"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Wednesday, 24 December 2014

కాకరపర్తి భావనారాయణ కళాశాల స్వర్ణ జయంతి

India Post released a special Cover on the occasion of Golden Jubilee of Kakaraparti Bhavanarayana College (KBN College) on 14th November 2014.

college emblem is used as a special cancellation on cover. This symbolizes  college is the sacred temple of learning, consciously devoted, in pursuit of the ideal. The Sun rays, the book and the burning lamp represent the divine attributes which aim in dispelling darkness and spreading light.
2014 , నవంబర్ 14,15,16 తేదీలలో విజయవాడ  లో జరిగిన  తపాల బిళ్ళలు , నాణేల ప్రదర్శన ' NUPHILA EXPO-2014' లో మన తపాల శాఖ 14-11-2014 న కాకరపర్తి భావనారాయణ కళాశాల, విజయవాడ స్వర్ణ జయంతి కి ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసారు.
 ఈ తపాల కవరు పై కళాశాల చిహ్నం ప్రత్యేక తపాల ముద్రగా స్వీకరించారు.
 "తేజస్వనావధీతమస్తు" అనే సూక్తి ,వెలుగు కు దీపం ,జ్ఞాన కిరణాలు, చదువుకు పుస్తకం ఈ ముద్రలో ఉన్నాయి. 
GOLDEN JUBILEE OF KBN COLLEGE- SPECIAL COVER

Thursday, 4 December 2014

గాన కోకిల - ఘంటసాల

తెలుగు సినిమా చరిత్రలో శాశ్విత కీర్తిని పొందిన మధుర గాయకుడు
పద్మశ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు (జ. 4-12-1922 మ. 11-02-1974)
కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన గాన కోకిల ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య  లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు.
 'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల 'వంటి భక్తిగీతాలు 'గుండమ్మ కథ' లో 'కోలు కోలో యన్న కోలో నా సామి ','లేచింది నిద్రలేచినింది ' వంటి పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే. 
ఇంకా 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ' వంటి వెన్నో మధుర గీతాలు ఘంటసాల గొంతులో ఉపిరి పోసుకొని తెలుగు వారిని మైమరిపిస్తున్నాయి. 
'అత్త లేని కోడలుత్తమురాలు ఓ యమ్మా',-వంటి జనరంజిక గీతాలతోపాటు కరుణశ్రీ గారి పుష్ప విలాపం 'భగవద్గీత పారాయణం'వారి కీర్తిని తెలుగునాట శాశ్వితంగా నిలుపుతాయి. 1970 లో వీరిని పద్మశ్రీ బిరుదు తో భారత ప్రభుత్వం సత్కరించింది. 

ఘంటసాల వెంకటేశ్వరరావు  గారి గౌరవార్దం మన తపాల శాఖ వారు rs 5/- విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను వారి వర్దంతి సందర్బంగా 11-2-2003 న విడుదల చేసారు
 A commemorative postage stamp of GHANTASALA 
Issued on- 11-2-2003
First day cover - Gantasala VenkateswararaoIndia - Slovenia Joint Issue

India Post issued a set of two stamps and Miniature sheet jointly with Slovenia on 28th November 2014 to commemorate 25th anniversary of the Convention on the Rights of the Child.
Stamps Issued by India

Stamps issued by Slovenia

Sunday, 23 November 2014

సత్య సాయి బాబా

సత్య సాయి బాబా పిలవబడుచున్న వీరి అసలు పేరు  సత్యనారాయణరాజు . 1926 నవంబరు 23న పుట్టపర్తిలో జన్మించాడు. తనకు తాను షిర్డీ లో ఉన్న సాయి బాబా అవతారమే నని ప్రకటించుకున్నారు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన మతగురువు. ఇతని పట్ల చాలామందికి అపారమైన భక్తి విశ్వాసం ఉంది. పుట్టపర్తి లో వీరు నెలకొల్పిన  సేవా సంస్థల అధ్వర్యంలో పెక్కు విద్యా, వైద్య సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి.
ఈయన 2011 ఏప్రిల్ 23న నిర్యాణం చెందారు.

India Post released a 5 rupees postal stamp  on SATHYA SAI BABA on 23rd November 2013
మన తపాలా శాఖ 23-11-2013 న పుట్టపర్తి సత్య సాయి బాబా 88 వ జన్మ దినం సందర్బం గా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 
SATHYA SAI BABA- PUTTAPARTHI.
SATHYA SAI BABA- First Day Cover
పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారిచే గతం లో అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. వాటిలో అనంతపురం జిల్లా వాసుల త్రాగు నీటి అవసరాలకు కొరకు నిర్మించిన 'శ్రీ సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్-అనంతపూర్ ' ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 731 గ్రామాలలో దాదాపు 12 లక్షల మందికి త్రాగు నీరు ఇచ్చే వీలుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ సందర్బంగా కుడా మన తపాలా శాఖ  వారు 23-11-1999 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళవిడుదల చేసారు.  
A Commemorative postage stamp  by India Post on
SRI SATHYA SAI WATER SUPPLY PROJECT'
Date of Issue -23 - 11 - 1999
FIRST DAY COVER - WATER SUPPLY PROJECT

Wednesday, 19 November 2014

ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ Dr. A.S రావు శత జయంతి

Special Cover on Dr. A. S. Rao, (1914-2003) on the occasion of his Birth Centenary Celebration - 16th November 2014.

హైదరాబాదులోని Elec tronics Corporation Of India Limited (ECIL) అనే‌కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక C.M.D (Chairman & Managing Director)  ప్రముఖ శాస్త్రవేత్త  పద్మభూషణ్  Dr.  A.S  రావు (1914-2003) గారి శత జయంతి సందర్బంగా మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు. A.S రావు గా సుపరిచితమైన వీరి పూర్తి పేరు అయ్యగారి సాంబశివ రావు. వీరికి 1960 లో పద్మశ్రీ 1972 లో పద్మ భూషణ్ బిరుదులను పొందారు. వీరి పేరుతో హైదరాబాద్ లో ఒక ప్రాంతానికి  A.S రావు నగర్ అని పేరు పెట్టారు 

Wednesday, 29 October 2014

విజయవాడ లో NUPHILA EXPO-2014

2014 , నవంబర్ 14,15,16 తేదీలలో ఫిలటేలిక్ ,నమిస్మాటిక్  వెల్ఫేర్ అసోసియేషన్,(PNWA) కృష్ణ జిల్లా  వారి నిర్వహణ లో విజయవాడ లో తపాల బిళ్ళలు , నాణేల ప్రదర్శన ' NUPHILA EXPO-2014' జరుగుతుంది .
ప్రదర్శన  వేదిక - KBN కాలేజీ కొత్తపేట , విజయవాడ 
పూర్తి వివరాలకు కార్యదర్శి శ్రీ  K.N.V. నవీన్ కుమార్--9293741834,9849407772 సంప్రదించండి
  


Thursday, 2 October 2014

ప్రపంచ అహింస దినం - గాంధీజీ జన్మదినం

2-10-2014 is celebrated as "Gandhi Jayanti" and whole World referred October 2nd as The International Day of Non-Violence as per United Nations. 

ప్రపంచ అహింస దినం - మహాత్మా గాంధీ

MAHATMA GANDHI - Issued by U.N.O. on
 International Day of Non - Violence- 2-10-2000

Was there a man in flesh and blood whom many of us Have seen, read and heard, whose image was chosen for stamps, coins ,currency Notes of more than hundred countries of the world in our life time?
Yes there was a man! Only one man! !
He was Mohandas Karmachand Gandhi (2-10-1869) Universally known as Mahatma Gandhi. Only Gandhi who lived as a very ordinary man but died as Martyr, who gave the world, the world of sophisticated weapons, the world that vied for each others blood, the world full of hate and selfishness, by the only balm of love and sacrifice, by the only remedy of Satyagraha known as Non Violence and “Non-Cooperation” the ultimate theory of “Do or Die” So that the millions might live and let live.
Mahatma was a messiah of India who walked into huts or palaces to remove the tears and bestow the joys. Such a man - Mahatma, has been honoured all over the world on many  commemorative stamps first day covers, special cancellations.More than hundred countries of the world have issued more than 250 stamps in all. 


MAHATMA GANDHI -U.K.-1969

MAHATMA GANDHI - U.S.A.-1961

MAHATMA GANDHI
PEOPLE'S REPUBLIC OF SOUTH YEMEN-1969

GANDHI -BHUTAN,1969

BUDDHA & GANDHI -BHUTAN

Mahatma Gandhi - SYRIAN ARAB REPUBLIC,1969

GANDHI- SRILANKA,1988
MAHATMA GANDHI - MOGAMBIQUE -1997

MAHATMA GANDHI - CYPRUS

MAHATMA GANDHI - COMORES

MAHATMA GANDHI - AFGHANESTAN -1999

GANDHI WITH NEHRU - MALDIVES,1989

జన్మభూమి - అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం

India Post Issued a Special Postal Cover On 'PEOPLE PARTICIPATION IN DEVELOPMENT'
on 13 -2- 1999, in the occasion of APPEX- '99
PEOPLE PARTICIPATION IN DEVELOPMENT  
శ్రీ చంద్ర బాబు నాయుడు గారు సమైఖ్య రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు చేపట్టిన 'జన్మభూమి' కార్యక్రమం లో ముఖ్యమైన నినాదం  'అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం'. ఆనాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడపాలన్న లక్ష్యం తో చిత్త శుద్దితో పనిచేసారనుటలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ప్రజల సహకారం లభించేలా, జన్మభూమి కార్యక్రమానికి విశ్రుత ప్రచారం కొరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆనాడు ఆయన ఉపయోగించుకున్నాడు. 
దానిలో భాగం గా 13-2-1999 న హైదరాబాద్ లో జరిగిన APPEX -99 లో మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా కవర్ 'అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం' అనే నినాదం తో విడుదల చేసింది.
ఇప్పుడు మన నవ్యాంధ్ర నిర్మాణం లో కుడా అదే స్పూర్తి తో మనం అందరం" జన్మభూమి - మా ఊరు" కు మద్దత్తు ఇచ్చి  అభివృద్ధి లో పాలు పంచుకుందాం 

Thursday, 25 September 2014

అక్కినేని కి అమెరికా లో వ్యక్తి గత తపాల బిళ్ళ

అక్కినేని నాగేశ్వరరావు 
అమెరికా లో అక్కినేని నాగేశ్వరరావు గారి అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న  ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్నితపాల బిళ్ళ పై  ముద్రించు కోవచ్చు. 
ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.  
మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్  పధకం లో ఇలాంటి వ్యక్తి గత తపాల బిళ్ళలు  పొందవచ్చు . 
AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా?
దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది. 
మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి,అల్లు రామలింగయ్య గార్లకు, చలనచిత్ర దర్శకులలో దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన LV ప్రసాద్,BN రెడ్డి గార్లకు, దర్శక రచయత త్రిపురనేని గోపీచంద్ కు గాయకులలో ఘంటసాల గారికి  మాత్రమే తపాల బిళ్ళలు విడుదల చెసారు. 
ఇప్పటికైనా అక్కినేని అభిమానులు,ఆయన వారసులు  మన తపాల శాఖను కలిసి,రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ సహకారం తో  ANR గారికి తపాల బిళ్ళను విడులచేయాలని వినతి పత్రం ఇవ్వాలి.
ఇప్పటివరకు దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన వారందరికి, వారి మరణాంతరం  తపాల బిళ్ళలు విడుదల చేస్తారు . దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన అక్కినేనికి కుడా తపాల బిళ్ళ విడుదల చేసే ఆస్కారం మెండుగా ఉంది. 
తెలుగు వారందరు గర్వపడేలా వచ్చే ఏడాది ANR గారి  జయంతికి  ఆంధ్రుల అందాల రాముడు అభిమాన నట సామ్రాట్   పద్మభూషణ్ అక్కినేని  తపాల బిళ్ళ విడుదల చేసేలా కృషి జరగాలి  


Friday, 12 September 2014

సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి స్మారక తపాలా కవరు


India Post  a Special Postal Cover issued On famous South Indian music  Director, Singer and actor CHAKRAVARTHI (Kommineni Appa rao) on 6-09-2014
గుంటూరు తపాల బిళ్ళలు, నాణేలు సేకరణ దారుల సంఘం (GNPS - Guntur Numismatic and Philatelic Society)ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గారెండవ రోజు  6-09-2014 న గుంటూరులో  ప్రముఖ తెలుగు సిని సంగీత దర్శకుడు ,గాయకుడు,నటుడు అయిన చక్రవర్తి గారికి  ఒక స్మారక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు
Spcial cover on CHAKRAVARTHI 

చక్రవర్తి పేరుతో ప్రత్యేక తపాల ముద్ర 
చక్రవర్తి (1936-2002 )
తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త,గాయకుడు, నటుడు కె చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు .  ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు. 
సంగీత చక్రవర్తి గారు 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర సంగీత రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. పలు  సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ కుడా చెప్పారు.
1977 లో వచ్చిన యమ గోల తో మంచి పేరు పొందారు. 1989 లో తెలుగులో 95 సినిమా లు విడుదల అయితే  వాటిలో 66 చిత్రాలకు చక్రవర్తి గారే సంగీతాన్ని కూర్చటం ప్రపంచ చిత్ర పరిశ్రమలోఒక రికార్డ్. నేటి భారతం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని అందుకున్నారు. 

Saturday, 6 September 2014

షేక్ నాజర్ కు, గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు


India Post  a Special Postal Cover issued On SHAIK NAZAR (BURRA KATHA) AND GURRAM JASHUVA (WRITER) on 5 -9- 2014

Spcial cover on SHAIK NAZAR , GURRAM JASHUVA

GNPS - (Guntur Numismatic and Philatelic Society)ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గా 5-09-2014 న గుంటూరులో  ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ కు, ప్రఖ్యాత కవి గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు,  దీనిపై తపాల ముద్రగా నాజర్ బుర్ర కథ లో వాడే 'తంబూర' , జాషువా రచన 'గబ్బిలం ' పుస్తకం ఉన్నాయి.
షేక్  నాజర్ (1920-1997)బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు, 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో మరణించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.ప్రజా కళాకారుడుగా,అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌.
పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి
1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.
 
గుర్రం జాషువా (1895 - 1971): ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. భారతప్రభుత్వం పద్మభూషణ్  బిరుదుతో సత్కరించింది. గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం.  కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

Wednesday, 3 September 2014

stamps on Indian Musicians

India Post released a Set of 8 stamp on Indian Musicians on 3rd September 2014 to pay tribute to legendary maestros of Indian Classical Music.

Indian Classical Music is of two types, Hindustani and Carnatic Music. Hindustani music is mainly found in North India and Carnatic in South India. The stamps released on legendary maestros Ravi Shankar, Bhimsen Joshi, D.K.Pattammal, Gangubai Hanagal, Kumar Gandharva, Vilayat Khan, Mallikarjun Mansur, and Ali Akbar Khan.

Friday, 29 August 2014

గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన

GUTUR STAMPS & COINS FEST-2014
GNPS - (Guntur Numismatic and Philatelic Society) 20 వ వార్షికోత్సవం సందర్బం గా  2014 సెప్టెంబర్ 5,6,7తేదిలలో గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన జరుపుతున్నారు. గుంటూరు  బృందావన్  గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి.  
ప్రవేశం ఉచితం.
ఈ సందర్బంగా తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే లా ప్రత్యేక తపాల కవర్లు , ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు.
తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్  స్టాల్ లు ఏర్పాటు చేస్తునట్లు GNPS  కార్యదర్శి శ్రీ MVS ప్రసాద్ తెలియ జేస్తున్నారు. 
GNPS -15 వ వార్షిక ప్రదర్శన సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవర్ 

Friday, 22 August 2014

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం

TANGUTURI PRAKASAM
టంగుటూరి ప్రకాశం పంతులు (1872 - 1957) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పదకొండు నెలలు పనిచేసారు. తరువాత 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్య మంత్రి గా దాదాపు 14 నెలలు పనిచేసారు. నిస్వార్ధ ప్రజా సేవకుడు.
ప్రకాశం పంతులు తో పాటు వేమన ,వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ ల ప్రధమ దిన కవర్ 
 ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16,1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.ఈతపాల బిళ్ళ పై తెలుగులో ( టం.ప్రకాశం) అని ప్రకాశంగారి సంతకం ఉంది.తపాల బిళ్ళ పై తొలితెలుగు అక్షరాలు ఇవే.
అదే సమయం లో  ప్రకాశం గారి తపాల బిళ్ళతో పాటు  మన ప్రజా కవి వేమన, భాయి వీర్ సింగ్ , బెట్రెండ్ రసూల్ కుడా తపాల బిళ్ళలు విడుదల చేసారు 

Wednesday, 20 August 2014

ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల

Andhra Pradesh Postal Circle released a Special Cover to mark 81st birth anniversary of Professor Kothapalli Jayashankar on 6th August 2014 at Hyderabad. 
6-08-2014 న మన తపాలా శాఖ తెలంగాణా ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయ శంకర్ కు ప్రత్యేక తపాలా కవర్ విడుదల  చేసింది. ఆచార్య N. G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మార్చి జయశంకర్ గారి పేరు పెట్టి ఆ సందర్బంలో ఈ తపాల కవరు విడుదల చేసారు. బతికి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిన వీరు మరణించినా తెలుగు జాతి మధ్య విద్వేషాన్ని రగాల్చటానికి ఉపయోగ పడటం శోచనీయం. ప్రపంచ కర్షకులారా ఏకం కండి అని నినదించి రైతు కూలి శ్రేయోరాజ్యం కొరకు జీవితాంతం పోరాడిన రైతు నాయకుడు ,గాన్దేయవాది శ్రీ NG  రంగా పేరును తీసి జయశంకర్ పేరు పెట్టేకన్నా ఒక కొత్త విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టటం సరైన నివాళి.  

Thursday, 7 August 2014

తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు 

2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన  తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా 'తెలుగు వెలుగులు ' పేరుతో తెనాలి కి చెందిన  శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే. ఈ ప్రదర్శన కు  సాయి కృష్ణ కు వెండి -రజిత (SILVER- BRONGE ) పతకం  బహుమతిగా వచ్చింది.  
కేసినేని నాని నుండి తెలుగు వెలుగులు కి బహుమతి ని స్వీకరిస్తున్న వి. సాయి కృష్ణ 
 తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు ప్రదర్శన లో కొంత భాగాన్ని మీరు  ఇక్కడ   చూడగలరు.