"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 30 December 2011

పండిట్ మదన మోహనమాలవ్య

India Post issued a commemorate stamp on the occasion of  150th Birth Anniversary of Pt . Madan Mohan Malaviya on  27 December 2011
Madan Mohan Malaviya (1861–1946) was an Indian educationist, and freedom fighter. He was the president of the Indian National Congress  in 1909, 1918, 1930 and 1932.  He later founded Banaras Hindu University, commonly known as BHU, a prominent institution of learning in India today.
Malviya Ji popularised the slogan Satyameva Jayate (Truth alone will triumph)
Madan Mohan Malaviya  - Birth Centenary
 Date  of  Issue :25 December 1961
Benaras Hindu University - 75th Anniversary
Madan Mohan Malaviya and B.H. University - 
           Date  of  Issue : 21 January 1991

Thursday, 22 December 2011

Archaeological Survey of India

On 20th December 2011 India Post issued a set of two stamps and a miniature sheet on 150 years of Archaeological Survey of India.
The Archaeological Survey of India (ASI), under the Ministry of Culture, is the premier organization for archaeological research and protection of the cultural heritage of the nation. The prime concern of the ASI is the maintenance of ancient monuments and archaeological sites and remains of national importance.

India post Issued Two Stamps on 14 December 1961, during the Centenary of Archaelogical Survey of India



Saturday, 10 December 2011

Children's Day-2011

On 14th November 2011 India Post issued a set of two stamps and a Miniature Sheet on Children's Day. 
These stamps were selected from the winning entries of  Design a Stamp Painting competition on the theme of  "Save the Tigers" by school children. 
This is also said to be the 100th MS of India.

Saturday, 29 October 2011

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI
Legendary heroines of Indian cinema 
India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi  of Indian cinema, on February 13th, 2011


 First day Covers

MINIATURE SHEET- SAVITRI
ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు,మహా నటి సావిత్రికి చోటు కల్పించారు.
మిగిలినవారు మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి.
ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి  గుంటూరుజిల్లా,  తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది.
సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదనాన్న  కొమ్మారెడ్డి వెంకట్రామయ్యచౌదరి వద్ద పెరిగింది. చిన్నతనంలోనే సావిత్రి  సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో  ప్రదర్శనలు ఇచ్చింది.  పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని మహా నటిగా గా విరాజిల్లింది. తమిళ నటుడు జమిని గణేష్ ను వివాహం చేసుకుంది.
దేవదాసు,మిస్సమ్మ, మాయాబజార్ , తోడికోడళ్ళు,మూగమనసులు వంటి గొప్ప చిత్రాలలో నటించి తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

Thursday, 6 October 2011

మన పండుగలు - దసరా, దీపావళి



చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి. 
దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి.
A set of three stamps on Festivals of India, by Indian Post.
Date of Issue : 07 - 10 - 2008
DURGA PUJA,DUSSEHRA - KOLKATA,FESTIVAL OF INDIA
DUSSEHRA - MYSORE,FESTIVAL OF INDIA
 DEEVALI -FESTIVAL OF INDIA
FIRST DAY COVER- FESTIVAL OF INDIA
MINIATURE - FESTIVAL OF INDIA 

Tuesday, 4 October 2011

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover 
India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011.
Tripuraneni Gopichand (8 September 1910 - 2 November 1962) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director. 


Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award.

    TRIPURANENI GOPICHAND

    ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు,మనోవైజ్ఞానిక సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లాఅంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త ,కవి రాజు త్రిపురనేని రామస్వామి. తండ్రి కొడుకులు లిద్దరికీ మన తపాల శాఖ ప్రత్యక తపాల బిళ్ళలను విడుదల చేయటం అపూర్వ విషయం.
    త్రిపురనేని రామస్వామి 

    హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో రామస్వామి గారి వద్ద పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. 
    1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
    1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
    గోపి చంద్ గారి రచనలు 
    • అసమర్థుని జీవయాత్ర
    • గడియపడని తలుపులు
    • చీకటి గదులు
    • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
    • ప్రేమోపహతుల
    • పరివర్తన
    • యమపాశం
    • శిధిలాలయం
    • తత్వవేత్తలు
    • పోస్టు చేయని ఉత్తరాలు
    • మాకూ ఉన్నాయి సొగతాలు
                                                  సినిమాలు
    1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. చలన చిత్ర రంగం లో వారు చేసిన కృషి 
      • చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
      • ధర్మదేవత (1952) (మాటల రచయిత)
      • ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు)
      • పేరంటాలు (1951) (దర్శకుడు)
      • లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
      • గృహప్రవేశం (1946) (కథా రచయిత)
      • రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

    Saturday, 3 September 2011

    Teachers Day - సర్వేపల్లి రాధాకృష్ణ

    ఉపాధ్యాయ వృత్తికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి.
    మన తపాల శాఖ వారు వీరి గౌరవార్దం 1967 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను రాష్ట్రపతిగా వారు పదవీవిరమణ చేసిన సందర్బంగా విడుదల చేసారుమరల వారి శత జయంతిన మరొక తపాల బిళ్ళను 1989 లో విడుదల చేసారుఈ రెండు తపాల బిళ్ళలను వారి జన్మ దినం అయిన సెప్టెంబర్ 5  విడుదల చేసారు.

    Date of Issue: 5 September 1967
    Sarvepalli Radhakrishna - 75th Birth Anniversary


    Dr.S.RADHAKRISHNAN
    -Birth centenary
    Date of issue: 05-09-1989

    డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి(1962-1967). అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. మద్రాసుకు 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు
    • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు. 
    • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
    • 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
    • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.

    Saturday, 27 August 2011

    Statue of Buddha

    A special cover Issued by India Post on 16-10-2003 in APPEX - 2003. The cover and cancellation Shows the Statue of Buddha in Hussen sagar,Hyderabad.
    హైదరాబాద్ లో ఉన్న  హుస్సేన్ సాగర్‌లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. తెలుగు వారికి దశ,దిశ చూపిన  శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలం తో అనేక మంది  శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం స్థాపన సమయంలో నీట మునిగింది. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి  'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన  ప్రతిష్టించారు. ఈ చెరువు గట్టుపై (టాంక్ బండ్) తెలుగు జాతి లో విశిష్టమైన స్థానం కలిగిన 33 మహనీయులు విగ్రహాలు ఉన్నాయి.

    Rashtrapati Bhavan - New Delhi

    A set of 4 stamps and a Miniature Sheet was released on Rashtrapati Bhavan 
    by India Post on August 05, 2011.
    Miniature Sheet

    The Rashtrapati Bhavan ( Presidential House/Palace)  is the official residence of the President of India,located at Raisina hill in New Delhi,India.Until 1950 it was known as "Viceroy's House" and served as the residence of the Viceroy and Governor-General of India. At present,it is the largest residence of any Chief of the State in the world.The construction of the building was planned for 4 years,but World War I intervened and construction required 19 years to complete.Its first occupant,Lord Irwin,began occupation on Jan. 23, 1931. 

    Friday, 29 July 2011

    కాసు బ్రహ్మానందరెడ్డి

    India Post released a commemorative postal stamp on
     KASU BRAHMANANDA REDDY 
    Date of Issue : 28th July 2011.
    KASU BRAHMANANDA REDDY
    మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు.
    ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో చేరారు. పిమ్మట దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. ఆర్ధిక శాఖను వారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే నని ఒక నానుడి.
    1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
    కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.
    1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది.  ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా మరో వర్గానికి కాసు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి ఘన విజయం సాధించింది. దానితో రెడ్డి కాంగ్రెస్ 1980లో ఇందిరాకాంగ్రెస్‌లో విలీనం చేశారు. బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.
    First Day Cover -K. Bramhananda Reddy
    కాసు బ్రహ్మానందరెడ్డి102 వ  జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

    Friday, 22 July 2011

    బకింగ్ హం పేట పోస్ట్ ఆఫీసు , విజయవాడ

    A Special Cover by India Post On Centenary Celebrations  of 
     Buckinghampeta Post office, Vijayawada  on 1- 10 - 2000
    1- 10 - 2000 న  నూరు వసంతాలు జరుపుకున్న బకింగ్ హం పేట   పోస్ట్  ఆఫీసు , విజయవాడ 

    Monday, 11 July 2011

    New series of coins by Reserve Bank of India

    The Reserve Bank of India released a new series of coins on 08 Jul 2011 with improved design and revised size in the denomination of 50 paise, Rs. 1, 2, 5, and 10.  The present series of coins of 50 paise, Rs. 1, 2, and 5 contain a flowery design and for Rs.10, the number of petals have been brought down to 10 in place of the existing 15 petals. The parallel lines on the obverse side of the Rs. 10 coin have been removed and the size of Ashok Pillar has been increased. security edging of new series of coins would be good for better recognition by visually challenged persons and will have improved counterfeit resistance.

    Friday, 10 June 2011

    M.F.Husain Paintings


    Maqbool Fida Husain (17 Sept.1915 – 9 June 2011) commonly known as MF, was an eminent Indian painter. According to Forbes magazine, he has been regarded as the "Picasso of India" He has been awarded the Padma Bhushanin 1973 and was nominated to the Rajya Sabha in 1986. He was awarded the Padma Vibhushan in 1991.Some of Husain's works became controversial because of their portrayal of Hindu deities in the nude. After legal cases and death threats, he was on a self imposed exile from 2006. In January 2010, he was offered the citizenship of Qatar, which he accepted. He died in London in June 2011.


    India Post Used Some of M.F.Husain Paintings on postal Stamps

    Bal Gangadhar Tilak's proclamation " Swaraj is my Birthright"
    Issued in 1988 on Freedom Forty Swaraj
                               

                                             Rani Lakshmi Bai of Jhansi"
                                    Issued in 1988 to commemorate 1st War of Independence

    " Between the Spider and the Lamp"
    Issued in 1982 on Contemporary Art at the Festival of India

    Thursday, 9 June 2011

    తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

    India Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.
     SRI KRISHNADEVARAYA  

    Miniature sheet of   KRISHNADEVARAYA

    "తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
    తెలుగు వల్లభుండ తెలుగొకండ,
    యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
    దేశ భాషలందు తెలుగు లెస్స"
    అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి   మన శ్రీ కృష్ణ దేవరాయలు(1509-1529)
    ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు.
    కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద  అనే గ్రంథాన్ని రచించాడు.
    రాయల ఆస్థానం లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు  'అష్టదిగ్గజములు' గా ప్రఖ్యాతి పొందారు.
    తిరుమల శ్రీవారి ఆలయంలో
    దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు 
    MAXIMUM CARD
    The original portrait of the emperor Sir Krishnadevaraya done by Domingo Paes, Portuguese traveller who visited his court and penned down his memories.
    శ్రీ కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 27 -01 -2011 న మన తపాలా శాఖ వారు ఒక ప్రతేక తపాల బిళ్ళను, మినీ ఏచర్ ను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళను తిరుమల శ్రీవారి ఆలయంలో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని, హంపి శిల్ప కళా వైభవాన్ని చాటేలా  అందంగా రూపొందించారు.  
    Frist Day Cover - Sri Krishnadevarayalu,Hampi

    Saturday, 4 June 2011

    కొండపల్లి బొమ్మలు

    A Special Cover 0n Kodapalli Toys by Indian Post 0n 5 - 1- 95 during the Inauguration of Philatelic Bureau, Vijayawada. The cover shows various Toys  made at Kodapalli, in Krishna Dist.,A.P.The cancellation Shows the 'Cobra Sculpture'at Nagarjuna Konda. 
    కొండపల్లి బొమ్మలు
    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి,విజయవాడ కు సమీపం లో ఉంది. ఈ  బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల తెలుగు 
     సంస్కృతి జన జీవనం, ఆంద్రుల కట్టు బొట్టు వేషదారణలను
    సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు.

    పోస్టల్ ముద్రలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు

    A Special cover by India Post at APPEX - 81 on 12 - 1 - 1981
    The Special postal cancellation shows The last King Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.  The Cover displays, statue of Buddha at Nagaruna Konda, one of India's richest Buddhist sites,located at near Nagarjuna Sagar in Guntur /Nalgonda district,A.P. 
    ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. రాణి రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్నుకాకతీయ రాజ్యానికివారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది.1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించగా  ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
    ఢిల్లీసుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపగా ఆ యుద్ధం లో ప్రతాప రుద్రుడు ఒడి పోయాడు. ప్రతాప రుద్రుడు వారికి బందీగా చిక్కి ఢిల్లీ కి తరలిస్తుండగా  మార్గ మద్యమం లో మరణించటం తో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది. 

    Friday, 27 May 2011

    African and Asian Elephants

    India Post released a set of 2 stamp & Miniature Sheet on 25th May 2011 to commemorate  2nd Africa-India Forum Summit. The stamps depict the African and Asian Elephants in the denomination of Rs.25/- and Rs.5/-.


    Miniature Sheet 
    2nd Africa-India Forum Summit

    Sunday, 22 May 2011

    A.C. COLLEGE, GUNTUR

    A Special Cover On Andhra Christian College Centenary Celebrations 
    by India Post  on 23-11-1985

    Andhra-Christian College, popularly known as A.C College, is one of the oldest colleges in India to offer graduate programs.It was established in 1885 in Guntur ,Andhra Pradesh.
    AC College is part of the educational enterprise of the Protestant churches. The College admits intermediate, under-graduate and graduate students and awards degrees through theAcharya Nagarjuna University, Guntur.
    Saint George is the patron saint of the College. At the entrance of the college a statue of the patron saint's image slaying the dragon is found.( It is Shown on Cover)
    The college motto - "you shall know the truth, the truth shall make you free" along with college emblem can be also seen on cover.
    Alumni of College :
    N.G. Ranga, N.T.R, U.Sobhan Babu (cinima), Kasu Bhramhanada Reddy, Dr.Anji Reddy, J.Papaiah Sastri,K. Rosaiah etc.

    Thursday, 19 May 2011

    Rabindranath Tagore Stamp by Sri Lanka

    To mark the 150th Birth Anniversary of Rabindranath Tagore 
     Sri Lanka Post  issued a commemorative postage stamp on 7th, May 2011.

    Rabindranath Tagore 
    First day Cover
    గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కి శ్రీ లంక నివాళి
    గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి సందర్బంగా 7మే,2011 న  శ్రీ లంక  ఘనంగా నివాళి ఇస్తూ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. గురుదేవ్ లు 1922 ,28 ,34 లో మూడు సార్లు శ్రీ లంక దేశాన్ని సందర్శించారు. శ్రీ లంక జాతీయ గీతాన్ని రాసిన ఆనంద సమరక్క శాంతి నికేతన్ లో 1936 లో విద్యను అభ్యశించాడు.  టాగోర్ ప్రభావం తో ఈ గీతాన్ని రాసినట్లు విమర్శకుల అభిప్రాయం.