Skip to main content

Posts

Showing posts from October, 2019

చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలు

మన దేశంలో 16 వ శతాబ్దాలలో నిర్మించిన అనేక చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలలో ఎనిమిది పైన మన తపాలా శాఖ 19-10-2019న 8 తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  వీటిపై ఆగ్రాకు సమీపంలో ఉన్న ఫతేపూర్ సిఖ్రీ లో ఉన్న బులంద్ దర్వాజా, బికనీర్ లోని కోట గుమ్మం, జైపూర్లోని జొరవర్ గేట్, జోధాపూర్ సర్దార్ మార్కెట్ గేట్ , కాశ్మీర్ గేట్ ఢిల్లీ, రూమి దర్వాజా లక్నౌ, మ్యాగజైన్   గేట్ అజ్మీర్ , ఢిల్లీ గేట్  స్థానం లభించింది. India Post issued a set 8 Commemorative Postage stamps on 'Historical Gates of Indian Forts and Monuments' on 19.10.2019. The stamps depict Buland Darwaza, Fatehpur Sikri; Kote Gate, Bikaner; Jorawar Gate,Jaipur; Sardar Market Gate,Jodhpur; Kashmere Gate,Delhi; Roomi Darwaza,Lucknow; Magazine Gate,Ajmer and Delhi Gate,Delhi.

సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలు-2

Scented Stamps on Indian Perfumes-2 India post issued a set of 4 scented commemorative postage stamps and Two miniature sheets on Indian Perfumes on 15.10.2019. Two of these stamps depict agarwood and the other two stamps depict orange blossom.each stamps are of denomination rs 25/- మన తపాలా శాఖ 15 - 10 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను , రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి అగార్ చెక్క, ఆరంజ్ బ్లోసమ్ వాసనలతో వచ్చాయి. ఇంతకుముందు మన తపాలా శాఖ 01- 08 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి గంధపు చెక్క, మల్లె పువ్వు వాసనలతో వచ్చాయి.
మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా 2-10-2019 న మన తపాల శాఖ ఆరు అష్టభుజ తపాలా బిళ్ళలు  మినియేచర్ తోపాటు విడుదల చేసింది. 25 రూపాయల విలువగల ఈ అష్టభుజ తపాలాబిళ్ళలు మన దేశంలో ముద్రించటం ఇదే మొదటసారి. వీటిపై గాంధిజీ చిన్ననాటి ఫోటో నుండి తుది వరకు వివిధ సంఘటనలు చోటుచేసుకున్నాయి.  గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని గత ఏడాదినుండి విడుదల చేస్తున్న తపాలా బిళ్ళల పరంపరలో ఇవోకటి.