"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Wednesday, 11 January 2017

గురు గోవింద్ సింగ్ 350వ జయంతి

సిక్కు మతపు చివరి ప్రవక్త గురు గోవింద్ సింగ్ 350వ జయంతి ( ప్రకాష్ ఉత్సవ్ ) సందర్భంగా 5-1-2017 న మన తపాల శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

దీనిపై పాట్నా లోని గురు గోవింద్ స్మారక దేవాలయం ( తఖ్త్ శ్రీ హరిమందిర్ జి పాట్నా సాహిబ్)

ఇంతకు ముందు గురు గోవింద్ సింగ్ ( 1666-1708)  300వ జన్మ దినం సందర్భంగా ఇదే గురుద్వార్ బొమ్మతో ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ 17-01-1967 లో విడుదల చేసారు. 


India and Portugal Joint Issue

Commemorative Joint Issue on Diplomatic relations between Commemorative Joint Issue Stamps on Diplomatic relations between India and Portugal – 7th January 2017.issued on 7th January 2017 by India Post.Monday, 9 January 2017

ఈ ఏడాది విడుదల అవుతున్న మన తపాలా బిళ్ళలు

మన భారత తపాలా ఈ ఏడాది విడుదల చేస్తున్న తపాలా బిళ్లలపై  మన తెలుగు వారిపై వస్తున్న తపాలా బిళ్ళలు 
1. జ్ఞానపీట్ అవార్డు పొందిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 
2, కవయిత్రి మొల్ల (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)
3. కవయిత్రి తరిగొండ వెంగమాంబ. (1730-1817)
4.ఆదికవి  నన్నయ భట్టారకుడు (10వ శతాబ్ది)
5. ద్రాక్షారామ ఆలయం 
6. మంగళపల్లి బాల మురళి కృష్ణ 
7. కొండా లక్ష్మణ్ బాపూజీ 
మనకు సంబంధించి ఇన్ని తపాలా బిళ్ళలు ఒక ఏడాదిలోనే విడుదల అవటం విశేషం . స్వతంత్రం వచ్చిన తరువాత తొలిసారి తెలుగు వారికి సముచిత స్థానం లభిస్తుంది. 

Wednesday, 4 January 2017

స్వాగతం-2017 -Splendours of India


భారత తపాల శాఖ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 25 రూపాయల విలువగల  12 తపాలా బిళ్లలను 1-1-2017 న "స్పెలండెర్స్ ఆఫ్ ఇండియా " పేరుతో  విడుదల చేసింది. వీటితో పాటు 12 నెలల  కాల మానిని ఒక్కో తపాల బిళ్ళ తో విడుదల చేసింది. దీని వెల  1000 రూపాయలు 
Splendours of India 
(1) Ganesh Pol, Amber Fort, Jaipur (2) Pashmina Shawl, Kashmir (3) Chhau Mask 
(4) Bodhi Tree, Sandstone Relief Sculpture, Sanchi (5) Sarota, Areca Nut Cutter 
(6) Peacock Gate, City Palace, Jaipur (7) Chaitya Hall, Karle 
(8) Thanjavur (Tanjore) Painting (9) Blue Pottery, Jaipur 
(10) Coloured Glass Window, Bagore Ki Haveli, Udaipur 
(11) Parchinkari, Pietra Dura (12) Zardozi Carpet, Agra.