"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 16 November 2017

జాతీయ బాలల దినోత్సవం -2017

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2017 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "నెస్ట్ " (గూడు) పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు. 


Friday, 3 November 2017

భారతీయ వంటకాలపై తపాలా బిళ్ళలు

ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన తపాలా శాఖ ద్వారా కమ్మని నోరూరించే మన భారతీయ వంటకాలపై 24 తపాలా బిళ్ళలు 3-11-2017 న విడుదలైనాయి. ఈ వంటకాలను పండుగ వేళ వండుకునే పబ్బాలు - పిండివంటలు , దేవుడి కి గుళ్లో ప్రసాదాలుగా చేసేవి, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన వంటకాలుగా, దేశ విదేశాలలో అంతటా ప్రాముఖ్యతను సంతరించుకున్నదేశీయ  వంటకాలాగా నాలుగు తరగతులుగా విభజించి నాలుగు మినియేచర్లు కూడా  విడుదల చేసారు.  వీటిలో తిరుపతి లడ్డు, హైదరాబాద్ బిరియానీ. గుత్తి వంకాయ కూర, కజ్జి కాయ, దోశ- ఇడ్లి వంటి మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయి. 
భారతీయ వంటకాలు 
పండుగ పబ్బాలు - పిండి వంటలు 
 దేవుని ప్రసాదాలు 
 ప్రాంతీయ వంటలు 
 అందరు మెచ్చే వంటకాలు 

Wednesday, 1 November 2017

ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పై తపాలా బిళ్ళలు


 కవి ముద్దన ,ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం
మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు . ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ  మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన ( మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ కూడా అదే ) బెంగళూరులో విడుదల చేశారు. 
ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న  శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. అలాగే పంచారామాలలో ద్రాక్షారామం కూడా ఒకటి. 
ఆదికవి నన్నయ్య , రాజరాజ నరేంద్రునికి మహా భారత గ్రంధాన్ని ఇస్తున్న నన్నయ్య 
పూర్వము ఆంధ్రదేశమునకు వేంగి దేశమని పేరు  ఈ వేంగి దేశ పాలకుడు చాళుక్యరాజు  రాజరాజనరేంద్రుడు.  క్రీ.శ.1022 నుండి క్రీ.శ1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. రాజధాని రాజమహేంద్రవరం.  నన్నయ భట్టారకుడు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.  నన్నయ్యకు ఆదికవిగానే కాక  శబ్దశాసనుడువాగనుశాసనుడు  అన్న బిరుదులు ఉన్నాయి.     మహా భారత గ్రంధాన్ని తెలుగులో రాసిన కవిత్రయం లోమొదటివాడు. వ్యాస భారతములో  మొదటి రెండుపర్వములను, ఆరణ్యపర్వమున కొంతభాగమును రచించి అర్ధాంతరంగా మరణించారు.  తిక్కన , ఎఱ్ఱన దీనిని పూర్తి చేశారు. నన్నయ  తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి కూడా రచించారని భావిస్తారు

Tuesday, 31 October 2017

India and Russia - Joint Issue

India and Russia post jointly released new set of two stamps and a miniature for 70 years of diplomatic relations between India and Russia. 
These Stamps shows bhavai dance(2500) of Rajasthan and
Beryozka dance(500) of Russia.

Chhatrapati Shivaji International Airport - MumbaiTwo Commemorative Stamps and a Miniature Sheet were released on 75 years on Chhatrapati Shivaji International Airport by by India Post on 15th October 2017. 

The event was organised in the memory of the Late JRD Tata, who on October 15, 1932, piloted the first flight of Tata Air Services from Karachi to Mumbai via Ahmedabad carrying airmail.

Thursday, 19 October 2017

దీపావళి పై తపాలా బిళ్ళలు

చీకటిని పారదోలేది జ్యోతి. జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం.  దీపాల వరుస దీపావళి . 
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి జ్ఞాన కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు. 
ఆనందాల వెలుగులు ప్రసరించే దీపావళి పండుగకు గుర్తుగా అనేక తపాలా బిళ్ళలు విడుదల చేశారు. 
మన దేశం కెనడా దేశం రెండు కలసి సంయుక్తంగా దీపావళి పై 21-09-2017 న రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసాయి. 


ఇంతకు ముందు దీపావళి పండుగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ  అమెరికా తపాలా శాఖ 5-10-2016 న ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 
 

అలాగే జ్యోతి హిందువులతో పాటు జురాస్టియన్ మతం వారికి పవిత్రమైనది. 
ఇజ్రాయిల్ మరియు భారత దేశాలు తమ మద్య మొదలైన ద్వైపాక్షిక సంభందాలకు 20 వసంతాలు పూర్తి అయిన సంధర్బం గా ఇరు దేశాలు Festivals of Lights  పేరుతో రెండు తపాలా బిళ్ళలను 5-11-2012 న విడుదల చేసారు.
మన  రెండు దేశాలలో  దీపాలు వెలిగించి జరుపుకొనే దీపాల పండుగలను ఇతి వృత్తం గా తీసుకుని రూపొందించిన ఈ తపాల బిళ్ళల పై  మన దీపావళి,ఇజ్రాయిల్ లో జరుపుకొనే హనుక్కః పండుగలు ను సూచించే ప్రమిదలు, క్రోవ్వత్తులు ముద్రించారు. 
Stamps by India post
Stamps by Israel post
A set of two stamps is being issued by both the India and Israel countries to mark the completion of twenty years of diplomatic relations on 5-11-2012
The stamps  depict the two festivals of lights, Deepavali and Hanukkah.
Themed on the “festival of lights”, one stamp depicts the Jewish festival of Hannukah with a row of candles. The other, depicting the Hindu festival of Diwali, features diyas.
Sheetlet by India Post 

మన దేశం లో ఘనంగా జరుపుకునే  దీపావళి పండుగ పై మన తపాల శాఖ వారు  7-10-2008 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు.


Monday, 2 October 2017

నీలగిరి పక్షులు

మన భారత తపాలా శాఖ 18-09-2017 న  నీలగిరి కనుమలలో కనిపించే పక్షులపై మూడు తపాలా బిళ్ళలను, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. అంతరించబోయే పక్షులలో జాబితాలో ఉన్న వీటిని సంరక్షించాల్సిన భాద్యత ఎంతో ఉంది.