Skip to main content

తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

India Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.
 SRI KRISHNADEVARAYA  

Miniature sheet of   KRISHNADEVARAYA

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
దేశ భాషలందు తెలుగు లెస్స"
అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి   మన శ్రీ కృష్ణ దేవరాయలు(1509-1529)
ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు.
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద  అనే గ్రంథాన్ని రచించాడు.
రాయల ఆస్థానం లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు  'అష్టదిగ్గజములు' గా ప్రఖ్యాతి పొందారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో
దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు 
MAXIMUM CARD
The original portrait of the emperor Sir Krishnadevaraya done by Domingo Paes, Portuguese traveller who visited his court and penned down his memories.
శ్రీ కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 27 -01 -2011 న మన తపాలా శాఖ వారు ఒక ప్రతేక తపాల బిళ్ళను, మినీ ఏచర్ ను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళను తిరుమల శ్రీవారి ఆలయంలో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని, హంపి శిల్ప కళా వైభవాన్ని చాటేలా  అందంగా రూపొందించారు.  
Frist Day Cover - Sri Krishnadevarayalu,Hampi

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...