"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 30 August 2010

పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా

A Commemorative stamp on
 P  S . Kumarswamy Raja

అవిభక్త మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా(1949 -1952 ) పనిచేసిన శ్రీ పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా (1898 -1957 ) పూర్వికులు మన తెలుగువారే. వీరి గౌరవార్దం- మన తపాల శాఖా 08 -07-1999  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.

Saturday, 28 August 2010

O.P. రామస్వామి రెడ్డియార్

A Commemorative stamp on
 O.P.Ramaswamy Reddiar 
Date Of Issue:-25.08.2010
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా (1947 -1949 ) పనిచేసిన మన తెలుగు వాడు  శ్రీ ఒమండూర్ రామస్వామి  రెడ్డియార్(1895 -1970) పై మన తపాలా శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఇటివల నిర్మ్మించిన తమిళ నాడు అసంబ్లి భవనానికి కుడా రామస్వామి రెడ్డియార్ పేరు పెట్టారు.

Monday, 23 August 2010

Stamps on Mother Teresa- 2



మదర్ తెరెసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997), ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు గా జన్మించినఅల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీనిభారతదేశంలోని కలకత్తా లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు. మానవ మూర్తి మదర్ తెరిస్సా పై విదులైన మరికొన్ని తపాలా బిళ్ళలు. 

60 Years of Universal Declaration of Human Rights -India,
10 -12 -2008
 The stamp,issued by Ireland (Date of Issue – 17 June 2010)shows -Mother Teresa against an image of the Missionary of Charity which she founded in Calcutta in 1950.


Two stamps issued by Italy on Nobel Peace Prize Winner Mother Teresa in 1998.

MOTHER TERISSA -OSTEREICH
MOTHER TERISSA -BHUTAN - 1997
MOTHER TERISSA -COMORES ,2008

Saturday, 14 August 2010

డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్

మన ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 125 వ  జయంతి సందర్బంగా 100 రూపాయలు నాణెం మరియు ఐదు రూపాయల నాణెం విడుదల చేసారు.ఇంతకు ముందు రాజన్ బాబు రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడు ఒకసారి,వారి శత జయంతికి ఒకసారి ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు.
Dr.RAJENDRAPRASAD 
125TH   BIRTH ANNIVERSARY-Commemorative coins  
PRESIDENT OF INDIA -1950 to 1962
Date of Issue: 13-05-1962 (Retirement of President)
Rajendra Prasad Birth Centanary 
Date of Issue: 03-12-1984

Thursday, 12 August 2010

మేఘ ధూత్ పోస్ట్ కార్డు పై జల యజ్ఞం

MEGHDOOTH POST CARDS ON JALA YAGNAM
నిన్నొక కల ... నేడొక నిజం.... అదే జల యజ్ఞం...
మేఘ ధూత్ పోస్ట్ కార్డుల  పై జల యజ్ఞం జరిగిన వైనం వీక్షించండి.
కోస్తా ఆంద్ర ప్రాజెక్టులు :







రాయలసీమ ప్రాజెక్టులు:

తెలంగాణా ప్రాజెక్టులు :







Tuesday, 10 August 2010

రవీంద్ర నాద టాగూర్ పై వెండి నాణెం

RABINDRANATH TAGORE 
 150 BIRTH ANNIVERSARY
Commemorative coins  
గురు దేవ్ శ్రీ రవీంద్ర నాద టాగూర్ 150 వ జయంతి సందర్బంగా మన ప్రభుత్వం వారు మొదటి సారిగా 150 రూపాయల వెండి నాణెం మరియు  ఐదు రూపాయల నాణెం విడుదల చేస్తున్నారు.ఇంతకు ముందు మన తపాల శాఖ వారు రాబింద్రనాథ్టాగూర్  గారిపై నాలుగు తపాల బిళ్ళలు విడుదల చేసారు. 

Date of Issue:1 October 1952
Date of Issue: 7-05-1961
VISVA BHARATI GOLDEN JUBILEE
Date of Issue:24-12-1971 
Date of Issue:7-5-1987





Modern Indian Paintings-"Head" -By Rabindranath Tagore
Date of Issue: 23  March 1978

Rabindranath tagore's playlet 'Dakgahr'(post office)
Date of Issue: 13-10-2008
World Tributes to Tagore
U.S.S.R
COMORIEN
BANGLADESH - 1991

Issue Date: 07-08-1991 ,

Denomination:  4 Taka


Monday, 9 August 2010

గండికోట

CUDAPEX -Special cover on  Gandikota  
Date of issue : 12 -11 -1976  
12 -11 - 1976 న జరిగిన కడప జిల్లా తపాలా బిల్లల ప్రదర్శనలో (76 CUDAPEX)జమ్మలమడుగు మండలం లో పెన్నా నది తీరంలో ఉన్న చారిత్రిక ప్రసిద్ధి చెందినదుర్గం  "గండికోట" పై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. బత్తాయి పళ్ళు ఉండే పోస్టల్ ముద్ర తో కాన్సిలేషణ్ రూపొందించారు.
గండికోట చరిత్ర :
గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని మలికి  సీమకు రాజధానిగా ఉండేది. 14 వ శతాబ్దం ప్రథమార్థం నుండి 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగము వరకు గండికోటను పెమ్మసాని కమ్మనాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, 1650 ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు
వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. 

శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు

Special Cover on Srikrishnadevaraya ,  Emperor of Vijayanagara
A Special cover was released in Chennai on 13 Oct 2009 to commemorate the 500th Anniversary of Coronation of Emperor of Vijayanagara Sri Krishna Deva Raya . The cancellation shows the Royal Insignia of the Vijayanagara Kingdom.
శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు ఘనంగా మన తెలుగు నాట కుడా జరుపుకున్నాం. తోటి తమిళ సోదరులు శ్రీ కృష్ణదేవరాయలు పై ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేయించితే మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక మిత్రులు హంపిలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిన తరువాతగాని మనకు కృష్న దేవరాయలు గుర్తుకు రాలేదు.ఇప్పటికైనా మన తెలుగు వారు మేల్కొని శ్రీకృష్ణ దేవరాయాలపై ప్రతేక పోస్టల్ స్టాంప్ మరియు ప్రత్యేక నాణ్యం విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారని ఆశిద్దాం.

Friday, 6 August 2010

మేఘ ధూత్ పోస్ట్ కార్డ్ పై ఆరోగ్య సూత్రాలు

MEGHADOOT POST CARDS (Telugu )
  పొగాకు నమలటం మానండి - నోటి కాన్సెర్ ను నివారించండి.
జీవితం మీది -మీ ఇష్టం 
వీటికి దూరంగా ఉండండి.లేదంటే ప్రమాదం మీ ఎదుటే !
వెన్నును వంచకండి, బరువును కూర్చొని ఎత్తండి - విపు నొప్పిని నివారించండి.
ఎత్తులో పనిచేసటప్పుడు సెప్టి బెల్ట్ వాడకం -  కాపాడును మీ ప్రాణం  

Tuesday, 3 August 2010

XIX Commonwealth Games,Delhi-2010

Miniature Sheet- Jawaharlal Nehru Stadium and  Talkatora Stadium
Date Of Issue:-01.08.2010.
A set of two commemorative postage stamps  and one Miniature sheet issued by INDIAN POST in view of forthcoming  XIX Commonwealth Games 2010, depicting the Jawaharlal Nehru and Talkatora Stadiums, NEW DELHI