Skip to main content

Posts

Showing posts from December, 2017

India and Papua - Joint Issue

India  and Papua post jointly released new set of two stamps and a miniature for on  30-12-2017  on diplomatic relations between India and Papua New Guinea 

విసన కఱ్ఱల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Indian Hand Fans was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో వాడిన అందమైన విసన కఱ్ఱల పై  మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (16x15 =240 ) విడుదల చేసింది. 

దిగుడు బావుల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Step wells was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో నిర్మించిన అత్యంత సుందరమైన దిగుడు బావుల పై మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (8x 5 , 8x15 ) విడుదల చేసింది.  Stepwells - 1.Chand Baori, Abhaneri; 2. Raniji Ki Baori, Bundi; 3. Toor Ki Jhalra, Jodhpur; 4. Panna Mian Ki Baori, Jaipur; 5. Nagar Sagar Kund, Bundi; 6. Neemrana Stepwell, Alwar; 7. Pushkarini Stepwell, Hampi;8.  Muskin Bhanvi Stepwell, Lakkundi; 9. Adalaj Stepwell, Adalaj; 10. Surya

తపాల బిళ్ళపై షిర్డీ సాయి బాబా

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా మహా సమాధి పొంది 100 సంవత్సరాలు అయినా సందర్భంగా పై మన తపాల శాఖ వారు 15 -12-2017 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. అవధూత/ సూఫీ సామ్రాదాయం అనుసరించిన సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. 1858 లోమహారాష్ట్రలో ఉన్న షిర్డీ గ్రామానికి వచ్చి 1918లో సమాధి సిద్ది వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. A Commemorative postage stamp on SHRI SHIRDI SAI BABA ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా పై మన తపాల శాఖ వారు 20-05-2008 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. A Commemorative postage stamp on 20-05-2008 Date of issue :20 -05-2008  SAI BABA - MAXIMUM CARD

తపాలా బిళ్లల పై మహాభారతం- విశ్వరూప దర్శనం

పంచమ వేదం గా ప్రసిద్ధి చెందిన భారతీయ ఇతిహాస కావ్యం "మహాభారతం " పై మన తపాలా శాఖ 18 తపాలా బిళ్లలను రెండు మినియేచర్ షీట్స్ ను 27-11-2017 న విడుదల చేసింది. వీటిలో  12 తపాలా బిళ్ళలు 15 రూపాయలు , 4 తపాలా బిళ్ళలు 25 రూపాయలు, ఒకటి 50 రూపాయలు, మరొకటి 100 రూపాయలు విలువ కలవి.  వీటిలో 50,100 రూపాయల బిళ్లలతో మినియేచర్స్ గా కూడా ముద్రించారు.  ఈ తపాలా బిల్లలపై మహా భారత గ్రంధ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో వివిధ కాలాల్లో రూపుదిద్దుకున్న చిత్రాలకు స్థానమిచ్చారు. వాటిలో మన ఆంధ్ర ప్రాంతంలో కలంకారీ చిత్రకళ ఒకటి. దీన్ని ప్రతిపాదికగా చేసుకొని 50 రూపాయల తపాలా బిళ్ళ మరియు మినియేచర్ ను రూపొందించారు. అలాగే ఆంద్ర- కర్ణాటక ప్రాంతాలలో మహాభారతాన్నిజానపద కళా పక్రియ అయినా తోలు బొమ్మలాట గా ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాటలో "ద్రౌపది" బొమ్మతో మరొక 15 రూపాయల తపాలా బిళ్ళ ను కూడా విడుదల చేశారు.  కలంకారీ వస్త్రంపై  మహాభారతం- కురుక్షేత్రం తోలుబొమ్మలాటలో - ద్రౌపది  మహాభారతం- విశ్వరూప దర్శనం  మహాభారతం- 18 పర్వాలు ముఖ్య ఘట్టాలు