"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 30 January 2015

'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన తపాల బిళ్ళలు

India Post released 3 stamps and one miniature sheet on 30-1-2015 on the theme of Swachh Bharat 
SWACHHA BHARAT - 30-1-2015
మన తపాల శాఖ  మహాత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకొని 30-1-2015 న  'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన చిత్రాలతో మూడు తపాల బిళ్ళలు, వాటితో ఒక  మినిఎచార్ ను విడుదల చేశారు. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, పరిశుద్ద జలం వంటి వాటిపై అవగాహన కల్పించే లా ఇవి ఉన్నాయి.  మోడి మొదలపెట్టిన స్వచ్చ్ భారత్ ను చంద్రబాబు చెప్పే స్వచ్చ ఆంద్ర సాదించటానికి పతి ఒక్కరు పని చేయాలి. గాంధీజీ కన్న కలలు నిజం చేయాలి. పతివారు మరుగు దొడ్డి వాడేలా చేసి మనం నాగరికులమని చాటాలి. 

Monday, 12 January 2015

రాష్ట్ర పండుగ - సంక్రాంతి

రైతుల లోగిళ్ళలో సంబురంగా జరిగే సంక్రాంతి (పొంగల్) పై శ్రీ లంక దేశం 2014 లో రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ విడుదల చేసింది. 
Pongal -Sri Lanka 
మన దేశంలో ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన తపాల శాఖ  కుడా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 12-1-2006 న విడుదల చేసింది.

PONGAL - HARVEST FESTIVAL, Date of Issue: 12-1-2006
సంక్రాంతి 
తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించారు. 
రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక లలో సంక్రాంతి అని, తమిళనాడు లో పొంగల్ అని,మహారాష్ట్ర, గుజరాతు లలో మకర్‌సంక్రాంతి అని, పంజాబు, హర్యానా లలో లోరీ  అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. 
పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. 
భోగినాడు భోగిమంటలు,బొమ్మల కొలువులు, పిల్లలకు భోగిపళ్లు వంటి వాటితో తెలుగు లోగిళ్ళు సందడిగా ఉంటాయి.
ఈ  పండుగకు వచ్చిన కొత్త అల్లుడు ని 'బావా ,బావా పన్నీరు,బావను పట్టి తన్నేరు' ... అంటూ  మరదళ్ళు చేసే ఎకసెక్కాలకు ఆట పాటలకు ,సరదాలకు,పిండి వంటలు ముఖ్యంగా అరెసలు ఈ పండగ ప్రత్యేకత. 
గంగిరెద్దులు,హరి దాసులు,పగటి వేషగాళ్ళు,ఆటల పోటీలు, పశువుల పందేలు,కోడి పందేలు ... ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.

Saturday, 10 January 2015

గన్నవరం లో ఉన్న 'దత్త పాదుకలు' పై ప్రత్యేక తపాల కవరు

A Special Cover on Datta Padukalu released by India Post at Vijayawada on 31st December 2014.


మైసూరు దత్త పీటాధిపతి శ్రీ గణపతి సచ్చితానంద స్వామీజీ చే  కృష్ణా జిల్లా గన్నవరం (విజయవాడ) లో నెలకొల్పబడిన 'దత్త పాదుకలు'  పై మన తపాల శాఖ 31-12-2014 న ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసారు. కవరు పై గన్నవరం లో ఉన్న దత్తాత్రేయ పాదుకా ఆలయం  ముద్రించారు, ప్రత్యే తపాల ముద్రలో కుర్మారూప పీటం పై ఉన్న దత్తత్రేయ పాదుకలను చూడవచ్చు. 

Friday, 9 January 2015

ప్రవాస భారతీయ దివస్

జనవరి 8,1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆప్రికా నుండి తిరిగి వచ్చి మన దేశ స్వాతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించి విజయాన్ని సాదించారు. ఆ దినాన్ని మనం ప్రవాస భారతీయ దివస్ పేరుతో జరుపుకుంటున్నాం. విదేశాలలో ఉన్న మన దేశవాసులు మన దేశం కొరకు తమ వంతు సహాయ సకారాలు అందించాలన్నదే దిని ప్రధాన ఉద్దేశం. ప్రవాసం నుండి గాంధిజీ మన దేశం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 8-1-2015 న  మన తపాల శాఖ వారు రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసారు.  

100 years of Gandhiji's returns to India
India Post released a set of two stamps and Miniature sheet on 100 Years of Mahatma Gandhi's return to India on 8-1-2015 
Pravasi Bharatiya Divas (PBD)   is celebrated on 9th January every year to mark the contribution of Overseas Indian community in the development of India. 
January 8 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa, led India's freedom struggle and changed the lives of Indians forever.

Saturday, 3 January 2015

LIST OF STAMPS ISSUED BY INDIA POST IN 2014

మన తపాల శాఖ 2014 లో విడుదల చేసిన తపాల బిళ్ళలు