"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 25 April 2017

శ్రీ వెలగపూడి రామకృష్ణ

India post Issued a My Stamp sheetlet  on 75 Years of KCP Limited and Its founder 
Sri Velagapudi Rama Krishna
 on 30-12-2016
వెలగపూడి రామకృష్ణ గారు దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు.
1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లం వారిపాలెం అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర, సిమెంటు తయారు చేయు పరిశ్రమలు  ముఖ్యమైనవి.
రామ కృష్ణ గారు 1941 లో  స్థాపించిన  KCP Limited  75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మన తపాలా శాఖ వారి సౌజన్యం తో వ్యక్తిగత తపాలా బిళ్ళను 30-12-2016 న విడుదల చేసారు.  వారిపై ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయాలని ఆశిస్తున్నాం. 

అలాగే కెసిపి 75 వసంతాల వేడుకలో భాగంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను 27-12-2017 న చెన్నై లో విడుదల చేసారు. 
Special cover on kcp Limited

Special cover on KRISHNA PEX- 2005

ఇంతకు ముందు మచిపట్నం లో 17-9-2005 న జరిగిన కృష్ణా జిల్లా తపాలా బిళ్ళల ప్రదర్శనలో(KRISHNA PEX- 2005) ఒక ప్రత్యేక  పోస్టల్ కవర్ విదుదల చేసారు. దానిపై  పారిశ్రామిక దార్సినికుడు, మార్గ దర్శి శ్రీ వెలగపూడి  రామకృష్ణ  గారి చిత్రంతో పాటు వారిచే  ఉయ్యురులో 1941 లో సహకార రంగంలో  స్థాపించబడిన పంచదార మిల్లు (K.C.P. SUGARS),చెరుకు తోట చిత్రాలు ముద్రించారు. 

K.C.P. SUGARS, UYYURU- IN SERVICE TO THE PEOPLE
Date of Issue: 17-9-2005

ఈ ప్రత్యేక పోస్టల్ కవరు పై మన రాష్ట్రానికి గవర్నర్ గా,ఉప రాష్ట్రపతిగా పనిచేసిన క్రిష్ణకాంత్ గారి పై విడుదల చేసిన తపాల బిళ్ళ,దానిపై మచిలీ పట్నం కు ప్రాతినిద్యం గా చేప బొమ్మతో ఉన్న ప్రత్యేక పోస్టల్ ముద్ర ఉన్నాయి.

No comments: