిళ్ళలు నేడు 4000 వేల వరుకు వుంది. 
ఇలాగే ఈ తపాల బిళ్ళ  కుడా మంచి ధర పలుకుతుందని ఆశ పడ్డవారి లెక్క తప్పింది. 2011  లో విడుదల చేయకుండా ఉన్న ఈ తపాల బిళ్ళను జాతీయ గణిత దినం సందర్బంగా 2012 లో విడులచేసారు. దీనివల్ల అధిక ధర తో ఈ తపాలా బిళ్ళను కొన్న అమాయక తపాలా సేకరణ దారులు నష్టపోయారు. అనదికారకంగా ఈ లెక్కల మేధావి తపాలా బిళ్ళలు దక్కించుకొని కోట్లు గడిద్దాం అని అనుకొన్న తపాల బిళ్ళల  వ్యాపారుల లెక్కలు తారుమారాయి.
పోయిన ఏడాది (22-12-2011 ) రామానుజం 125  వ జయంతి సందర్బంగా విడుదల చేయాలిసిన తపాలా బిళ్ళ స్థానం లో  క్రింద ఉన్న తపాల బిళ్ళను 'రామానుజం' పేరుతో  విడుదల చేసింది.

Srinivasa Ramanajan ( Mathametician ) 
Date of  Issue : 22 December 2011
Srinivasa Ramanajan - First Day Cover
ఇంతకు ముందు భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో కుడా శ్రీనివాస రామానుజం గారి  75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఒక  స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
Srinivasa Ramanajan ( Mathametician ) 
Date of  Issue : 22 December 1962

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబరు 221887ఏప్రిల్ 261920) మన దేశం గర్వించ దగ్గ గొప్ప  గణితమేధావి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.
గణిత శాస్త్రం లో  ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను జాతీయ గణిత  దినోత్సవంగా ‘National Mathematics Day’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  2012 ను జాతీయ గణిత సంవత్సరం గా ప్రకటించారు.
Srinivasa Ramanajan - First Day Cover

Tuesday, 18 December 2012

కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు

A Special Cover On KALIYUGA  BHIMA KODI RAMAMURTHI 
by India Post  on 28 -1- 1995

 కోడి రామ్మూర్తి నాయుడు
మన భారత తపాలా శాఖ వారు VIZNUPEX-'95 విజయనగరం లో జరిగిన సందర్బంగా కలియుగ భీముడు  కోడి రామ్మూర్తి నాయుడు గారికి నివాళిగా28-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం రాజకోట తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు. 

కోడి రామ్మూర్తి నాయుడు (1885 - 1942)

ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు, సర్కస్ వీరుడు.
మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్రలో  ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. 
ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. వీరు శ్రీకాకుళం  జిల్లా వీరఘట్టంలో జన్మించారు. 
మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు. 
బల ప్రదర్శన విశేషాలు -
  • గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
  • ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
  • రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
  • ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
  • 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1.5 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.

కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ,'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదులనుపొందారు.

Sunday, 16 December 2012

గుంటూరు జిల్లా చరిత్ర

India post Issued a Special Cover in Centenary celebrations of Guntur  District Formation on 1- 10 -2004.
Guntur  district Formation Centenary 
గుంటూరు జిల్లా అవతరణ జరిగి 100 వసంతాలు (1904 లో కృష్ణ జిల్లా నుండి విభజించబడినది) నిండిన సందర్బం గా  శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పుడు మన తపాలా శాఖ 1-10-2004 న  ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. దానిపై గుంటూరు జిల్లా కు ప్రాశస్తాన్ని కలిగించిన చారిత్రిక చిహ్నాలను ముద్రించారు. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధస్థూపంగల అమరావతి, అనంతపద్మనాభస్వామి కి అంకితమివ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు, కొండవీటి కోట,నాగార్జున సాగర్ ఆనకట్ట ,ఎత్తిపోతల జలపాతం,ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం ,శాతవాహన చక్రవర్తి వాసిష్టి పుత్ర శ్రీ పులుమావి వినియోగించిన నాణేలు దీనిపై ఉన్నాయి. గుంటూరు పేరుతో ఖ్యతి చెందిన  గోంగూర, మిరపకాయ,పొగాకు పంటలను సూచిస్తూ  వాటి ఆకులు దీనిపై చూడవచ్చు. ఈ కవరు పై ఉపయోగించుటకు  ఈ జిల్లా స్వరూపాన్ని చూపే మ్యాపు తో ప్రత్యేక తపాలా ముద్ర ను రూపొందించారు.
గుంటూరు జిల్లా చరిత్ర 
                గుంటూరు జిల్లాకు అతి పురాతనమైన చరిత్ర ఉంది. మౌర్యులుశాతవాహనులుపల్లవులుచాళుక్యులుకాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. ఆ పిమ్మట మొగలు సామ్రాజ్యంనిజాం పాలనల లో ఉంది. ఆ తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీల పాలన లో మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది.ఈ గడ్డ పై ఒకప్పుడు బౌద్ధం విలసిల్లింది. చరిత్ర ప్రసిద్ది పొందిన పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. భారత స్వాతంత్ర్య సమరంలో చీరాల - పేరాల, పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ వుద్యమం,తెనాలి క్విట్ ఇండియా ఉద్యమం  లాంటి ఎన్నో చారిత్రకఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి. స్వతంత్ర యోధులు ఆచార్య రంగా, కల్లూరి చంద్రమౌళి, వావిలాల, కవిత్రయం లోని తిక్కన, జాషువ,జంద్యాల పాపయ్యశాస్త్రి, కొసరాజు, తుమ్మల సీతారామమూర్తి వంటి కవులు,చిత్రకారుడు సంజీవదేవ్ ఈ జిల్లాకు చెందిన వారే.


 గుంటూరు జిల్లా మ్యాపు తో తపాలా ముద్ర ఉన్న పోస్ట్ కార్డ్ 

Thursday, 13 December 2012

యూరోపు దేశపు తపాలా బిళ్ళ పై తెలుగు అక్షరం

Telugu alphabet on EUROPA stamp 
Date of Issue: 9th May 2008
ఈ ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాయటం దాదాపుప్రపంచ వ్యాప్తంగా  అంతరించి పోతున్నది. ఉత్తరం రాయటం ఒక కళ. దీనివల్ల పిల్లలకు  భాషపై  పట్టును ఇస్తుంది. అవసంరం ఉన్న లేకున్నా పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించావలిసిన భాద్యత పెద్దలపై , ఉపాధ్యాయుల పై ఉంది.
ఈ మంచి ఉద్దేశంతో పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించటానికి యూరోపా దేశాలు 2008 లో 'లెటర్ రైటింగ్' అనే అంశం పై తపాలా బిళ్ళ లు విడుదల చేసాయి. 
ఈ అంశం పై విడుదలైన తపాలా బిళ్ళ లలో యూరోపా దేశాలలో ఒకటైన 'అన్డోరా' దేశం విడుదల చేసిన తపాలా బిళ్ళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ తపాలా బిళ్ళ ను   ప్రపంచం లో ఉన్న ప్రధాన భాషల లో గల మొదటి అక్షరం ఉండేలా రూపొందించి బడినది. 
అందంగా ఉన్న ఈ  తపాల బిళ్ళ పై  అనేక ముఖ్య భాషా అక్షరాల తో పాటు మన  తెలుగు అక్షరం ' అ ' కు కుడా  స్థానం లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే మన తెలుగు భాషకు సముచిత గౌరవం ఇచ్చిన 'అన్డోరా' దేశానికి అభినందనలు. 

Monday, 10 December 2012

తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాలు

సాదారణంగా మన తపాలా బిళ్ళ ల పై హిందీ మరియు ఇంగ్లీష్ భాష లలో వాటిని గురించిన  వివరాలు ముద్రించబడి ఉంటాయి. అరుదుగా  కొన్ని సందర్బాలలో మన ప్రాంతీయ బాషలు కుడా వాటిపై  చోటుసేసు కుంటాయి. అలా మన తెలుగు అక్షరాలు మన భారత దేశ తపాల బిళ్ళల పై మూడు సార్లు చోటు చేసుకున్నాయి. తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాల వివరాలు.

మొదటి సారి  16- 10 -1972 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన ఆంద్ర  కేసరి టంగుటూరి ప్రకాశం గారి స్మారక తపాలా బిళ్ళ పై ప్రకాశం పంతులు గారు  తెలుగులో పెట్టే సంతకం 'టం.ప్రకాశం'ముద్రించ బడినది.
ప్రకాశం గారి సంతకం తో ఉన్న తపాలా బిళ్ళ 

రెండో సారి  12-4- 1975 న ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్బం గా విడుదలైన తపాల బిళ్ళ పై 
'దేశ భాషల యందు తెలుగు లెస్స 'అన్న శ్రీ కృష్ణ దేవరాయల పలుకులు
'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' అన్న శ్రీ త్యాగరాజ స్వామి కృతి పదాలుతో పాటు
'పనస తొనల కన్న,కమ్మని తేనకన్న తెలుగు మిన్న' అనే  తెలుగు మాటలు ముద్రించ బడ్డాయి.


తెలుగు మహా సభల లో విడుదల చేసిన స్టాంప్ 

మూడోసారి  07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై ద్రావిడ భాషల పై విసృత  పరిశోధనలు చేసిన రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.
భాషా శాస్త్రవేత్త రాబర్ట్ క్లాద్వేల్

Thursday, 29 November 2012

ప్రపంచ తెలుగు మహా సభలు

ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని, వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను  పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం.
అంగరంగ వైభవం గా 1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి.

ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు 

హైదరాబాద్ లో 12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు తపాల బిళ్ళ వెల 25 పైసలుదాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు. 


A Commemorative postage stamp on world telugu conference 
Date of  Issue -   12 -04 -1975

'దేశ భాషల యందు తెలుగు లెస్స 'అన్న శ్రీ కృష్ణ దేవరాయల పలుకులు
'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' అన్న శ్రీ త్యాగరాజ స్వామి కృతి పదాలుతో పాటు 'పనస తొనల కన్న,కమ్మని తేనకన్న తెలుగు మిన్న' అనే మాటలు   తపాల బిళ్ళ పైన ముద్రించారు.
ఈ అక్షరాల పైన ఉన్న చదువుల తల్లి సరస్వతి శిల్పం నకలు ఒకటి  ఢిల్లీ లో ఉన్న జాతీయ పురాతన వస్తు ప్రదర్శన శాలలోను మరొకటి లండన్ మ్యుజియం లోను ఉంది.  వీటిని బికనూర్ ( రాజస్తాన్) లో ఒక జైన మందిరం నుండి సేకరించారు. సాధారణం గా సరస్వతి దేవి విగ్రహం హంస వాహనం పై వీణపాణి గా కన్పిస్తుంది. అయితే జైన మత గ్రంధాలలో వర్ణించ బడిన విద్యాదేవి పుస్తక పాణి గా ఉంటుంది.


తొలి రోజు విడుదల చేసిన  ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా  అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు. హైదరాబాద్ లో విడుదల చేసిన కవర్ పై తపాల ముద్రగా
తెలుగు సభల లోగో ముద్రించారు 
First day  cover - Hyderabad 
First day  cover-World Telugu Language Conference,calcutta 

వినియోగదారుల రక్షణ చట్టం -1986

On completion of 25 years of Consumer Protection Act -1986 ,India Post released a postal stamp on 29th November 2012
Consumer Protection Act of 1986 is an Indian federation law enacted in 1986 to protect interests of consumers in India. It makes provision for the establishment of consumer councils and other authorities for the settlement of consumers  disputes and for matters connected therewith.

Consumer Protection Act of 1986 
వినియోగదారుల రక్షణ చట్టం -1986
 సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం  కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) ను  1986 లోరూపొందించ బడినది.దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు యొక్క నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉండే దానివలన కలిగే ఆర్ధిక మరియు ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. దీనికి సంబందించిన తగాదాల పరిష్కారం కొరకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ సంస్థలను ఏర్పరిచి వినియోగదారుల హక్కులను కాపాడుతుంది. ఈ చట్టం చేసి 25 సంవత్సరాలు అయిన సందర్బంగా మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను 29-11-2012 న విడుదల చేసింది.

Thursday, 15 November 2012

2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?

ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు. 
అలాగే ఈ ఏడాది '2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?'అనే అంశం పై తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్నిఈ ఏడాది బాలల దినోత్సవం  14-11-2012 న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు. 
childern's day-2012
India Post released a stamp on 14th November 2012 to commemorate Children's day. As usual the stamp is based on the drawings made by children in a stamp Design competition organised by the Department of Posts.The theme of the competition this year was 'Post Office 2050'.

Thursday, 8 November 2012

సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు


Dr.DWARAM VENKATASWAMY NAIDU
India post Issued a Commemorative postage stamp on 8-11-1983.
ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964 ) గొప్ప వయెలిన్ (వాయులీనం) విద్వాంసుడు. భారత ప్రభుత్వం వీరికి  1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా చేరి, 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.వయోలిన్ వాయిద్యంతో ఒంటరిగా  కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇచ్చి వయోలిన్ కి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చారు.
కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే.
సంగీతం అనేది "వివిపించే తపస్సు" అనీ, ఏరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ  తన శిష్యులకు చెప్పేవాడు.
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడి గారి శతజయంతి సందర్బంగా (8-11-1993 ) న మన తపాల శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
First day cover

Tuesday, 23 October 2012

విజయ దశమి -Dussehra

అందరికి దసరా శుభాకాంక్షలు

చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపు కునే పండుగే  దసరా పండుగ. మన దేశం లో  హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన విజయ దశమి  పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 7-10-2008 న  రెండు  ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు.
దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా ను సూచిస్తూ ఒకటి ,
మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు సూచిస్తూ  మరొకటి  తపాలా బిళ్ళలు విడుదల చేసారు.
బాలల దినోత్సవం సందర్బంగా 14-11-2005 లో దసరా ఊరేగింపు పై ఒక తపాల బిళ్ల విడుదలైంది.

Monday, 22 October 2012

చైనా యుద్ధం - THEY DEFEND

Artillery and Helicopter
Sentry and  Parachutists
చైనా యుద్ధం ముగిసిన పిదప మన సిపాయులలో ఆత్మ విశ్వాసం నింపటానికి They Defend పేరుతో మన తపాల శాఖ 15-08-1963 న రెండు తపాల బిళ్ళలు విడుదల చేసింది.

Saturday, 20 October 2012

INPEX -2013 ,National Stamp Show

INPE X -  2013 – National Stamp Show (21 – 25 February 2012)
Organized by Philatelic Society of India in collaboration with India Post


Wednesday, 17 October 2012

జీవవైరుధ్య సదస్సు- తపాలా బిళ్ళలు

మన హైదరాబాద్ లో జరుగుచున్న జీవవైరుధ్య సదస్సు పై తపాల శాఖ వారు 16-10-2012 న నాలుగు తపాలా బిళ్ళలు మరియు ఒక మినీ ఏచర్ విడుదల చేసారు. వీటిపై  మన దేశంలో అంతరించిపోతున్న ప్రాణుల బొమ్మలు ముద్రించారు. 
Miniature sheet 
India Post released a set of 4 stamp and a miniature sheet on Endemic Species of Indian Biodiversity Hotspots on 16th October 2012.

 1.Bugun Liocichla:This species has been clasified as vulnerable under International Union for Conservation of Naturee (IUCN) Red List.
 2.Nicobar MegapodeAs the name suggest this species is endemic to the NicobarIslands, India. The total number of their breeding pairs was estimated at 788 in 2006.
 3.Hoolock Gibbon: This species, the onle ape in India is a forest dweller. This spieces is an important seed disperser. Its diet includes mostly ripe fruits with some flowers, leaves and shoots.

 4.Venated Gliding Grog: This critically endangered spieces of frog is restricted to the Indira Gandhi National Park and its surrounding in Tamilnadu, in the South Western Ghats, within an altitudinal range of 1000-1300 metres.