"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 30 July 2010

తపాల బిళ్ళపై షిర్డీ సాయి బాబా

A Commemorative postage stamp on
SHRI SHIRDI SAI BABA
Date of issue :20 -05-2008 
SAI BABA - MAXIMUM CARD
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను  అందుకొన్న షిర్డీ సాయి బాబా పై మన తపాల శాఖ వారు 20-05-2008 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.1858 లో షిర్డీ కి వచ్చి 1918లో  సమాధి సిద్ది  వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు.

తిరుమల - ప్రత్యేక పోస్టల్ ముద్ర


Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK

 
Date of Issue : 06-11-1976
తిరుమల  శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం ముదావహం.
తిరుమల  తపాల కార్యాలయానికి కేటాయించిన ప్రత్యేక పోస్టల్ ముద్ర లో పద కవితా పితామహుడు అన్నమయ్య చిత్రం,ఆసందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై శ్రీవారి ఆనందనిలయం లో ముఖిళిత హస్తాలతో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవారాయల కాంస్య విగ్రహాలు చిత్రించారు. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా  వారిపై త్వరలో ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల చేయబోతున్నారు.

Thursday, 29 July 2010

మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలు

MEGHADOOT POST  CARDS  - Dwrakaa Tirumala and Simhachalam 
శ్రీ వెంకటేశ్వర ఆలయం,ద్వారకా తిరుమల 
శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి   దేవాలయం,సింహాచలం 
అన్ని దానాలలోకి అన్న దానం మిన్న అనేది నానుడి. దేవాలయాలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రం అనేది ఒక పుణ్య కార్యంగా తలచి మన రాష్ట్రంలో అన్ని ముఖ్య దేవాలయాలలో ఒక పధకం ప్రవేశపెట్టారు. దీనికి విరాళాలు ఇవ్వవలిసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం, ద్వారకా తిరుమల వారు, విశాఖజిల్లాలో ఉన్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,  వారు ఇచ్చిన అన్నదాన  ప్రకటనలు ఉన్న మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ఇవి. 

Wednesday, 28 July 2010

అన్నవరం గుడి




Special Cover issued at EGNPEX-2009 ,KAKINADA on 
Sri Veera Venkata Satyanarayana Swamy Temple, Annavaram. 
Date Of Issue:- 26.06.2009.
కాకినాడ లో జరిగిన తూర్పు గోదావరి జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన (EGNPEX -2009 ) లో అన్నవరం  లో కొలువై ఉన్న  శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం యొక్క ప్రాముఖ్యత ను చాటి చెప్పటానికి ఒక ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసారు. మన రాష్ట్రం లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన  శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1934 లోనే జరిగినా స్వల్ప కాలంలోనే   చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది.

Tuesday, 27 July 2010

మంగళగిరి రాజ గోపురం

Set of 3 Special Covers issued in
  GUNPEX 76
SRI  LAKSHMI NARASIMHA TEMPLE -RAJA GOPURAM   (1809A.D.) MANGALAGIRI



అమరావతి ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారిచే 1809 లో నిర్మంచిన మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ గాలి గోపురం మన రాష్ట్రం లో ఉన్న వాటిలో అతిపెద్దది. 
15 మీటర్లు (49ft) వెడల్పు 46 .70 మీటర్లు ఎత్తు  (157ft)  తో పదకొండు అంతస్తుల ఈ గాలి గోపురం (రాజ గోపురం)  మన దేశం లో ఉన్న ఎత్తైన వాటిలో మూడవది.  
మార్చ్ 13 -15 ,1976 లో గుంటూరు  జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో (GUNPEX-76)  మంగళగిరి  రాజ  గోపురం  తో ఉన్న కవరు పై 3 ప్రత్యేక పోస్టల్  ముద్రలతో మూడు   తపాలా కవర్లు  విడుదలచేశారు.



Sunday, 25 July 2010

శ్రీ వెంకటేశ్వర ఆలయం - బృందావన్ గార్డెన్స్ ,గుంటూరు

Guntur Numismaic and Philatelic Society celebrated its 15th Anniversary from 4th to 6th December, 2009 at Guntur. India Post released Three special covers on this occasion .
గుంటూరు లో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో మూడు ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. గుంటూరు తిరుమల గా ప్రశిద్ది చెందిన బృందావన్ గార్డెన్స్  శ్రీ వెంకటేశ్వర ఆలయం పై ఒకటి, ఆ ఆలయ ప్రాంగణం లో ఉన్న అన్నమయ్య  కళా వేదికపై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. ప్రతి రోజు ఒక కార్యక్రం నిర్వహిచటంలో అన్నమయ్య  కళా వేదిక 'లిమ్క బుక్ అఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది. వీటి తో పాటు గుంటూరు సమీపం లో ఉన్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పై కుడా మరొక కవర్ విడుదల చేశారు.


1. 10th Anniversary-Sri Venkateswara Swamy Temple, Brundavan Gardens, Guntur
Date Of Issue:-04.12.2009.


2. Annmayya Kala Vedika, Guntur
Date Of Issue:-05.12.2009.


3. Uppalapadu Bird Sanctuary, Guntur Distrist
Date Of Issue:-06.12.2009.

రాజ మహేంద్రవరం కోట

Special Cover-Rajamahendravaram Fort,
Egnpex 2009, Kakinada

.
Date Of Issue:-28.06.2009
రాజమహేంద్రవరం  రాజధానిగా చేసుకొని ఆంద్ర ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళిక్యులలో రాజ రాజ నరేంద్రుడు (1022AD -1063AD ) ప్రముఖుడు.వీరి కాలంలోనే నన్నయ్య భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
కాకినాడలో జరిగిన EGNPEX -2009 లో రాజమహేంద్రవరం కోట (921AD -1580AD ) చాయా చిత్రం తో ఒక ప్రత్యేక కవర్ 28 -6 -2009 న విడుదల చేసారు. దీనికి తూర్పు చాళిక్యులు ఉపయోగించిన రాజముద్ర (615AD -1077AD ) ను పోస్టల్ క్యాన్సిలెషన్ గా వాడటం ముదావహం.


Friday, 23 July 2010

మన హాస్య నటులు - రేలంగి, సూర్యా కాంతం

Special Cover-Comedians Of Telugu Cinema, 
Egnpex-2009, కాకినాడ, Date Of Issue:27.06.2009.
 
Relangi and Suryakantham, Comedians of Telugu Cinema
మన తెలుగు వెండి తెర హాస్య నటులు - రేలంగి, సూర్యా కాంతం గౌరవార్దం తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ లో  (EGNPEX -2009) జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో 27-06-2009 న విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ కవరు మరియు ప్రత్యేక పోస్టల్ ముద్ర. ఈ కవరు పై మన ప్రముఖ దర్శకుడు బి.యన్.రెడ్డి తపాల బిళ్ళను చూడవచ్చు.

Wednesday, 14 July 2010

తపాలా బిళ్ళపై జగన్నాధుని రధ చక్రాలు

 
COMMEMORATIVE POSTAGE STAMP ON
RATH YATRA -PURI  
ప్రతి ఏటా జరిగే 'పూరి  జగన్నాధుని  రధ యాత్ర' పై మన తపాల శాఖ  
12 -07 -2010 న ఒక తపాల బిళ్ళ ,దానితో పాటు ఒక మినిఎచార్ విడుదలచేసింది.

Saturday, 10 July 2010

Stamps on Pigeon & Sparrow

పిచ్చుకలు - పావురాళ్ళు 
మన  గుమ్మం  లో గంతులేసే పిచ్చుకలు,పావురాళ్ళు అంతరించి పోతున్న పక్షుల జాబితాలో చేరాయి.ఇక వాటిని మనం బొమ్మలలో చుసుకోవాలేమో ! రాబోయే ముప్పును నివారించే మార్గాల అన్వేషణలో తపాల శాఖా వారు ఈ పక్షులపై రెండు తపాల బిళ్ళలు మరియు ఒక మినిఎచార్ 09 -07 -2010 న విడుదల చేసారు.




Miniature Sheet - Pigeon & Sparrow
Date Of Issue : 09.07.2010.

MAHATMA GANDHI -3

"An eye for an eye makes the whole world blind." 
MAHATMA GANDH
మహాత్మా  గాంధీ  పై ప్రపంచంలో అనేక దేశాల వారు ప్రత్యేక తపాల బిళ్ళలను విడుదల చేసి ఆ అహింసా మూర్తికి ఘన నివాళి ఇచ్చారు. వాటిలో ఆంటిగువ & బార్బుడా దేశం వారు 1984 లో రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు. వాటిలో ఒకటి గాంధీ బొమ్మతోనూ మరొకటి 1931 లో గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత లండన్ నుండి ఫ్లోకేస్తోన్ కు రైలు లో ప్రయాణించే సమయాన రైలు కిటికిలో నుండి బయటికి చూస్తున్న గాంధీ గారి చిత్రం. ఇంకా గాంధిజీ తో ఆనాడు ప్రయాణం చేస్తున్న సరోజినీ నాయుడు, గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ ఉన్నారు.



A set of two stamps issued in 1984 by 
ANTIGUA & BARBUDA  
 MAHATMA GANDHI  AND  LEAVING LONDON BY TRAIN -1931 
Mrs.Sarojini Naidu,who accompanied him to Folkestone is also shown looking out the train window ,others in this stamp are Gandhi personal assistant Pyarelal and Madeline Shade.

A SET OF TWO STAMPS ISSUED ON INDIAN NATIONAL PHILATELIC EXHIBITION -1970
ONE RUPEE STAMP SHOWS - BA- BAPU 


Gandhi marching to Dandi 



JAGLAL CHOWDHARY - ISSUED IN 2000




RAMCHARAN AGARWAL - ISSUED IN 2009


MAHATMA GANDHI & NONVIOLENCE
DEFINITIVE ISSUED ON:  2-10-2009

Wednesday, 7 July 2010

Mahatma Gandhi -2

Mahatma Gandhi Stamps



SG # 308 (1948) Mahatma Gandhi


SG # 305 (1948)


SG # 306 (1948)
SG # 307 (1948)
Issued in 1948 on the 
First Anniversary of Independence

---------------------------------------------------------------------------------------




SG # 595 (1969)
SG # 598 (1969)


SG # 596 (1969)
SG # 597 (1969)
Issued in 1969 to mark 
The Birth Centenary



________________________________________________




SG # 983 & 984 (1980)
Issued in 1980 to commemorate the Dandi March 
(Defiance of Salt Tax law)
______________________________




SG # 1596 & 1597 (1994)
Issued in 1994 to mark 
125th Birth Anniversary
________________________________



SG # 1637 & 1638 (1995)
Issued in 1995 to mark 
India - South Africa Co-operation
________________________________



SG # 1775-1778 (1998)
Issued in 1998 to mark the 50th Death  Anniversary
________________________________


SG # 2021 & 2022 (2001)
Man of the Millennium
 Issued in 2001
________________________________


SG # 693 (1973)SG # 1094 (1983)
GANDHI AND NEHRU
Issued in 1973 in commemoration
AICC Quit India Resolution, August 1942 
issued in 1983 - Indian Struggle for Freedom 
________________________________


SG # 910 (1979)

Issued in 1979 to mark
International Year of the Child
----------------------------------------------------------

SG # 1511 (1992)

Issued in 1992 to mark 
50 years of
Quit India Resolution
_______________________________

Sunday, 4 July 2010

MAHATMA GANDHI

మహాత్మా గాంధీ పై విడుదలైన తపాల బిళ్ళలు


మహాత్మా గాంధీ, మదర్ తెరిసా,లింకన్,లూధర్ కింగ్
60 YEARS OF UNIVERSAL DECLARATION OF HUMAN RIGHTS

DATE OF ISSUE : 08 - 12- 2008

Mahatma Gandhi - Father of the Nation

Issued in 2000 to mark the new Millennium
And
50 years of the Republic of India
Issued on 30th January,2000


ఇండియా, దక్షణ ఆఫ్రికా ల మధ్య సత్ సంభందాలు పెంపు కొరకు మహాత్మా గాంధీ పై మన తపాల శాఖ విడుదలచేసిన మొదటి మినీఎచరు :


Issued in 1995 to mark India - South Africa Co-operation
DATE OF ISSUE : 2 - 10 1995



CENTENARY OF SATYAGRAHA

Date of Issue: 2-10- 2007

దక్షణ ఆఫ్రికాలో గాంధీ చేసిన సత్యాగ్రహం శత జయంతికి విడుదలైన మినిఏచర్



75 YEARS OF SALT SATYAGRAHA

date of issue : 5-04-2007

మహాత్మా గాంధీ (దండి మార్చ్) ఉప్పు సత్యాగ్రహం చేసి 75 వసంతాలు నిడిన సందర్బం గా విడుదలైన మినిఏచర్

Saturday, 3 July 2010

స్వామి రామానంద తీర్థ

Heros of Freedom Struggle

SWAMI RAMANANDA TEERTH

Date of Issue: 15 -08 -1999

స్వామి రామానంద ౧౯౦౩ (1903 - 1972) స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటేష్ భావు రావు ఖెడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903 లో గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామం లో జన్మించారు. లోకమాన్య బాల గంగాధర తిలక్ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు. వీరి గౌరవార్దం 15 - 08 - 1999 ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదలైయింది.