Skip to main content

Posts

Showing posts from 2020

I.K. Gujral - Prime Minister of India

India Post issued a Commemorative Postage Stamp of  denomination Rs 5/- on '  I.K. Gujral ' on 04.12.2020.    I.K. Gujral Indra Kumar Gujral  (4 December 1919 – 30 November 2012) was an Indian politician and freedom activist who served as the  12th Prime Minister of India  from April 1997 to March 1998.

ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా

మన తపాలా శాఖ 19-12-2019 న ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా పేరుతో 12 తపాలా బిళ్ళలు, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిలో 10 రూపాయల తపాలా బిళ్ళలు ఐదు , 15 రూపాయల తపాలా బిళ్ళలు మూడు, 20 రూపాయల తపాలా బిళ్ళలు నాలుగు ఉన్నాయి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న ఎంబ్రాయిడరీస్ రూపురేఖలు తీసుకొని వాటితో ఈ తపాల బిళ్లలను రూపొందించారు. వీటిలో మన ఆంధ్రాలో 500 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ముద్ద అల్లిక (కమల్ కథై )కు స్థానం కల్పించారు. చేతిగుడ్డ, దిండు గలీబు, ద్వారాలకు తెర గుడ్డలు, వస్త్రాలకు వివిధ రకాల చిత్రాలు, పూలు, ఆకులు, జంతువులు పక్షులు వంటివి సూదితో రంగుల దారాలతో ఉబ్బెత్తుగా (3D) చాలా అందంగా అల్లటం దీని ప్రతేకత.  Embroideries of India ఆంధ్రా అల్లిక (కమల్ కథై ) అద్దాల  కుట్టు పని (అప్లిక్యూ) మన ఆంధ్ర, తెలంగాణా లలో నివసించే లంబాడి (బంజారా తెగ) స్త్రీలు వాడే దుస్తులకు అద్దాలు అమరిచ్చి అందంగా తయారు చేసే కుట్టు పని (అప్లిక్యూ) కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు.

టెర్రాకోట తో కట్టిన దేవాలయాలు

A set of seven Commemorative Postage Stamps (CPS) on Terracotta Temples of India (1.Indralarh Temple, Ranipur Jharial, 2. Madan Mohan Temple, Bishnupur,3.Jor Bangla Temple, Bishnupur, 4. Nebiya Khera Temple, Bhadwara, 5. Lakshman Temple, Sirpur, 6. Lalji Temple, Kalna, 7. Shyam Rai Temple, Bishnupur) was released by India Post on 08.08.2020 మన దేశంలో టెర్రాకోట తో కట్టిన దేవాలయాలను ఇతివృత్తంగా చేసుకొని మన భారత తపాలా శాఖ 08-08-2020 న ఏడు తపాలా బిళ్ళలు తో కూడిన ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  శిలలపై శిల్పాలు చెక్కి దేవాలయాలు నిర్మించటం మనం సాధారణంగా చూస్తాం. రాతి శిలలు లభించని ప్రాంతాలలో ఇటుకలతో కట్టిన దేవాలయాలను నిర్మించి వాటి గోడలపై మట్టి పలకలపై (టెర్రకోట) అందంగా తాయారు చేసిన శిల్పాలను తాపడం చేసి ఆలయం  నిర్మించటం ఒక విశిష్ఠ వాస్తు శిల్పకళ.  పశ్చిమ బంగా లో బంకురా జిల్లా లో ఉన్న విష్ణుపూర్ లో మల్ల రాజులు   బంగా వాస్తు పద్దతిలో నిర్మించిన టెర్రకోట దేవాలయాలలో ముఖ్యమైన మూడు వైష్ణవ  ఆలయాలు   మదనమోహనాలయం (1694), జోర్ బంగ్లా దేవాలయం (1655) , శ్యామ్ రాయ్ (కృష్ణ) ఆలయం (1643) వీటిపై ఉన్నాయి . ఇంక

చార్ ధామ్ - ఉత్తరాఖండ్

భారత తపాలా శాఖ వారు 29-11-2019 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధ హిందూ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్న నాలుగు పుణ్య  ప్రదేశాల (చార్ ధామ్ గా ప్రసిద్ధిచెందాయి) పై నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసారు.  గంగా, యమునా నదుల జన్మస్థానాలైన గంగోత్రి, యమునోత్రి,  హిమాలయ పర్వతసానువులలో ఉన్న  కేదారనాథ్, బదరినాద్ దేవాలయాలు వీటిపై చోటుచేసుకున్నానాయి. YAMUNOTRI, GANGOTRI, KEDARNATH, BADRINATH - CHAR DHAM చార్ ధామ్ - ఉత్తరాఖండ్ 

జానపద కళాకారుల వాయిద్య పరికరాలు - బుర్ర కథ కళాకారుడు - డిక్కీ

మన భారత తపాలా శాఖ 28-06-2020 న జానపద కళాకారుల వాయిద్య పరికరాలు (Musical Instruments of Wandering Minstrels) పేరుతో మన బుర్ర కథలో వంత పాడే కళాకారుడు వాడే వాద్యం  డిక్కీ  కు, దానిని వాయిస్తున్న కళాకారుడితో పాటు మరో ఐదు జతల (se-tenant) తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  Kamaicha,Ravanahatha,Surando,Algoza,Burrakatha,Ektara Musical Instruments of Wandering Minstrels మన దేశీయ జానపద కళాకారుల వాయిద్య పరికరాల కేటగిరిలో మన తెలుగు వారి జానపద కళ అయినా బుర్ర కథలో ప్రధానంగా ఉపయోగించే వాయిద్యమైన డిక్కీ కు, దానిని వాయిస్తున్న  వంత పాడే కళాకారునికి  తపాలా బిళ్ళపై స్థానం కల్పించటం మన జానపద కళకు దక్కిన గౌరవంగా పరిగణించవచ్చు.   ఈ డిక్కీ ని బుడిగె , గుమ్మెట అని కూడా పిలుస్తారు . బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనో లేదా కంచు తోనో చేయబడి వుంటాయి.(membranophone category) బుర్ర కథలో వంత పాడే కళాకారుడు - డిక్కీ     తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ .  ఆంధ్ర దేశంలో 12వ శతాబ్దము నుండి బహుళ ప్రచారం పొందిన బుర్ర కథలు

మహాత్మా గాంధీ 150వ జయంతి

మహాత్మా గాంధీ 150వ   జయంతి ఉత్సవాలలో ముగింపు భాగంగా అక్టోబర్ 2, 2020 న మన భారత తపాలా శాఖ గాంధీజీ ప్రవచించి ,ఆచరించిన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేలా నాలుగు తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిపై ఆత్మనిర్బారత, ప్రకృతి వైద్యం, విద్య, పర్యావరణ వంటి సార్వజనిక విషయాలపై గాంధేయ మార్గం ఏమిటో సూక్ష్మంగా తెలిపేలా రేఖా చిత్రాలు ఉన్నాయి. 

UNESCO World Heritage Sites in India III - Cultural Sites

యు నెస్కో వారిచే వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందిన ప్రదేశాలు మన దేశంలో ఇప్పటివరకు 38 ఉన్నాయి. వీటిలో 30 ప్రదేశాలు సాంస్కృతిక ప్రదేశాలు ఏడు ప్రకృతి ప్రదేశాలు ఒకటి మిశ్రమ ప్రదేశం. ఈ జాబితాలో అత్యధిక ప్రదేశాలు ఉన్న దేశాలలో మన దేశం 6 వ స్థానంలో ఉన్నది. వాటిలో సాంస్కృతి కి చిహ్నంగా భాసిల్లే ఐదు ప్రదేశాలపై మన తపాలా శాఖ ఒక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో ఆగష్టు 15, 2020న విడుదల చేసింది.  1. Sarkhej Roza - Historic City of Ahmedabad 2. Church of Bom Jesus - Churches & Convents of Goa 3. Group Monuments of Pattadakal 4. Javari Temple - Khajuraho Group of Monuments 5. Qutub Minar & Its Monuments, Delhi ఇంతకు ముందు ఇదే అంశంపై మన తపాలా శాఖ వారు UNESCO World Heritage Sites in India-1, పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను, రెండవ సారి ప్రముఖమైన నాలుగు ప్రకృతి ప్రదేశాలపై  UNESCO World Heritage Sites in India -2 పేరుతో   మరోక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో మార్చి 16, 2020న విడుదల చేసింది విడుద

UNESCO World Heritage Sites in India -2

యునెస్కో వారిచే వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందిన ప్రదేశాలు మన దేశంలో ఇప్పటివరకు  38 ఉన్నాయి. ఈ జాబితాలో అత్యధిక ప్రదేశాలు ఉన్న దేశాలలో మన దేశం 6 వ స్థానంలో ఉన్నది. వాటిలో ప్రముఖమైన నాలుగు ప్రదేశాలపై మన తపాలా శాఖ ఒక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో  మార్చి 16, 2020న విడుదల చేసింది. 1. Manas Wildlife Sanctuary, 2. Great Himalayan National Park, 3. Nanada Devi and Valley of Flowers National Parks, 4. Western Ghats ఇంతకు ముందు UNESCO World Heritage Sites in India-1, పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  దీనిపై రాజస్థాన్ లో గల కోటలు - కుంభాల్ ఘర్, చిత్తోర్ ఘర్, జైసల్మేర్ , గగ్రోన్, రతంబోర్, అజ్మీర్ హిల్ ఫోర్ట్ లు చోటుచేసుకున్నాయి.

Indian Fashion Series - 4

India Post issued 9 Commemorative Postage Stamps of Denomination Rs 5 each on Indian Fashion-Designers Creations: Series- 4 మన తపాలా శాఖ మరొకసారి భారతీయ వస్త్ర ధారణ సిరీస్ -4 పేరుతో 14-01-2020 న 9 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి. ఇలా ఒక అంశం పై నాలుగోసారి తపాలా బిళ్లలను విడుదల చేయటం ఇదే మొదటసారి. ఇప్పటివరకు ఈ అంశం పై 21 తపాలా బిళ్ళలు విడుదలైనాయి.  ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ మొదట సారి 31-12 -2018 న సిరీస్ -1 పేరుతో 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. రెండవ సారి సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. మూడొవసారి సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు

Constitution of India

India Post issued a pair of se-tenant Commemorative Postage Stamps of Denomination Rs 10 and Rs 10 on Constitution of India on 26.01.2020.