"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 17 February 2015

శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం

                                     
శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం
ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి  శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం. 
ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ 15 -5 -2003 న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది.
మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ  దేవాలయము అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.
Mallikarjuna swami temple -SRISAILAM - FDC 

శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 న ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది. 
ప్రత్యేక పోస్టల్ ముద్రగా (Pictorial post mark )ఆలయ రాజ గోపురం ను కవరు పై   భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను ముద్రించారు.
Pictorial post mark - Srisailam
Pictorial Cancellations – Inaugural Cover- Srisailam
A Pictorial Cancellation was introduced at Srisailam on Lord Mallikarjuna Temple on 07 Mar 1978 . An Inaugural special cover was issued to commemorate the Event. The Cancellation shows Temple and cover Shows Lord Mallikarjuna and Bhramaramba.
India Post Issued a set of Four  Commemorative postage stamps on  15 -5 -2003 on famous Hindu temples 
One of the Stamps shows Mallikarjuna swami temple -SRISAILAM and remainig  three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri.
Srisailam is a Holy town situated in Nallamala Hills of Kurnool District of Andhra Pradesh on the banks of River Krishna.

Saturday, 14 February 2015

దామోదరం సంజీవయ్య

On14th February 2008 India Post Issued a commemorative postage stamp on
DAMODARAM SANJEEVAIAH (1921-1972)

DAMODARAM SANJEEVAIAH- FIRST DAY COVER
దామోదరం సంజీవయ్య 
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య  1921 ఫిబ్రవరి14న కర్నూలు జిల్లా,   కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. 

తొలి దళిత ముఖ్యమంత్రి గా పని చేసిన వీరు  రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. 7-5-1972 న వీరు మరణిచారు. 
మన తపాల శాఖ 14-2-2008 న దామోదరం సంజీవయ్య స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది. దీనిపై ఆంద్రప్రదేశ్ ను ప్రతిబంబిచేలా చార్మినార్, తిరుమల దేవాలయం , నాగార్జున సాగర్ ఆనకట్ట , కూచిపూడి నృత్యం  ఈ తపాల బిళ్ళ పై చూడవచ్చు. ప్రధమ దిన కవరు పై ఆంధ్ర ప్రదేశ్ అసంబ్లీ  భవనం కుడా చూడవచ్చు.