"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 27 May 2016

మహానేత నందమూరి తారక రామారావు

తెలుగు వారికి ఒక విశిష్టత, గుర్తింపు కల్పించిన మహా నటుడు, మహానేత మన NTR . 
NTR  గౌరవార్దం 28-05- 2000 న మన తపాల శాఖా వారు మూడు రూపాయల విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ రూపకల్పన పరమాద్బుతం. ఈ తపాల బిళ్ళ పై నందమూరి తారాక రామారావు గారి చిత్రం తో పాటు వారి కీర్తి శిఖరం కు చిహ్నం గా హిమాలయ పర్వతాలు, చలన చిత్ర రంగానికి ప్రతినిధిగా సినిమా రీలు, దానిలో వారి ప్రజా/ కళా సేవకు గుర్తుగా భూమి,సూర్యుడు ఉన్నాయి. 

N.T.RAMA RAO
India Post released one  Commemorative postage stamp  to
 Dr. N.T.Ramarao on 28-05-2000

BROCHURE- NTR
తపాలాబిళ్ళ తో  పాటు విడుదల చేసిన ప్రత్యక తపాలా కవరుపై (FIRST DAY COVER) ప్రజలతో ప్రసంగించుతున్న N.T.రామారావు గారి చిత్రం ముద్రించారు . 
ఈ ప్రత్యేక కవర్ పై  ప్రత్యేక తపాలా ముద్ర గా ' శ్రీ కృష్ణ దేవరాయలు వేషం లో ఉన్న  రామారావు 'చిత్రం తో రూపొందించటం మరొక ప్రత్యేకతను సంతరించుకుంది. 
FIRST DAY COVER -NTR
నందమూరి తారక రామారావు(1923-1996) 
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి కీర్తి పతాకాన్ని దశదిశల చాటిన తేజోమయుడు,ఆంధ్రుల ఆరాద్యదైవంతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుఅన్న, మహానేత  నందమూరి తారక రామారావు
పద్మశ్రీడాక్టర్ నందమూరి తారక రామారావు గారు  1923, మే 28 వ తేదీన,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించటమే కాకుండా  పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం నిలపటానికి 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీతి వంతమైన సుపరిపాలన చేసి తెలుగు వారికి అన్నగా సుస్థిర స్థానాన్ని పొందారు.  
రాజకీయాన్ని సామాన్యుల చెంతకు తెచ్చి బలహీన బడుగు జీవులకు అధికారాన్ని అందించిన  అసమాన్యుడు NTR గారు 1996, జనవరి 18 న  వారు మరణించారు. 
తెలుగు జాతి ఆత్మ గౌరవానికి, సుపరిపాలనకు, నీతికి,న్యాయానికి నిలువెత్తు అద్దం గా నిలిచే మహానేత NTR కు చరిత్ర లో సుస్థిరమైన స్థానం ఉంటుంది .