Skip to main content

Posts

Showing posts from 2018

UNESCO World Heritage Sites in India -1 రాజస్థాన్ లో కోటలు

యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు  UNESCO World Heritage Sites in India- 1, పేరుతో   29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  దీనిపై  ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లో గల ఆరు చారిత్రాత్మక కోటలు - 1. కుంభాల్ ఘర్, 2. చిత్తోర్ ఘర్, 3. జైసల్మేర్ , 4. గగ్రోన్, 5.రతంబోర్, 6. అజ్మీర్ హిల్ ఫోర్ట్  లు చోటుచేసుకున్నాయి. 

National Police Memorial

మన స్వాతంత్రం వచ్చిన 1947 నుండి నేటివరకు దేశ పౌరుల రక్షణలో ప్రాణాలు అర్పించిన 34484 మంది పోలీసుల స్మృతి చిహ్నం గా 21- 10 2018 న ఢిల్లీ లో నిర్మించిన జాతీయ పొలిసు మెమోరియల్ కు గుర్తుగా మన తపాలా శాఖ 22-12- 2018 న రెండు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.   

తపాలా కవరు పై పద్మ విభూషణ్ డా. అక్కినేని

తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారి 95వ జన్మదినం సందర్భంగా మన తపాలా విభాగం ఒక ప్రత్యేక తపాలా కవరును 19-09-2018 న హైదరాబాద్ లో విడుదల చేసింది. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.  SPECIAL COVER ON Dr. A.N.R. 

ప్రపంచ పురుషుల హాకీ పోటీలు

ప్రపంచ పురుషుల హాకీ పోటీలు ఒరిస్సా లో జరిగిన సందర్భంగా మన  తపాలా శాఖ వారు 28-11-2018 న 5 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది. ఈ మినియేచర్ మనదేశంలో విడుదలైన మొదటి ఆడ్ షేప్ మినియేచర్. 

జాతీయ బాలల దినోత్సవం -2018

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2018 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "మత సామరస్యం"(Communal Harmony) అనే అంశం పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక తపాలా కవర్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 10,11 అక్టోబర్ 2018 న తొమ్మిది   ప్రత్యేక తపాలా కవర్లు (AP/17to 26/2018) విడుదల చేసింది. వీటిపై పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు, హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు, చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి వార్ల  భిన్న చిత్రాలతో ఈ 9 కవర్లు ఉన్నాయి.  వీటి అన్నింటిపై ఒకే  శంఖు ,చక్ర ,నామ లతో ప్రత్యేక తపాలా ముద్ర  ఉన్నాయి  పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి సింహ  వాహనం పై వెంటేశ్వర స్వామి ముత్యాల పందిరి  వాహనం పై మలయప్ప స్వామి సర్వభూపాల వాహనం పై శ్రీనివాసుడు  కల్ప వృక్ష వాహనం పై శ్రీ మలయప్ప స్వామి  గరుడ  వాహనం పై  శ్రీనివాసుడు  మోహిని అవతారంలో శ్రీ మహా విష్ణువు 

ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ - My Stamp

India post issued   My Stamp (64th Issue) postal sheet on  Andhra Pradesh Tourism on 26-6-2018 ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ  వారు మన తపాలా శాఖ వారు కలసి మై స్టాంప్ లో భాగంగా నవ్యంధ్రలో ఉన్న మొదటి స్థానంలో ఉన్న 12 ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై పోస్టల్ స్టాంప్స్ ను 26 జూన్ 2018 న విడుదల చేశారు.  ఈ తపాలా బిళ్ళల వెల ఒక్కటి 5 రూపాయలు కానీ,మొత్తం  12 తపాలా బిళ్ళలు ఉన్న షీట్ వెల మాత్రం  500 రూపాయలు.  వీటిపై మన నవ్యంధ్ర లో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు తిరుమల, విజయవాడ కనకదుర్గ , శ్రీశైలం దేవాలయం, కృష్ణా గోదావరుల పవిత్ర సంగమం, అమరావతి ధ్యాన బుద్ధ , గండికోట , చంద్రగిరి కోటలు, విశాఖ పట్నం RK బీచ్, అరకు లోయ బుర్రా గుహలు, గిరిజన ప్రదర్శన శాల, పాపి కొండలు, పులికాట్ సరస్సు  వంటి అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.  Tirumala Temple తిరుమల దేవాలయం    Kanak Durga Temple, Vijaywada, కనకదుర్గ దేవాలయం, విజయవాడ                      శ్రీశైలం దేవాలయం గండికోట లోయ  RK బీచ్ - విశాఖపట్నం  గిరిజన మ్యూజియం - అరకు  చంద్రగిరి కోట  పవిత్ర సంగమం -విజయవాడ  పు

మహాత్మ గాంధీ 150 వ జయంతి - వృత్తాకారంలో తపాలా బిళ్ళలు,

మహాత్మ గాంధీ 150 వ జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 2-10-2018 న ఏడు వృత్తాకారపు తపాలా బిళ్లలను  విడుదలచేసారు. ఇలా వృత్తాకారంలో మన దేశంలో తపాలా బిళ్ళలు, వాటితో పాటు ఒక మినియేచర్ ను  విడుదల చేయటం ఇదే మొదటసారి. వీటిపై గాంధీజీ జీవితం లో జరిగిన ముఖ్య ఘట్టాలు, ఆఫ్రికా లో న్యాయవాదిగా మొదలుకొని మహాత్మునిగా మారిన అంశాలు ముద్రించారు. వీటితో ఇప్పటి వరకు మహాత్మా గాంధీ పై మన తపాలా శాఖ విడుదల చేసిన తపాలా బిళ్ళల సంఖ్య 65 కు చేరుకుంది.  In a first, India Post  issued a miniature sheet with seven round-shaped stamps on Mahatma Gandhi on 2-10-2018 in connection with his 150th birth anniversary celebrations. The stamps, tracing the life of Gandhi from a young lawyer in South Africa to the Mahatma, carry messages of non-violence, cleanliness, service to the needy, truth, and simplicity.   The miniature sheet is inscribed with Gandhi’s quote ‘My life is my message.’

India - Serbia Joint issue

    India post Issued a miniature on 70 years of Diplomatic relations with Serbia on 15 -09 2018 . The miniature shows the great scientist Nikola Tesla and Swami Vivekanada.
మహాత్మా గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పిన  దక్షిణ ఆఫ్రికా లో పీటర్ మార్టిన్ బర్గ్ రైల్ సంఘటన జరిగి 125 సంవత్సరాలు  మరియు నల్ల సూరీడు నెల్సన్ మండేలా శత జయంతిని పురస్కరించుకొని భారత్ - దక్షిణ ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా  26-7-2018 న  ఒక ప్రత్యేక మినియేచర్ను విడుదల చేశారు.

డా. సి.నారాయణ రెడ్డి గారిపై ప్రత్యేక తపాలా కవరు

పద్మభూషణ్ అవార్డు గ్రహీత ,జ్ఞానపీట్ పొందిన కవి డా. సి.నారాయణ రెడ్డి 87 వ జన్మదినం సందర్భంగా హెదరాబాద్ తపాలా శాఖ  26-7-2018 న ఒక ప్రతీక తపాలా కవరు విడుదల చేశారు. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో సినీరంగం లోకి ప్రవేశించి అనేక మధుర గీతాలను రాసారు. తెలుగు గజల్స్ కు రూపకర్త. 

B. నాగిరెడ్డి పై తపాలా బిళ్ళ

మన తపాలా శాఖ 23-02-2018 న B. నాగిరెడ్డి పై తపాలా బిళ్ళ విడుదల చేసింది.  బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1912-2004) గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, విజయ వాహిని పిచ్చర్స్ అధినేత, చందమామ పత్రిక ముద్రాపకుడు, చక్రపాణి - నాగిరెడ్డి గా సుపరిచితుడు. దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నిర్మించిన సినిమాలలో పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ ప్రముఖమైనవి. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి   ప్రముఖ దర్శకుడు  దాదాసాయబ్ పాల్కే అవార్డు గ్రహీత     B .N. రెడ్డి  ( బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి )గారు వీరి సోదరుడే. వారికి కూడా 16-12- 2009 లో మన తపాలా శాఖ ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

సీత రామ స్వయంవరం -ASEAN INDIA Summit Stamps

మన తపాలా శాఖ  25-1-2018 న 11  ఆసియా దేశాల సదస్సులో ఆయా దేశాల కు సంబంధించిన అంశాలతో 11 తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  వీటిలో 8 దేశాలకు సంధించిన అంశాలలో రామాయణం ఇతివృత్తంగా ఉంది.  మన దేశానికి సంబంధించి సీత రామ స్వయంవరం ఘట్టాన్ని సూచిస్తున్న చిత్రం    "పట్టం కథ" పేరుతో  ముద్రించబడినది.    దీనికి  ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన కలంకారీ వస్త్రం పై రూపొందించి చిత్రం మాతృక. ( Source : Indra Gandhi National center  for arts )  India Post issued 11 stamps in denomination of Rs. 5 each on ASEAN INDIA Commemorative Summit 2018 on 25th January-2018.  Eleven stamps depicts Torana Gate - Malaysia, Menyembah – Brunei, Pattam Katha, Ramayana Darangen – Philippines, Phra Lak Phra Lam – Laos, Ramayana – Indonesia, Yama Zatdaw - Myanmar, Khon - Thailand, Sri Mariamman Temple – Singapore, Kate Festival – Vietnam, Kumbhakaran, Angkor – Cambodia.

List of India Stamps -2017

1 Splendours of India – (1) Ganesh Pol, Amber Fort, Jaipur (2) Pashmina Shawl, Kashmir (3) Chhau Mask (4) Bodhi Tree, Sandstone Relief Sculpture, Sanchi (5) Sarota, Areca Nut Cutter (6) Peacock Gate, City Palace, Jaipur (7) Chaitya Hall, Karle (8) Thanjavur (Tanjore) Painting (9) Blue Pottery, Jaipur (10) Coloured Glass Window, Bagore Ki Haveli, Udaipur (11) Parchinkari, Pietra Dura (12) Zardozi Carpet, Agra. 01.01.2017 2 350th Prakash Utsav - Guru Govind Singh 05.01.2017 3 India Portugal Joint Issue 07.01.2017 4 Dr. M. G. Ramachandran 17.01.2017 5 Nature India - Peacock, Elephant, Crane, Tiger, Butterfly, Deer 25.01.2017 6 India Post Payments Bank 30.01.2017 7 Headgears of India 10.02.2017 8 The Poona Horse 11.02.2017 9 Ramjas College 13.02.2017 10 Ladybird Beetle 23.02.2017 11 Yogoda Satsanga Society of India 07.03.2017 12 Means of Transport 25.03.2017 13 Cub Scouts 30.03.2017 14 Deekshabhoomi 14.04.2017 15