"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 30 November 2010

సికింద్రాబాద్ - Secunderabad

Special cover by Indian Post  on Secunderabad City on 12 -02 - 2007
Sikindar jah (1768 -1829) founder of Secunderabad 
హైదరాబాద్ - సికిందరాబాద్ లు జంట నగరాలుగా ప్రసిద్ది చెందినాయి. మూడవ నిజాం అయిన సికిందర్ జా పరిపాలన కాలంలో హైదరాబాదులో బ్రిటిష్ వారు  కంటోన్ మెంట్ ప్రాంతాన్ని  స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు.సికింద్రాబాద్ నిర్మించి రెండు శతాబ్దాలు అయిన సందర్బంగా జరిగిన జిల్లా తపాలా బిళ్ళల ప్రదర్శన SECUNDERPEX -2007 లో  ఈ ప్రత్యేక కవరు విడుదల చేసారు. 

Thursday, 25 November 2010

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.  
శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992) గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు.
కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు జిల్లా అమృతలూరు  మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. 1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు. బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.
1937, 1946, 1955 , 1962లలో శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ ,మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో సంజీవయ్య గారి మంత్రి వర్గం లో  మంత్రిగా పనిచేశారు. భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.
తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. మంచి గ్రంధ రచియిత. ఆర్ష విద్యాలంకార అనే బిరుదాంకితుడు.రామాయణసుధాలహరి, రామకధానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు
1992 జనవరి 21న చంద్రమౌళి  తన స్వ గ్రామం   మోపర్రులో    పరమపదించారు. 

Sunday, 21 November 2010

STAMPS ON HINDU GODS BY THAILAND POST

THAILAND post issued a set of four stamps with miniature on our Hindu Gods Ganesh,Bramha,Vishnu and Siva on 2- 6 -2009
Ganesha, which is another name for Vinayaka, means the "God who has power over obstacles". A son of Shiva and Uma, he has the face of an elephant and he was blessed by his father so as to have the power to dispel all obstacles. Offerings must be made to Ganesha before any other gods.
Brahma, according to Brahmin Doctrine, is believed to be the Creator of all things on earth. The Musnapurana Legend states that he divided himself into two parts-one being a male figure, which was Brahma himself and the other in female form, named Sraswathi, whoe served as his consort. They helped each other in creating deities, humans, animals, demons and plants.
Narayana, also known to the Thais as Phra Narai, is responsible for preserving things in their appropriate condition. His work is continual so as to create peace and harmony in the world. Narai has ten incarnated lives on earth.
Siva, generally known as Phra Issuan to the Thais, has the duty of destroying all evil things on earth. This god has three eyes and a white complexion. According to traditional Thai belief, Shiva will pay an annual 10-day visit to the earth. This visit will start on the seventh nightof the waning moon in the first lunar month and end on the first night of the waning moon in the same month. During the visit, a Brahmin ceremony, known as the Tri Yumpawai, will be organized to welcome the God.

First day cover on HINDU GODS
Miniature sheet of Hindu Gods

Saturday, 20 November 2010

Nehru's family on Postal Stamps


Jawaharlal Nehru ( 14 November 1889–27 May 1964) was an Indian statesman who was the first  prime minister of India, from 1947 until 1964.  
Three members of the Nehru family, Pandit Jawaharlal Nehru, his daughter Smt.Indira Gandhi and her son Shri Rajiv Gandhi have been Prime Minister of India, two of whom (Indira Gandhi and Rajiv Gandhi) have been assassinated.
Nehru and his family members have honored by our INDIAN POST in the form of many  commemorative stamps, first day covers and special cancellations.

Nehru's Father, MOTILAL NEHRU (1861-1931)
Date of Issue : 6 -5 - 1961
Jawaharlal Nehru (1889-1964)
Date of Issue : 14 - 11 - 1989 
Nehru's wife, KAMALA NEHRU(1899-1936)
Date of Issue : 1 - 8 - 1974 
Nehru's sister, Vijaya Lakshmi Pandit(1900–1990)
Nerhru's Daughter, INDIRA GANDHI(1917-1984)
Date of Issue : 19 - 11 - 1984
Nehru's Grand Son, RAJIV GANDHI(1944-1991)
Date of Issue : 20 - 8 - 1991
Nehru's Grand Son, SANJAY GANDHI (1948- 1980)
Date of Issue : 23 - 6 - 1981

Tuesday, 16 November 2010

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post 
Date of Issue: 23-4-2005 

న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత.పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు.
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యలకున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన బాలల అకాడమి.
రేడియో అన్నయ్య గారి శత జయంతి సందర్బంగా తపాలా శాఖా ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది.

Monday, 15 November 2010

CHILDREN'S DAY - 2010

India Post released a set of 4 stamps and a beautiful Miniature Sheet on 14th November 2010 on the occasion of Children's Day.
The birth anniversary of  Sri Jawahar Lal Nehru, India’s first Prime Minister has celebrated all over the country every year as Children’s Day. As is known, he had an extreme love for children. Nehru worked passionately for the welfare of children and youngsters soon after independence. He was keen about welfare, education, and development of children in India. He was fond of children and thus became popular as "Chacha Nehru" (Uncle Nehru) among his little admirers. India Post issues special stamps every year on this special day.

Saturday, 6 November 2010

ఇంధనం ఆదా చేద్దాం

MAGADOOT POST CARDS ON ENERGY SAVING 


కుటుంబ సభ్యులం కలసి భోజనం చేద్దాం , ఇంధనం ఆదా చేద్దాం. ప్రేమను పెంచుదాం.
ISI మార్క్ కలిగిన పంప్ సెట్ మరియు ఫుట్ వాల్వ్ ఉపయోగించండి.
పంప్ ను నీటి మట్టానికి పది అడుగులకన్నా ఎక్కువ ఎత్తులో ఉంచకండి.
తక్కువ  ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయానించండి.
గంటకి  45 -50 కి.మీ.ల వేగంతో వాహనం నడపండి.
ఇంజన్ని క్రమం ప్రకారం ట్యునింగ్ చేయించండి.

Thursday, 4 November 2010

HAPPY DEEPAVALI - దీపావళి శుభాకాంక్షలు !

A postage stamp  Issued on Deepavali by Indian Post.
Date of Issue : 07 - 10 - 2008
దీపావళి శుభాకాంక్షలు !!
Greetings on Meghadoot post card
Singapore post Issued a set of eight stamps featuring four different festivals Chinese New Year, Deepavali, Hari Raya, Aidilfitri and Christmas 
Date of Issue : 20 -10-2010.