Skip to main content

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు. కవి రాజు గారి 125 వ జయంతి సంవత్సరంలో వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి.
1987 లో వారి శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్విడుదల చేసింది.
T.RAMA SWAMY CHOWDARY
Date of Issue :25 -04-1987

తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాదనంగా ఎంచుకున్నాడురామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టి గొప్ప అభ్యుదయ వాది.  
ముఖ్య రచనలు : 
సూతపురాణము, కొండవీటిపతనము, కుప్పుస్వామిశతకం, మాలదాసరి, గోపాలరాయ శతకం,పల్నాటి పౌరుషం,శంబూకవధ, సూతాశ్రమ గీతాలు, ధూర్తమానవ శతకము, ఖూనీ, భగవద్గీత ,రాణా ప్రతాప్.
కవిరాజు రాసిన ఒక దేశభక్తి గేయం

 వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ 
పూసిపోదుము - మెడను వైతుము - పూలదండలు భక్తితో

తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు 
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాచినప్పుడు 
తెలుగువారల వేడి నెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు 
దూరమందున్న సహ్యజ - కత్తినెత్తురు కడిగినప్పుడు 

ఇట్టి సందియమెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్ 
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్ 
నడుము గట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్ 
బాస యిచ్చిన తెలుగు బాలుడు - పారిపోవం డెన్నడున్

ఇదిగో యున్నది వీరగంధము - మై నలందుము, మై నలందుము 
శాంతిపర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట 
తెలుగునాటను వీరమాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక 
 పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు 
  వీరగంధము తెచ్చినాము - వీరుడెవ్వరో తెల్పుడీ !! 


Comments

ANANTH said…
మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్
kodali srinivas said…
మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు.
కవిరాజును గురుతు చేసినందుకు ధన్యవాదాలు
వెంకట సుబ్బారావు కావూరి
తెలుగిల్లు
సుతాశ్రయం'---

సంస్కరనోద్యమాలకు
గర్బ
సాథనముగా
ధూర్త మావన శతకము
స్వతంత్ర పోరాటం
త్రిపురనేని రామస్వామి చౌదరి ??????
సూతాశ్రమం,
సంస్కరణోద్యమాలకు,
సాధనముగా.
ధూర్త మానవ శతకము,

స్వాతంత్ర్యపోరాటము
చౌదరి ని ఆయన వర్జించారు
kodali srinivas said…
సుబ్బారావు,రాజేంద్ర గారికి: మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు.అచ్చు తప్పులు సరిచేసాను.
కవి రాజు..గారిని స్మరించుకుని .. స్మరింపజేసేసారు.ధన్యవాదములు. వీర గంధం తెచ్చినారము..గేయం ఇచ్చినందుకు..దన్యవాదములు. మీ బ్లాగ్.. చాలా ఉపయుక్తం .. అభినందనలు.
kodali srinivas said…
ధన్యవాదాలు

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...