శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. కాకతీయ సామ్రాజ్యము(1083-1326)వెల్లివిరిసిన కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి.
కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ చర్య తో భారత దేశం లో విలీనం చెందింది.
గొప్ప విషయం ఏమిటంటే, ఇంతకు ముందు నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కాక ముందు వారి పాలనలో వాడిన తపాలా బిళ్ళపై కాకతీయుల ఓరుగల్లు కోట ద్వారం ముద్రించబడినది. మన తపాలా శాఖ వారు ఇంతవరుకు ఒక్క తపాలా బిళ్ళ కుడా కాకతీయుల పై విడుదల చేయలేదు.
Special cover and Pictorial Post mark on
KAKATIYA GATE -WARANGAL (కాకతీయ ద్వారం -ఓరుగల్లు )
Date of Issue: 1-08-1975
Date of Issue: 1-08-1975
The Special postal cancellation shows The last King
Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.
Date of Issue: 12-1-1981
కాకతీయులకు తపాలా బిళ్ళల పై గుర్తింపు ఏది?
ఇప్పటికైనా ఘన చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా మన తెలుగు వారి కీర్తి చాటేలా భారత తపాలా శాఖ వారు ప్రత్యేక తపాలా బిళ్ళలను ఈ కాకతీయ ఉత్సవాల సందర్బంగా విడుదల చేయాలి. రాణి రుద్రమ దేవి, కాకతీయ కోట ద్వారం, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి వంటి వాటిని ఇతివృత్తం గా తపాలా బిళ్ళలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి. పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందాలంటే తపాలా బిళ్ళలు విడుదల చేసి దేశ వ్యాప్త ప్రచారం చేయాలి.

అలాగే గోవా, యానం(పుదిచ్చేరి) ప్రాంతాల విమోచనలకు గుర్తింపుగా తపాల బిళ్ళను విడుదల చేసిన తపాలా శాఖ హైదరాబాద్ సంస్తానం (నిజాం) విమోచనకు కుడా తపాలా బిళ్ళ విడుదల చేయాలి.
Comments