"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Saturday, 24 August 2013

మై స్టాంప్ - వ్యకిగత తపాలాబిళ్ళ

తపాల బిళ్ళ పై సాదారణంగా జాతీయ నాయకులు, ప్రసిద్ది పొందిన కవులు,కళాకారులు, క్రీడాకారులు బొమ్మలు మాత్రమే ఉంటాయి . అయితే కొద్దిగా మార్పు తో సామాన్యులు సైతం తమ బొమ్మను (బ్రతికి ఉన్నప్పుడే) తపాలా బిళ్ళ పై చూచుకునే అవకాశం వచ్చింది. తపాలా బిళ్ళల సేకరణ పై అభిరుచి పెంచటానికి మన తపాలా శాఖ 'My Stamp'  పేరుతో తొలిసారి 2011 లో డిల్లీ లో జరిగిన అంతర జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన లో వ్యకిగత తపాలా బిళ్ళలు విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా భారత తపాలా శాఖ 23-8-2013 నుండి విజయవాడ లో కొత్తగా' మై స్టాంప్ ' (నా తపాలాబిళ్ళ) పేరుతో వ్యక్తుల అభీష్టం మేరకు వారు కోరుకున్న చిత్రం తో తపాలా బిళ్ళలు విడుదల చేయాటానికి శ్రీకారం చుట్టింది. తమ బొమ్మతో 5 రూపాయల విలువగల 12 తపాలా బిళ్ళల గల ఈ మై స్టాంప్ షీట్ ను  300 రూపాయలకు విజయవాడ ప్రధాన తపాలా కార్యాలయం లో పొందవచ్చు. 17 రకాల తపాలా బిళ్ళల కాంబినేషన్ తో ఈ 'మై స్టాంప్' షీట్స్ లబిస్తాయి. ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం మరియు పోటో తీసుకొని వెళ్లి ఈ తపాలా బిళ్ళను పొందవచ్చు. 
మై స్టాంప్ నమూనా చిత్రం 

Wednesday, 14 August 2013

జై హింద్ -15 ఆగష్టు 1947

మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారిగా తపాల బిళ్ళను 1947 నవంబర్ 21 న  విడుదల చేసారు.
దానిపై మన  జాతీయ జండా తో పాటు ' జై  హింద్' అనే నినాదం హిందీలోను  -15 AUG 1947 అని ముద్రించ బడినాయి.
ఆ తరువాత డిసెంబర్ 15 న మరో రెండు తపాల బిళ్ళలు ముద్రించారు. వాటిపై మన జాతీయ చిహ్నం (సారానాథ్ లోని  అశోక స్థంబం పై ఉన్న నాలుగు సింహాల బొమ్మ) మన స్వేచ్చకు గుర్తుగా నింగిలో విహరించే విమానం ముద్రించ బడినాయి.  
 INDIAN NATIONAL FLAG
DATE OF ISSUE :21 -11 -1947 
National Emblem of India -The Lion Capital of Asoka 
DATE OF ISSUE :15 -12 -1947 
Indian  Airplane.
DATE OF ISSUE :15 -12 -1947