"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Sunday, 14 May 2017

మహాత్మా గాంధీజీ చంపారన్ సత్యాగ్రహమ్

India post released a set of three stamps and one miniature on Champaran sathyagraha centenary on 13th may 2017 

మహాత్మా గాంధీజీ నీలి పంట రైతులకొరకు చేసిన చంపారన్ సత్యాగ్రహమ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తపాలా వారు మూడు ప్రత్యేక తపాలా బిళ్ళలు , మినియేచర్ ను 13-05-2017 న విడుదల చేసారు. 

Thursday, 27 April 2017

ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల

India Post released a set of 3 stamp of Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana on 26th April 2017.

భారత తపాలా 26-04-2017 న మన తెలుగు కవయిత్రులు  శ్రీ వెంకటాచల  మహత్యం రాసిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ (1730-1817)  మరియు ఆతుకూరి (కుమ్మరి) మొల్లమాంబ  (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)రామాయణ కల్పవృక్షం తో పాటు  వేయి పడగలు రాసిజ్ఞానపీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయత,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గార్ల పై  గుంటూరు బృందావన్ గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని అన్నమయ్య కళావేదికపై 26-04- 2017 సాయంత్రం గ  6.15 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఒకేసారి ఇలా ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల కావటం శుభపరిణామం. దీనికి కృషి చేసిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అభినందనలు. 
 Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana

Wednesday, 26 April 2017

ఉస్మానియా విశ్వవిద్యాలయం

శత వంసంతాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందనాలు. 
ఈ విశ్వవిద్యాలయానికి 50 వసంతాలు నిండిన వేళ స్వర్ణోత్సవ సందర్భంగా 15-3-1969 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

A Commemoretive postage stamp on15 - 3 - 1969 Osmania university - Hyderabad

OSMANIA UNIVERSITY- FIRST DAY COVER

ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7 నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1918 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7 ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3 సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. 1,600 ఎకరాల (6 .కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజాం రాజ్యానికి వచ్చి 25 ఏళ్ళు గడిచిన సందర్భంగా హైదరాబాద్ స్టేట్ తపాలా శాఖ 1936 లో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 
1936 లో హైదరాబాద్ స్టేట్ విడుదల చేసిన తపాలా బిళ్ళ 
Tuesday, 25 April 2017

శ్రీ వెలగపూడి రామకృష్ణ

India post Issued a My Stamp sheetlet  on 75 Years of KCP Limited and Its founder 
Sri Velagapudi Rama Krishna
 on 30-12-2016
వెలగపూడి రామకృష్ణ గారు దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు.
1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లం వారిపాలెం అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర, సిమెంటు తయారు చేయు పరిశ్రమలు  ముఖ్యమైనవి.
రామ కృష్ణ గారు 1941 లో  స్థాపించిన  KCP Limited  75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మన తపాలా శాఖ వారి సౌజన్యం తో వ్యక్తిగత తపాలా బిళ్ళను 30-12-2016 న విడుదల చేసారు.  వారిపై ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయాలని ఆశిస్తున్నాం. 

అలాగే కెసిపి 75 వసంతాల వేడుకలో భాగంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను 27-12-2017 న చెన్నై లో విడుదల చేసారు. 
Special cover on kcp Limited

Special cover on KRISHNA PEX- 2005

ఇంతకు ముందు మచిపట్నం లో 17-9-2005 న జరిగిన కృష్ణా జిల్లా తపాలా బిళ్ళల ప్రదర్శనలో(KRISHNA PEX- 2005) ఒక ప్రత్యేక  పోస్టల్ కవర్ విదుదల చేసారు. దానిపై  పారిశ్రామిక దార్సినికుడు, మార్గ దర్శి శ్రీ వెలగపూడి  రామకృష్ణ  గారి చిత్రంతో పాటు వారిచే  ఉయ్యురులో 1941 లో సహకార రంగంలో  స్థాపించబడిన పంచదార మిల్లు (K.C.P. SUGARS),చెరుకు తోట చిత్రాలు ముద్రించారు. 

K.C.P. SUGARS, UYYURU- IN SERVICE TO THE PEOPLE
Date of Issue: 17-9-2005

ఈ ప్రత్యేక పోస్టల్ కవరు పై మన రాష్ట్రానికి గవర్నర్ గా,ఉప రాష్ట్రపతిగా పనిచేసిన క్రిష్ణకాంత్ గారి పై విడుదల చేసిన తపాల బిళ్ళ,దానిపై మచిలీ పట్నం కు ప్రాతినిద్యం గా చేప బొమ్మతో ఉన్న ప్రత్యేక పోస్టల్ ముద్ర ఉన్నాయి.

Wednesday, 19 April 2017

దీక్షాభూమి

On the occasion of Dr. B. R. Ambedhkar 126 birth anniversary  India Post released a Se-tenant stamp on Deekshabhoomi on 14th April 2017 at Nagpur.

డా. బి.ఆర్. అంబేద్కర్ 126 వ జయంతి సందర్భంగా మన తపాలా శాఖ 14-04-2017న ఒక సి-టెనెంట్ (జంట -బిళ్ళలు) దీక్షాభూమి పేరుతో విడుదల చేసింది.  అశోక విజయ దశమి (14-10- 1956) న నాగపూర్ లో అంబేద్కర్ తన అనుచరులతో కలసి బౌద్ధం స్వీకరించిన ప్రదేశం లో నిర్మించిన బౌద్ధ ఆరామం ఈ దీక్షాభూమి. 

Tuesday, 28 March 2017

ప్రయాణ సాధనాలు

A set of 20 stamps  was released by India Post on 25th March 2017 on Means of Transport Through the Ages.
మన తపాలా శాఖ వారు 25-93-2917 న కాల గతిన మనం వాడిన ప్రయాణ సాధనాల పై ఒకేసారి 20 ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేసారు. మీనా / పల్లకి ల పై నాలుగు , ఎడ్ల బండి , గుర్రపు బండ్ల పై నాలుగు, రిక్షాలపై నాలుగు, కార్లపై నాలుగు, రైలు ,బస్సులపై  నాలుగు  మొత్తం 20 తపాలా బిళ్ళలు, 6 రకాల మినియేచర్లు, 5రకాల షీట్ లెట్స్ ను విడుదల చేసారు. వీటి ధర 275 రూపాయలు
Means of Transport Through the Ages.

Sunday, 12 February 2017

Women Solidarity movement for Gender Equality

UNPA jointly with India post issued special stamps promoting UN Gender equality Campaign HeForShe, on the occasion of International Women’s Day on 8-03-2016
The stamps design gives the message that girls and women are half of humanity and are exactly equal to the other half. Together, they make a whole world.


భారతీయ తల పాగాలు

India Post released the set of 16 special stamps in the form of Souvenir sheet featuring the Headgears of India  on 10th February 2017.

రాజసానికి , సంస్కృతికి ,సాంప్రదాయానికి  చిహ్నాలుగా నిలిచే భారతీయ తల పాగాలు తపాలా బిళ్లలపై చోటుచేసుకున్నాయి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ధరించే తలపాగాలలో 16 రకాలను ఎంచుకొని వాటితో విడుదల అయిన ఈ అందమైన తపాలాబిళ్ళలను 10-02-2017న మన తపాలా శాఖ విడుదల చేసింది. వీటిపై మన తెలుగు వారు ఒకప్పుడు ధరించిన తలపాగాలకు చోటు దొరక లేదు. మనం మన సాంప్రదాయాన్ని ఏనాడో వదిలేశాం కదా !
తెలుగు తలకట్టుకు నిలువుటద్దం Sunday, 5 February 2017

Nature - India

Department of Posts issued a set of six commemorative stamps and a Miniature Sheet on Nature India on 25th January 2017. Miniature Sheet is  depicting Peacock, Elephant, Crane, Tiger, Butterfly and Deer.

Wednesday, 11 January 2017

గురు గోవింద్ సింగ్ 350వ జయంతి

సిక్కు మతపు చివరి ప్రవక్త గురు గోవింద్ సింగ్ 350వ జయంతి ( ప్రకాష్ ఉత్సవ్ ) సందర్భంగా 5-1-2017 న మన తపాల శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

దీనిపై పాట్నా లోని గురు గోవింద్ స్మారక దేవాలయం ( తఖ్త్ శ్రీ హరిమందిర్ జి పాట్నా సాహిబ్)

ఇంతకు ముందు గురు గోవింద్ సింగ్ ( 1666-1708)  300వ జన్మ దినం సందర్భంగా ఇదే గురుద్వార్ బొమ్మతో ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ 17-01-1967 లో విడుదల చేసారు. 


India and Portugal Joint Issue

Commemorative Joint Issue on Diplomatic relations between Commemorative Joint Issue Stamps on Diplomatic relations between India and Portugal – 7th January 2017.issued on 7th January 2017 by India Post.Monday, 9 January 2017

ఈ ఏడాది విడుదల అవుతున్న మన తపాలా బిళ్ళలు

మన భారత తపాలా ఈ ఏడాది విడుదల చేస్తున్న తపాలా బిళ్లలపై  మన తెలుగు వారిపై వస్తున్న తపాలా బిళ్ళలు 
1. జ్ఞానపీట్ అవార్డు పొందిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 
2, కవయిత్రి మొల్ల (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)
3. కవయిత్రి తరిగొండ వెంగమాంబ. (1730-1817)
4.ఆదికవి  నన్నయ భట్టారకుడు (10వ శతాబ్ది)
5. ద్రాక్షారామ ఆలయం 
6. మంగళపల్లి బాల మురళి కృష్ణ 
7. కొండా లక్ష్మణ్ బాపూజీ 
మనకు సంబంధించి ఇన్ని తపాలా బిళ్ళలు ఒక ఏడాదిలోనే విడుదల అవటం విశేషం . స్వతంత్రం వచ్చిన తరువాత తొలిసారి తెలుగు వారికి సముచిత స్థానం లభిస్తుంది. 

Wednesday, 4 January 2017

స్వాగతం-2017 -Splendours of India


భారత తపాల శాఖ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 25 రూపాయల విలువగల  12 తపాలా బిళ్లలను 1-1-2017 న "స్పెలండెర్స్ ఆఫ్ ఇండియా " పేరుతో  విడుదల చేసింది. వీటితో పాటు 12 నెలల  కాల మానిని ఒక్కో తపాల బిళ్ళ తో విడుదల చేసింది. దీని వెల  1000 రూపాయలు 
Splendours of India 
(1) Ganesh Pol, Amber Fort, Jaipur (2) Pashmina Shawl, Kashmir (3) Chhau Mask 
(4) Bodhi Tree, Sandstone Relief Sculpture, Sanchi (5) Sarota, Areca Nut Cutter 
(6) Peacock Gate, City Palace, Jaipur (7) Chaitya Hall, Karle 
(8) Thanjavur (Tanjore) Painting (9) Blue Pottery, Jaipur 
(10) Coloured Glass Window, Bagore Ki Haveli, Udaipur 
(11) Parchinkari, Pietra Dura (12) Zardozi Carpet, Agra.