"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 28 April 2015

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే  ఆంధ్రుల రాజధానిగా  విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం.
Amaravathi Sculpture 
India Post Issued a Commemorative postage stamp on 19 - 06 - 2003 on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai
Govt. Museum -Chennai

ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతాకూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగాజరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఇక్కడదొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్లలో భద్రపరిచారు. అమరావతి లో ఉన్న అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవితచరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి చెన్నై లోని ప్రభుత్వప్రదర్శనశాలలో భద్రపరచారు. అలా బద్రపరిచిన శిలా పలకాలలో ఒక దానిని 19-06 -2003 లో చెన్నై లో ఉన్న ప్రభుత్వ పురా వస్తు ప్రదర్శన శాల కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.
 Pictorial Cancellation  on Amaravath
A Special Cover on  Pictorial Cancellation at
Amaravathi on 28-02- 1976
అమరావతినగర   చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28-02-1976 లో  కేటాయించారు. ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మక్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లోఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది.
12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారుతొలి రోజు విడుదల చేసిన  ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా  అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు.
 అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం
Special cover on GUNTUR PEX-2004, Amaravathi Stupa, A.P.
Date of Issue : 06-08-2004

కాల చక్ర -2006
Special cover on Kalachara -2006, Amaravathi, A.P.
Date of Issue : 09-01-2006
బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.

Saturday, 18 April 2015

శ్రీ వెంకటేశ్వర బాల కుటిర్ - గుంటూరు, స్వర్ణ జయంతి

India Post released a special Cover on the occasion of Golden Jubilee of Sri Venkateswra balakuteer, Guntur, A.P. on 18th March 2015Shool emblem is used as a special cancellation on cover.

గుంటూరులో Dr.N. మంగాదేవి గారిచే స్థాపించబడి గత 50 ఏళ్ళగా విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ వెంకటేశ్వర బాల కుటిర్ స్వర్ణోత్సవ సందర్బంగా మన తపాల శాఖ ఒక ప్రతేక తపాల కవరు 18-3-2015 న విడుదల చేశారు.  ప్రత్యేక తపాల ముద్ర గా దీనిపై విద్యాశాల చిన్హం ను వాడారు. 
Golden Jubilee  of Sri Venkateswra Balakuteer, Guntur

Friday, 17 April 2015

కందుకూరి వీరేశలింగం పంతులు

A Commemorative postage stamps on
Kandukuri veeresalingam
Date of Issue : 15 - 07 - 1974

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఎన్నో నాటకాలు రాసిన కవి. ఏప్రియల్ 16 న జరిగే వీరి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల కళాకారుల దినోత్సవంగా జరుపుతున్నది. 
ఆయనకున్న ఇతర విశిష్టతలు
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
తెలుగులో మొదటి స్వీయ చరిత్ర , తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర  మరియు  తొలి ప్రహసనం రాసింది కుడా  కందుకూరే .
    కందుకూరి వీరేశలింగం పంతులు గారి గౌరవార్దం మన తపాలా శాఖా
     15 - 07 - 1974  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.
    Frist Day Cover on Kandukuri Veeresalingam

    Monday, 13 April 2015

    INIDA- FRANCE JOINT ISSUE


    India post issued a set of two stamp and miniature sheet on 10-4-2014 on India -France 50 years of space co-operation. The miniature has been  incorporated with QR code for the first time in India.
    Since the 1990's CNES (Centre National d’Etudes Spatiales) and ISRO (Indian Space Research Organization) have been collaborating together and the collective efforts have resulted in the launch of space missions - Megha-Tropiques in 2011 and SARAL in 2013.

    Tuesday, 7 April 2015

    కాకినాడలో తపాల బిళ్ళల ప్రదర్శన

    Google Map
    Numismatic and Philatelic Society of East Godavari is organizing ‘EGNPEX – 2015’ philatelic exhibition from 15th – 17th May 2015 at Kakinada,Andhra pradesh.
    తూర్పు గోదావరి నాణేలు, తపాల బిల్లల సేకరణ సంఘం వారిచే కాకినాడ లో తపాల బిళ్ళల ప్రదర్శన ‘EGNPEX – 2015’ మే 15,16,17 తేదిలలో జరుగుతుంది. ఈ సందర్బంగా 5 ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేయబోతున్నారు. 
    Venue: 
    Suryakalamandir, Kalpana Centre, Anandha Bharathi Road, 
    Surya Rao Peta, (Cinema Hall Road), Kakinada – 533 001.