"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 25 September 2014

అక్కినేని కి అమెరికా లో వ్యక్తి గత తపాల బిళ్ళ

అక్కినేని నాగేశ్వరరావు 
అమెరికా లో అక్కినేని నాగేశ్వరరావు గారి అబిమానులు(AFA) వారికి నివాళిగా20-9-2014 న  ఒక వ్యక్తి గత తపాల బిళ్ళను usps చే విడుదల చేపించారు . దీనికి ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండదు . ఇలాంటి వాటిని USPS కు డబ్బు చెల్లించి ఎవరిదైన వ్యక్తిగత చిత్రాన్నితపాల బిళ్ళ పై  ముద్రించు కోవచ్చు. 
ఇప్పటివరకు అమెరికా తపాల శాఖ వారు మన దేశానికి సంబందించి మహాత్మా గాంధీ గారికి , మదర్ తెరెసా కు మాత్రమే అధికారక తపాల బిళ్ళలు విడుదల చేసి వారిని గౌరవించారు.  
మన దేశం లో కుడా Rs 300 /- తో మై స్టాంప్  పధకం లో ఇలాంటి వ్యక్తి గత తపాల బిళ్ళలు  పొందవచ్చు . 
AFA వారు దీనికి ఇంత ఎత్తున ప్రచారం చేయాలా?
దీనికంటే హైదరాబాద్ GPO లో అక్కినేని జయంతి న ఒక స్మారక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసిన బాగుండేది. 
మన తెలుగు సినిమా నటులలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ,సావిత్రి SVరంగారావు,భానుమతి,అల్లు రామలింగయ్య గార్లకు, చలనచిత్ర దర్శకులలో దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన LV ప్రసాద్,BN రెడ్డి గార్లకు, దర్శక రచయత త్రిపురనేని గోపీచంద్ కు గాయకులలో ఘంటసాల గారికి  మాత్రమే తపాల బిళ్ళలు విడుదల చెసారు. 
ఇప్పటికైనా అక్కినేని అభిమానులు,ఆయన వారసులు  మన తపాల శాఖను కలిసి,రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ సహకారం తో  ANR గారికి తపాల బిళ్ళను విడులచేయాలని వినతి పత్రం ఇవ్వాలి.
ఇప్పటివరకు దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన వారందరికి, వారి మరణాంతరం  తపాల బిళ్ళలు విడుదల చేస్తారు . దాదా సాయబ్ పాల్కే అవార్డ్ పొందిన అక్కినేనికి కుడా తపాల బిళ్ళ విడుదల చేసే ఆస్కారం మెండుగా ఉంది. 
తెలుగు వారందరు గర్వపడేలా వచ్చే ఏడాది ANR గారి  జయంతికి  ఆంధ్రుల అందాల రాముడు అభిమాన నట సామ్రాట్   పద్మభూషణ్ అక్కినేని  తపాల బిళ్ళ విడుదల చేసేలా కృషి జరగాలి  


Friday, 12 September 2014

సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి స్మారక తపాలా కవరు


India Post  a Special Postal Cover issued On famous South Indian music  Director, Singer and actor CHAKRAVARTHI (Kommineni Appa rao) on 6-09-2014
గుంటూరు తపాల బిళ్ళలు, నాణేలు సేకరణ దారుల సంఘం (GNPS - Guntur Numismatic and Philatelic Society)ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గారెండవ రోజు  6-09-2014 న గుంటూరులో  ప్రముఖ తెలుగు సిని సంగీత దర్శకుడు ,గాయకుడు,నటుడు అయిన చక్రవర్తి గారికి  ఒక స్మారక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు
Spcial cover on CHAKRAVARTHI 

చక్రవర్తి పేరుతో ప్రత్యేక తపాల ముద్ర 
చక్రవర్తి (1936-2002 )
తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త,గాయకుడు, నటుడు కె చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు .  ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు. 
సంగీత చక్రవర్తి గారు 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర సంగీత రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. పలు  సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ కుడా చెప్పారు.
1977 లో వచ్చిన యమ గోల తో మంచి పేరు పొందారు. 1989 లో తెలుగులో 95 సినిమా లు విడుదల అయితే  వాటిలో 66 చిత్రాలకు చక్రవర్తి గారే సంగీతాన్ని కూర్చటం ప్రపంచ చిత్ర పరిశ్రమలోఒక రికార్డ్. నేటి భారతం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని అందుకున్నారు. 

Saturday, 6 September 2014

షేక్ నాజర్ కు, గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు


India Post  a Special Postal Cover issued On SHAIK NAZAR (BURRA KATHA) AND GURRAM JASHUVA (WRITER) on 5 -9- 2014

Spcial cover on SHAIK NAZAR , GURRAM JASHUVA

GNPS - (Guntur Numismatic and Philatelic Society)ద్వి దశాబ్ది  వార్షికోత్సవం సందర్బం గా 5-09-2014 న గుంటూరులో  ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ కు, ప్రఖ్యాత కవి గుఱ్ఱం జాషువా గార్లకు ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు,  దీనిపై తపాల ముద్రగా నాజర్ బుర్ర కథ లో వాడే 'తంబూర' , జాషువా రచన 'గబ్బిలం ' పుస్తకం ఉన్నాయి.
షేక్  నాజర్ (1920-1997)బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు, 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో మరణించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.ప్రజా కళాకారుడుగా,అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌.
పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి
1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.
 
గుర్రం జాషువా (1895 - 1971): ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. భారతప్రభుత్వం పద్మభూషణ్  బిరుదుతో సత్కరించింది. గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం.  కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

Wednesday, 3 September 2014

stamps on Indian Musicians

India Post released a Set of 8 stamp on Indian Musicians on 3rd September 2014 to pay tribute to legendary maestros of Indian Classical Music.

Indian Classical Music is of two types, Hindustani and Carnatic Music. Hindustani music is mainly found in North India and Carnatic in South India. The stamps released on legendary maestros Ravi Shankar, Bhimsen Joshi, D.K.Pattammal, Gangubai Hanagal, Kumar Gandharva, Vilayat Khan, Mallikarjun Mansur, and Ali Akbar Khan.