Skip to main content

Posts

Showing posts from February, 2023

ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ - My Stamp

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవాతత్పరుడు, దానశీలి, ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి పొందిన ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ గారిచే మన తెలుగునాట అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో ఆంధ్రా షుగర్స్ ఒకటి.   My Stamp : Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad 1947 ఆగస్టు 11న తణుకు పట్టణం లో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  దానికి బీజం వేసి అభివృద్ధి చేసిన మూల పురుషులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయితే దాని తొలి మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీ రామచంద్ర వెంకట కృష్ణ రంగారావు గారు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖా  11 ఆగస్టు 2022న  ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళ (మై స్టాంప్ ) విడుదల చేసారు.  Foundars of Andhra Sugars LTD  Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad ANDHRA SUGARS LTD.  - COMPANY HISTORY Andhra Sugarsincorporated in 1947 is engaged in the manufacture and sale of sugarOrganic and Inorganic Chemcials.Edible & Non-Edible Vegetable Oils and Non-Conventional Power Generation at Tanuku,Kovvur,Guntur,Taduvai,Saggonda a

ఆజాదికా అమృత మహోత్సవమ్ - Amritpex - 2023

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా  మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.   ఆజాదికా అమృత మహోత్సవము  లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్  లతో  ఒక జంట తపాలా బిళ్ళను ( Se - Tenant  Stamp )   ముందుగా విడుదల చేసారు  Se - Tenant  Stamp : Azadika Amrit Mahotsav -2023 Issued on 11 Feb 23 Bridal Costumes of India - 1 Issued on 12 Feb 23 Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 మన భారతీయ సాంప్రదాయపు పెళ్లి కూతురు వస్త్రధారణలపై  ఎనిమిది తపాలా బిళ్ళలు , రెండు మినియేచర్లు విడుదల చేసారు.  వీటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, పంజాబీ, గుజరాతీ అమ్మాయిలు ఒక మినియేచరులోనూ పశ్చమ బెంగాలు, మణిపురి, మహారాష్ట్ర, కేరళ పెళ్లి కూతుర్లు మరొక మినియేచరులోనూ ముద్రించారు.  ఇదే అంశంపై ఇంతకు ముందు పెళ్లి కుమార్తెలపై నాలుగు తపాలా బిళ్ళలు (రాజ