"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 16 July 2015

గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

మన తపాల శాఖ 'మై స్టాంప్ ' పధకం లో భాగంగా గోదావరి పుష్కరాలపై 14-7-2015 న ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను విడుదల చేసింది. అన్ని ప్రధాన తపాల శాఖలలో వీటిని పొందవచ్చు.

On the festive occasion of Godavari Pushkaram, India Post released fifth series of ‘My Stamp’ on Godavari Pushkaram 2015 theme on 14th July 2015. 
The template is having image of Godavari River and sheet of 12 stamps depicts the Godavari Arch Bridge, a bowstring-girder bridge that spans the Godavari River in Rajahmundry and photo of Godavari Maha Aarti at Rajahmundry, Andhra Pradesh.
గోదావరి పుష్కరాల పై తపాల బిళ్ళ

Sunday, 5 July 2015

గోదావరి పుష్కరాలు - మేఘదూత్ పోస్ట్ కార్డ్స్

గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములోసంగమిస్తుంది.ప్రతి పండెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 వ పుష్కరం ను మహా పుష్కరం అని అంటారు . ఇది 144 ఏళ్లకు ఒక సారి వస్తుంది. 
2015 జూలై 14 నుండి గోదావరికి మహా పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్బంగా మన తపాల శాఖ తెలుగు మరియు హిందీ భాషలలో రెండు మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ను విడుదల చేసింది. 
MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015  

MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2015  
గోదావరి పుష్కరాలు-2003(30-07-2003 నుండి 10-08-2003 ) కు రాజమండ్రి కి యాత్రికులకు స్వాగతమ పలుకుతూ  మన తపాల శాఖ  ఆనాడు కుడా ఒక మేఘదూత్ పోస్ట్ కార్డు ను విడుదల చేశారు.  2003 పుష్కరాలు  కుడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అద్వర్యంలో నే జరిగాయి 

MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2003