"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 10 June 2011

M.F.Husain Paintings


Maqbool Fida Husain (17 Sept.1915 – 9 June 2011) commonly known as MF, was an eminent Indian painter. According to Forbes magazine, he has been regarded as the "Picasso of India" He has been awarded the Padma Bhushanin 1973 and was nominated to the Rajya Sabha in 1986. He was awarded the Padma Vibhushan in 1991.Some of Husain's works became controversial because of their portrayal of Hindu deities in the nude. After legal cases and death threats, he was on a self imposed exile from 2006. In January 2010, he was offered the citizenship of Qatar, which he accepted. He died in London in June 2011.


India Post Used Some of M.F.Husain Paintings on postal Stamps

Bal Gangadhar Tilak's proclamation " Swaraj is my Birthright"
Issued in 1988 on Freedom Forty Swaraj
                           

                                         Rani Lakshmi Bai of Jhansi"
                                Issued in 1988 to commemorate 1st War of Independence

" Between the Spider and the Lamp"
Issued in 1982 on Contemporary Art at the Festival of India

Thursday, 9 June 2011

తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

India Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.
 SRI KRISHNADEVARAYA  

Miniature sheet of   KRISHNADEVARAYA

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
దేశ భాషలందు తెలుగు లెస్స"
అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి   మన శ్రీ కృష్ణ దేవరాయలు(1509-1529)
ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు.
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద  అనే గ్రంథాన్ని రచించాడు.
రాయల ఆస్థానం లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు  'అష్టదిగ్గజములు' గా ప్రఖ్యాతి పొందారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో
దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు 
MAXIMUM CARD
The original portrait of the emperor Sir Krishnadevaraya done by Domingo Paes, Portuguese traveller who visited his court and penned down his memories.
శ్రీ కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 27 -01 -2011 న మన తపాలా శాఖ వారు ఒక ప్రతేక తపాల బిళ్ళను, మినీ ఏచర్ ను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళను తిరుమల శ్రీవారి ఆలయంలో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని, హంపి శిల్ప కళా వైభవాన్ని చాటేలా  అందంగా రూపొందించారు.  
Frist Day Cover - Sri Krishnadevarayalu,Hampi

Saturday, 4 June 2011

కొండపల్లి బొమ్మలు

A Special Cover 0n Kodapalli Toys by Indian Post 0n 5 - 1- 95 during the Inauguration of Philatelic Bureau, Vijayawada. The cover shows various Toys  made at Kodapalli, in Krishna Dist.,A.P.The cancellation Shows the 'Cobra Sculpture'at Nagarjuna Konda. 
కొండపల్లి బొమ్మలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి,విజయవాడ కు సమీపం లో ఉంది. ఈ  బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల తెలుగు 
 సంస్కృతి జన జీవనం, ఆంద్రుల కట్టు బొట్టు వేషదారణలను
సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు.

పోస్టల్ ముద్రలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు

A Special cover by India Post at APPEX - 81 on 12 - 1 - 1981
The Special postal cancellation shows The last King Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.  The Cover displays, statue of Buddha at Nagaruna Konda, one of India's richest Buddhist sites,located at near Nagarjuna Sagar in Guntur /Nalgonda district,A.P. 
ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. రాణి రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్నుకాకతీయ రాజ్యానికివారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది.1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించగా  ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
ఢిల్లీసుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపగా ఆ యుద్ధం లో ప్రతాప రుద్రుడు ఒడి పోయాడు. ప్రతాప రుద్రుడు వారికి బందీగా చిక్కి ఢిల్లీ కి తరలిస్తుండగా  మార్గ మద్యమం లో మరణించటం తో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది.