"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Wednesday, 17 July 2013

కడప లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన

NUPHILEX -KADAPA , 26,27,28 JULY 2013
  

GNPS - (Guntur Numismatic and Philatelic Society) గుంటూరు వారి నిర్వహణతో 2013 జూలై 26,27,28 తేదిలలో కడప పట్టణం  లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన జరుగుతుంది.
కడప లోని TTD  కళ్యాణ మంటపం, మద్రాస్ రోడ్ లో  మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం.ఈ సందర్బంగా పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు. తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేసినట్లు GNPS  కార్యదర్శి శ్రీ ప్రసాద్ తెలియ జేస్తున్నారు.