Skip to main content

తపాలా బిళ్ళలపై రామాయణం

దసరా పండుగ సందర్భంగా మన తపాలా శాఖ హిందూ మత  ప్రామాణిక గ్రంధాలలో ప్రముఖమైన రామాయణ  గ్రంధం లోని ముఖ్య ఘట్టాలతో 11 తపాలా బిళ్ళల ను  22-09- 2017 న విశ్వవ్యాప్తంగా విడుదల చేసింది. 
దీనిపై సీతా రామ స్వయంవరం, శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించటం , భరతునికి పాదుకలు ఇవ్వటం, గృహుడు చే నదిని దాటటం, జటాయువు చే సీతాపహరణ గురించి తెలుకోవటం , శబరి చే ఫలహారం స్వీకరించటం, హనుమంతుడు అశోకవనంలో సీత జాడ కనుగొనటం, లంకకు వారధి కట్టే సమయంలో ఉడుత సహాయం, లక్ష్మణుడి కొరకు హనుమ సంజీవని తెచ్చుట, రామ బాణంతో రావణ సంహారం (ఇవి అన్ని 5 రూపాయల విలువతో ఉన్నవి) మధ్యలో 15 రూ  విలువతో శ్రీ సీతారామ పట్టాభిక్షేకం  తో వీటిని రూపొందించారు. 
తపాలా బిళ్ళలపై  రామాయణం 
ఇంతకు ముందు 14-10- 1970 లో రామాయణ గ్రంధకర్త మహర్షి వాల్మీకి పై  ఒక తపాలా బిళ్ళను  విడుదల చేశారు. దీనిపై సీతా రామ లక్ష్మణ ల వనవాసం, బంగారు లేడి చిత్రాలు చూడవచ్చు. 
Maharsi Valmiki

Miniature sheet - Ramayana

Sheet let - Ramayana


Comments