Skip to main content

Posts

Showing posts from November, 2017

జాతీయ బాలల దినోత్సవం -2017

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2017 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "నెస్ట్ " (గూడు) పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు. 

భారతీయ వంటకాలపై తపాలా బిళ్ళలు

ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన తపాలా శాఖ ద్వారా కమ్మని నోరూరించే మన భారతీయ వంటకాలపై 24 తపాలా బిళ్ళలు 3-11-2017 న విడుదలైనాయి. ఈ వంటకాలను పండుగ వేళ వండుకునే పబ్బాలు - పిండివంటలు , దేవుడి కి గుళ్లో ప్రసాదాలుగా చేసేవి, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన వంటకాలుగా, దేశ విదేశాలలో అంతటా ప్రాముఖ్యతను సంతరించుకున్నదేశీయ  వంటకాలాగా నాలుగు తరగతులుగా విభజించి నాలుగు మినియేచర్లు కూడా  విడుదల చేసారు.  వీటిలో తిరుపతి లడ్డు, హైదరాబాద్ బిరియానీ. గుత్తి వంకాయ కూర, కజ్జి కాయ, దోశ- ఇడ్లి వంటి మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయి.  భారతీయ వంటకాలు  పండుగ పబ్బాలు - పిండి వంటలు   దేవుని ప్రసాదాలు    ప్రాంతీయ వంటలు   అందరు మెచ్చే వంటకాలు 

ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పై తపాలా బిళ్ళలు

మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు. ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన (మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ  దినోత్సవం  కూడా అదే) బెంగళూరులో విడుదల చేశారు. కవి ముద్దన, ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా