"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Saturday, 29 October 2011

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI
Legendary heroines of Indian cinema 
India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi  of Indian cinema, on February 13th, 2011


 First day Covers

MINIATURE SHEET- SAVITRI
ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు,మహా నటి సావిత్రికి చోటు కల్పించారు.
మిగిలినవారు మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి.
ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి  గుంటూరుజిల్లా,  తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది.
సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదనాన్న  కొమ్మారెడ్డి వెంకట్రామయ్యచౌదరి వద్ద పెరిగింది. చిన్నతనంలోనే సావిత్రి  సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో  ప్రదర్శనలు ఇచ్చింది.  పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని మహా నటిగా గా విరాజిల్లింది. తమిళ నటుడు జమిని గణేష్ ను వివాహం చేసుకుంది.
దేవదాసు,మిస్సమ్మ, మాయాబజార్ , తోడికోడళ్ళు,మూగమనసులు వంటి గొప్ప చిత్రాలలో నటించి తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

Thursday, 6 October 2011

మన పండుగలు - దసరా, దీపావళి



చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి. 
దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి.
A set of three stamps on Festivals of India, by Indian Post.
Date of Issue : 07 - 10 - 2008
DURGA PUJA,DUSSEHRA - KOLKATA,FESTIVAL OF INDIA
DUSSEHRA - MYSORE,FESTIVAL OF INDIA
 DEEVALI -FESTIVAL OF INDIA
FIRST DAY COVER- FESTIVAL OF INDIA
MINIATURE - FESTIVAL OF INDIA 

Tuesday, 4 October 2011

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover 
India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011.
Tripuraneni Gopichand (8 September 1910 - 2 November 1962) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director. 


Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award.

    TRIPURANENI GOPICHAND

    ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు,మనోవైజ్ఞానిక సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లాఅంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త ,కవి రాజు త్రిపురనేని రామస్వామి. తండ్రి కొడుకులు లిద్దరికీ మన తపాల శాఖ ప్రత్యక తపాల బిళ్ళలను విడుదల చేయటం అపూర్వ విషయం.
    త్రిపురనేని రామస్వామి 

    హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో రామస్వామి గారి వద్ద పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. 
    1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
    1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
    గోపి చంద్ గారి రచనలు 
    • అసమర్థుని జీవయాత్ర
    • గడియపడని తలుపులు
    • చీకటి గదులు
    • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
    • ప్రేమోపహతుల
    • పరివర్తన
    • యమపాశం
    • శిధిలాలయం
    • తత్వవేత్తలు
    • పోస్టు చేయని ఉత్తరాలు
    • మాకూ ఉన్నాయి సొగతాలు
                                                  సినిమాలు
    1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. చలన చిత్ర రంగం లో వారు చేసిన కృషి 
      • చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
      • ధర్మదేవత (1952) (మాటల రచయిత)
      • ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు)
      • పేరంటాలు (1951) (దర్శకుడు)
      • లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
      • గృహప్రవేశం (1946) (కథా రచయిత)
      • రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)