Skip to main content

Posts

Showing posts from December, 2025

ఆరుద్ర - స్మారక తపాల బిళ్ళ

ARUDRA (1925-1998) రచయిత, అభ్యుదయ కవి, సినీ గేయ కవి ఆరుద్ర గా లబ్ద ప్రతిష్ఠుడైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 16-12-2025 న ఒక ప్రత్యేక స్మారక తపాల బిళ్ళను  విడుదల చేశారు. వీరి రచనలలో ఆంధ్ర సాహిత్య చరిత్ర , త్వమేవాహం, వేమన వాదం, గుడిలో సెక్సు వంటి గ్రంథాల తో పాటు దాదాపు మూడు వేల సినిమా పాటలు రాసారు. 

పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి

Sri Sathya Saibaba - Miniature Sheet  పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి సందర్భం గా మన తపాలా శాఖ నాలుగు తపాలా బిళ్ళలు తో ఉన్న ఒక మినియేచర్ ను నవంబరు 19, 2025న పుట్టపర్తిలో ప్రధాని మోడీ గారు విడుదల చేసారు. ఈ తపాలా బిల్లలపై ఒకదానిపై  శ్రీ సత్య సాయి బాబా చిత్రము ఉంటే మిగిలిన మూటిపై  పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయం , శ్రీ సత్యసాయి వైద్య శాల , శ్రీ సత్య సాయి విశ్వ విద్యాలయం భవనాలు చోటు చేసుకొన్నాయి. ఒక ఆధ్యాత్మిక బాబా పై ఒక మినియేచరు విడుదల చేయటం ఇదే మొదటసారి.  ఇంతకు ముందు సత్య సాయి బాబా గారి స్మృత్యర్థం  23-11-2013 లో ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు. అంతకు ముందు 1999లో శ్రీ సత్యసాయి తన సేవలో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తి కొరకు నిర్మించిన త్రాగునీటి ప్రాజెక్టు పై ఒక తపాలా బిళ్ళ విడుదలైంది.  https://stampsofandhra.blogspot.com/2013/11/blog-post_23.html