Skip to main content

Posts

Showing posts from 2019

అమరావతి స్టాంప్ & కాయిన్ ఫెస్టివల్

GNPS - (Guntur Numismatic and Philatelic Society)  25 వ వార్షికోత్సవం సందర్బం గా 2019 డిసెంబర్ 14, 15 తేదిలలో గుంటూరులో 'అమరావతి స్టాంప్   మరియు  కాయిన్ ఫెస్టివల్ పేరుతో తపాల బిళ్ళలు ,నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో 2 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలోఅరుదైన వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడ్డాయి.  మహాత్మా గాంధీ 150 వ జయంతి సంవత్సర సందర్భంగా పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్ ను విడుదల చేసారు.  గుంటూరులో ప్రముఖ ప్రజా వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  GNPS రజతోత్సవ ప్రత్యేక సంచిక ను విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు జరిపి బహుమతులు ఇచ్చారు.  పొందూరు ఖద్దర్ తో ఉన్న ఒక ప్రత్యేక తపాల కవర్  ప్రముఖ వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు   ప్రత్యేక తపాల కవర్ 

Childrens Day - .2019.

India Post issued a set of two Commemorative Postage Stamps of denominations Rs15 & Rs15 and a Miniature Sheet on the occasion of Children's Day on 14.11.2019.  జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14న మన తపాలా శాఖ ప్రతి ఏడాది ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేస్తుంది. దానిలో భాగంగా వివిధ అంశాలలో బాలలకు చిత్ర లేఖనం పై పోటీలు నిర్వహించి వాటిలో బహుమతి పొందిన వాటితో తపాలా బిళ్ళలు విడుదల చేస్తారు.  ఈ ఏడాది బాలల హక్కులపై వచ్చిన చిత్రాలతో 14-09-2019 న రెండు తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదల చేసారు. 

గురు నానక్ దేవ్ - 550వ జన్మ దినం

శిక్కు మతం వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ గారి 550వ జన్మ దినం సందర్భంగా మన తపాలా శాఖ నవంబర్ 9, 2019న గురు నానక్ జీవితం తో ముడి పడి ప్రసిద్ధి పొందిన ఐదు గురుద్వారాల ఇతివృత్తంగా ఐదు తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదలచేశారు.  India Post on 09.11.2019, issued a set of 5 Commemorative Postage Stamps of denominations Rs10,Rs10,Rs10,Rs15 and Rs10 and a Miniature Sheet portraying five sacred Gurudwaras on the historic occasion of 550th Birth Anniversary of Guru Nanak Dev Ji. 

చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలు

మన దేశంలో 16 వ శతాబ్దాలలో నిర్మించిన అనేక చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలలో ఎనిమిది పైన మన తపాలా శాఖ 19-10-2019న 8 తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  వీటిపై ఆగ్రాకు సమీపంలో ఉన్న ఫతేపూర్ సిఖ్రీ లో ఉన్న బులంద్ దర్వాజా, బికనీర్ లోని కోట గుమ్మం, జైపూర్లోని జొరవర్ గేట్, జోధాపూర్ సర్దార్ మార్కెట్ గేట్ , కాశ్మీర్ గేట్ ఢిల్లీ, రూమి దర్వాజా లక్నౌ, మ్యాగజైన్   గేట్ అజ్మీర్ , ఢిల్లీ గేట్  స్థానం లభించింది. India Post issued a set 8 Commemorative Postage stamps on 'Historical Gates of Indian Forts and Monuments' on 19.10.2019. The stamps depict Buland Darwaza, Fatehpur Sikri; Kote Gate, Bikaner; Jorawar Gate,Jaipur; Sardar Market Gate,Jodhpur; Kashmere Gate,Delhi; Roomi Darwaza,Lucknow; Magazine Gate,Ajmer and Delhi Gate,Delhi.

సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలు-2

Scented Stamps on Indian Perfumes-2 India post issued a set of 4 scented commemorative postage stamps and Two miniature sheets on Indian Perfumes on 15.10.2019. Two of these stamps depict agarwood and the other two stamps depict orange blossom.each stamps are of denomination rs 25/- మన తపాలా శాఖ 15 - 10 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను , రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి అగార్ చెక్క, ఆరంజ్ బ్లోసమ్ వాసనలతో వచ్చాయి. ఇంతకుముందు మన తపాలా శాఖ 01- 08 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి గంధపు చెక్క, మల్లె పువ్వు వాసనలతో వచ్చాయి.
మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా 2-10-2019 న మన తపాల శాఖ ఆరు అష్టభుజ తపాలా బిళ్ళలు  మినియేచర్ తోపాటు విడుదల చేసింది. 25 రూపాయల విలువగల ఈ అష్టభుజ తపాలాబిళ్ళలు మన దేశంలో ముద్రించటం ఇదే మొదటసారి. వీటిపై గాంధిజీ చిన్ననాటి ఫోటో నుండి తుది వరకు వివిధ సంఘటనలు చోటుచేసుకున్నాయి.  గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి. 

Indian Fashion Series 3

భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  మరొకసారి  సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి.  ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  31-12 -2018 న సిరీస్ -1 పేరుతో  4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి.  మరొకసారి  సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ సంప్రదాయ  వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి.    Fashion Designer- Concept to Consumer Indian Fashion Series 3

Master Healers of AYUSH

India post issued a set of 12 stamps on  scholars and master healers of Ayush ( Alternative Medicine) on 30-08-2019 అల్లోపతి వైద్యం కు ప్రత్యామ్యాలుగా చెప్పే మన ప్రాచీన వైద్య విద్యలు ఆయుర్వేదం , యోగ , పకృతి మూలికా వైద్య, యునాని ,హోమియోపతి వంటి వాటిలో లబ్దప్రతిష్ఠిలైన 12 ప్రముఖ వ్యక్తుల పై మన తపాలా శాఖ 30=08-2019 న 12 తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  Master Healers of AYUSH

మొదటి ప్రపంచ యుద్ధం లో భారతీయులు

మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 20 - 08- 2019 న మన తపాలా శాఖ నాలుగు మియేచర్స్ ను  15 తపాలా బిళ్లలను విడుదల చేసింది. ఈ భయంకర యుద్ధంలో మన దేశ సిపాయిలు ఎంతోమంది అసువులు బాసారు. వారికి నివాళిగా ఇవి విడుదల చేశారు.     వాయు సేన లో పోరాడిన యోధులు   వివిధ ప్రదేశాలలో ఉన్న మన వీరుల స్మారక కట్టడాలు    వివిధ ప్రదేశాలలో  జరిగిన యుద్ధ సన్నివేశాలు                                        

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు

మన తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు(ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.  తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అక్కినేని 256 సినిమాలలో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకున్న నట సామ్రాట్. దేశంలో రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు దాదా సాయబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అందాల నటుడు.  Special cover on Akkineni Nageswararao 

మహాత్మా గాంధీ జ్ఞాపికలు

మన తపాలా శాఖ వారు ఆగష్టు 15 ,2019న మన దేశంలో ఉన్న మహాత్మా గాంధీ జ్ఞాపికలపై  ఒక పోటీ నిర్వహించి వాటిలో ఉత్తమం అయిన ఫోటో లతో రెండు తపాలా బిళ్ళలు విడుదల చేశారు. వీటిపై గోవా లో ఉన్న స్థానిక బాలికతో ఉన్న గాంధీజీ విగ్రహం , ఢిల్లీ లో ఉన్న ఉప్పు సత్యాగ్రహం కు 11 మందితో  వెళుతున్న గాంధిజీ విగ్రహం( గాంధీ గెరా మూర్తి ) చోటు చేసుకున్నాయి. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి. 

సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలు

Scented Stamps on Indian Perfumes India post Issued Two miniature sheets and 4 stamps each Rs.25/- on Indian Perfumes Sandal wood and Jasmine on 01-08-201 మన తపాలా శాఖ 01- 08 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను , రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి గంధపు చెక్క, మల్లె పువ్వు వాసనలతో వచ్చాయి.  

INDIA -KOREA JOINT ISSUE

India  and Republic of Korea jointly released new set of two stamps and a miniature for on  30-07-2019  on diplomatic relations between India and Korea

Indian Fashion through the Ages

భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  మరొకసారి  సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ సంప్రదాయ  వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి.  ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  31-12 -2018 న సిరీస్ -1 పేరుతో  4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. 

అహింస పరమో ధర్మ - మహాత్మ గాంధీ

మన తపాలా శాఖ  17-06 -2019 న "అహింస పరమో ధర్మ" పేరుతో  మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసారు . గాంధీజీ నిర్మించిన  సబర్మతి ఆశ్రయం 1917 జూన్ 17న ప్రాంభించబడినది. 

జలియన్ వాలాబాగ్ మారణహోమం

వంద ఏళ్ల క్రితం 13-04-1919 లో జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణహోమం తలుచుకుంటూ, ఆనాటి అమర వీరులకు నివాళి గా మన తపాలా శాఖ 13-04-2019 న రెండు తపాలా బిళ్లలను ఒక మినియేచర్ను విడుదల చేసింది 

GUNTUR PEX - 2019

                     మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన ' GUNTUR PEX - 2019 , గుంటూరులో ఫిబ్రవరి 2019,  19,20,తేదీలలో తపాలా శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా మహాత్మాగాంధిజీ పై రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేశారు  ఈ ప్రదర్శనలో గాంధీజీ పై వచ్చిన తపాలా బిళ్లలతో గాంధీజీ జీవితాన్ని ,ఆయన ఆశయాలను చాలా అద్భుతంగా తెలియజెప్పే ప్రయత్నం అనేకమంది తపాలా సేకరణ కర్తలు విజయవంతంగా చేశారు.         ఈ ప్రదర్శన సందర్భంగా తపాలా శాఖ గాంధీజీ పై రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసింది. పాఠశాల విద్యార్థులకు క్విజ్, వకృత్వ, వ్యాసాల యందు పోటీలు జరిగాయి. ముగింపు లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ ప్రదర్శనలో ఎంతో శ్రమకోర్చి తపాలా బిళ్ళలు ప్రదర్శించిన సేకరణ కర్తలందరికి ఙ్ఘాపికలు ఇచ్చారు.  ఈ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ఒక ఫిలాటలిస్ట్ గా నేను "స్ట్రుగుల్ ఫర్ ఫ్రీడమ్" పేరుతో మూడు ఫ్రేమ్ ల తపాలా బిళ్లలను ప్రదర్సించాను.               కొడాలి శ్రీనివాస్ కు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్క

Geographical Indication Registered Handicraft Products

భౌగోళిక గుర్తింపు పొందిన(GI) మన దేశపు హస్తకళా వస్తువుల పై మన తపాలా శాఖ వారు 5 తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ని 31-12-2018 న విడుదల చేసారు. జయపూర్ నీలం రంగు కూజాలు , పాలక్కాడ్ మద్దెల , కర్నటక కాంశ్య విగ్రహాలు, కుచ్ ఎంబ్రాడర్ వస్త్రాలు , బీహార్ లోని సిక్కి లో గడ్డితో తయారైన వస్తువులు వీటిపై చోటు చేసుకున్నాయి. 
75th Anniversary of the  First Flag Hoisting at Port Blair నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా INA   ద్వారా మొదటిసారి మన జాతీయ పతాకం పోర్ట్ బ్లెయిర్ లో ఆవరిష్కరించిన సంఘటన జరిగి 75 ఏళ్ళు అయిన మన తపాలా శాఖ 30-12-2018 న మూడు తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.