"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Wednesday, 27 November 2013

కంచరపార మరియు జమలపూర్ రైల్వే వర్క్ షాప్స్

India Post released a New Set of  Two Stamps and one Miniature sheet for Railway Workshops - Kanchrapara and Jamalpur " on 26th November 2013.
తూర్పు రైల్వే పరిధి లో ఉన్న కంచరపార మరియు జమలపూర్ లో ఉన్న రైల్వే వర్క్ షాప్స్ కు 150 ఏళ్ళు నిండిన సందర్బంగా 26 - 11 -2013 న మన తపాల శాఖ రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసింది.

                                         Railway Workshops - Kanchrapara ,Jamalpur 

Saturday, 16 November 2013

జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు- సచిన్ కొరకు సడలించిన నియమం

చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి.
ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది. మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు. 
Dr. M. VISWESVARAYA(15-9-1960)
నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది .

ఈ కోవలో  1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన  మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే  ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో (మరణం 1962లో)  ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది. 
1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన  వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం కు(మరణం 1980లో)ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.
ఆ తరువాత  నిండునూరు ఏళ్ళు జీవించిన గొప్ప వ్యక్తులు లేక ఆ సంప్రదాయం మళ్లీ రాలేదు.



DR.D.K.KARVY(18-4-1958)


WELTHY FISHER(18-3-1980)


అలాగే  1979 లో నోబుల్ ప్రైజ్ అందుకున్న సందర్బంగా 1980 లో  మదర్ తెరిసా కి కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసి విమర్శల పాలైంది. ఆ తరువాత ఆమె మరనాతరం మరో మూడు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. 
MOTHER TERESA (27-8-1980)



















రాష్ట్రపతి కి తపాల బిళ్ళతో వీడుకోలు 
మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది. 
1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు.
ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. రాష్ట్రపతి తో సహా జీవించి ఉన్న వారికి ఇకపై తపాల బిళ్ళలు విడుదల చేయకూడదను కున్న నియమాన్నిపెట్టుకుంది . 
Centenary of Indian National Congress-portraits of Congress Presidents
28-12-1985
ఆ తరువాత ఇక ఎట్టి పరిస్థితులలోను జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళలు విడుదల చేయమని చెప్పారు. అయితే 1985 లో మరోసారి అలవాటులో పొరపాటుగా కాంగ్రెస్ పార్టీ 100 వసంతాలు జరుపుకుంటున్న సందర్బంగా ఆ పార్టీకి అధ్యక్షులగా పనిచేసిన 61 మంది వ్యక్తుల బొమ్మల తో నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. అప్పటికి బ్రతికి ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి , సంజీవ రెడ్డి ,శంకర్ దయాళ్ శర్మ వంటి వారితో పాటు  చివరి బొమ్మ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ చిత్రాలను ఒక తపాలా బిళ్ళ వచ్చింది . ఈ తపాలా బిళ్ళ తో మరల విమర్శలు వచాయి .
ఆ తరువాత మరల ఇప్పటివరకు మన తపాలా శాఖ జీవించి ఉన్నవారికి తపాలా బిళ్ళ వేయలేదు. 
సచిన్ కొరకు సడలించిన నియమం 
 క్రికెట్ క్రీడ నుండి నిష్కక్రమిస్తున్న సాచి టెండూల్కర్ కొరకు తపాల శాఖ తన పాత నిర్ణయాన్ని మార్చుకుంది.  తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం తో ఆగమేఘాల మీద (2013 లో విడుదల చేసే తపాలా బిళ్ళలను 2012 లోనే నిర్ణయిస్తారు) సచిన్ కు ఒకటి కాదు ఏకంగా రెండు తపాలా బిళ్ళలు వాటితో పాటు ఒక మినిఎచర్ ఒక షీట్ లేట్ విడుదల చేసింది. సాదారణంగా వ్యక్తుల కు 5 రూపాయల విలువగల  3 లక్షలు తపాలా బిళ్ళలు విడుదల చేస్తారు. కాని సచిన్ కు రెండు రకాల 20 రూపాయల తపాలా బిళ్ళ లు ,ఒక్కోటి 30 లక్షల చొప్పున వెరిసి 60 లక్షలు విడుదల చేశారు. వీటి తో పాటు 24 లక్షల 40 రూపాయల విలువగల మినియెచర్లు, 16 లక్షల 320 రూపాయల విలువగల షీట్ లెట్ (16 స్టాంప్స్ ) ను విడుదల చేసారు . సచిన్ పై ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా చేసుకోవటానికి మన తపాల శాఖ ఇంత వెలతో తపాల బిళ్ళలు విడుదల చేసింది . 
SACHIN TENDULKAR (14-11-2013)
 ఈ విషయం లో మన తపాలా శాఖ (ప్రభుత్వం) మరల విమర్శకులకు పని కల్పించింది. క్రికెట్ అనేది నేడు ఒక వ్యాపార క్రీడ. కోట్లాది డబ్బు దిని చుట్టూ తిరుగుతుంది.  ఈ వ్యాపారం లో తన వంతుగా తపాల బిళ్ళలు అమ్మి  (కొన్ని చిన్న దేశాలు తపాల బిళ్ళలు అమ్ముకొని డబ్బు సంపాదిస్తాయి )డబ్బు గడించాలనే తపాల శాఖ  వైఖరి నిజంగా గర్హనీయం. 

Thursday, 14 November 2013

Children's Day - 2013

India Post released a stamp  on 14th November 2013 to celebrate Children's Day
Children's Day - 2013

ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు. 
అలాగే ఈ ఏడాది  తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్ని  బాలల దినోత్సవం  14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు. 

సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం - తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం

India Post released two postal Stamps and one miniature sheet, one Sheet let  On 14th November 2013, to honor Sachin Tendulkar, on veiw of his 200th test match at Mumbai. 
Sachin Tendulkar - miniature sheet
మన తపాలా శాఖ వారు అభిమాన క్రికెట్ క్రీడాకారుడు  సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం తో సత్కరించారు . మన దేశం లో జీవించి ఉన్న ఎ క్రీడా కారునికి దక్కని గౌరవం ఒక్క సచిన్ కె దక్కింది. 
200 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ  క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న సందర్బం గా 14-11-2013 న సచిన్ టెండూల్కర్ పై రెండు తపాలా బిళ్ళలు (Rs 20/-), ఒక మినిఎచర్, ఒక షీట్ లెట్ ను విడుదల చేసారు. మన తపాలా శాఖ సాదారణంగా జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళ విడుదల చేయదు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి సచిన్ కు తపాలా బిళ్ళలు విడుదల చేసి తమకు క్రికెట్ పిచ్చి ఉందని ప్రపంచానికి చాటుకుంది. 


Sachin Tendulkar -  sheet let

Wednesday, 13 November 2013

భారతీయ విద్య భవన్

India Post released a stamp on 7th November 2013 to commemorate 75 years of Bharatiya Vidya Bhavan, which was set up by Dr. K.M Munshi in 1938

Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi
భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తోస్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం  మున్షీ  గారు స్థాపించారు . "Let noble thoughts come to us from every side" అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది. 
Dr. K.M.Munshi - Stamp Issued in 1988

నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు -
  • Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram
  • Bhavan's Vidyashram - Guntur
  • Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad
  • Bhavan's Vidyalaya - Hyderabad
  • Bharatiya Vidya Bhavan's Public School - Vidyashram, Hyderabad 
  • Bhavan's Vidyashram - Hyderabad
  • International Residential Public School - Rajahmundry
  • Bhavan's Varalakshmi Vidyashram - Rajam
  • Bhavan's Public School - Ramachandrapuram, Hyderabad
  • Bhavan's Kamala Rani Sanghi Public School - R.R. District
  • Bhavan's Sri Ramakrishna Vidyalaya - Sainikpuri
  • Bhavan's Residential Public School - Tadepalligudem
  • Bhavan's Sri Venkateshwara Vidyalaya - Tirupati
  • The Primary School, Visakha patnam 

Friday, 1 November 2013

భాక్ర డ్యాం - దేశ సేవలో 50 వసంతాలు

India Post released a stamp depicting the Bhakra Dam on 22nd October 2013 to celebrate 50 years of its glorious service of the Nation
Golden Jubilee of Bhakra Dam
భాక్ర డ్యాం సట్లేజ్ నది పై హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో నిర్మించ బడినది.  ఆధునిక దేవాలయం గా నెహ్రు గారిచే కీర్తించబడిన భాక్ర డ్యాం  225.25 మీ ఎత్తు తో మన దేశం లోఎత్తేయిన ఆనకట్టలలో  రెండోవ స్థానం లో ఉంది. దీనికి దిగువన మరో ఆనకట్ట నంగల్ లో ఉంది. ఈ రెంటిని కలపి భాక్రా నంగల్ ఆనకట్ట గా ప్రసిద్ది చెందినవి .
1955 లో మొదలు పెట్టి 1963 లో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ బహుళార్దక ఆనకట్ట 50 ఏళ్లుగా మన దేశానికి ఉపయోగ పడుతున్నది.  ఈ  స్వర్ణోత్సవ వేళ మన తపాలా శాఖ 22-10-2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.  ఇంతకు ముందు కుడా ఈ డ్యాం పై రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు. 

A Definitive stamp on Bhakra dam - 15-3-1967

Silver Jubilee of Bhakra dam - 15-12-1988