India Post released a 5 rupees postal stamp on EKLAVYA , a character in' Mahaa Bharatha' on 27 December 2013
 |
| Eklavya |
మన తపాల శాఖ 27-12-2013 న మహాభారతం లో ద్రోణాచార్యలకు గురు దక్షణ గా తన కుడి చేతి బోటని వేలును సమర్పించిన విలు విద్య వీరుడు ఏకలవ్య కు తపాల బిళ్ళ ను విడుదల చేసింది.
 |
| First day cover - Eklavya |
ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరికను తక్కువకులానికిచెందిన వాడైనందువల్ల ద్రోణుడు తిరస్కరించడంతో, ఏకలవ్యుడు బంకమట్టితో ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా విలు విద్యా నైపుణ్యాన్ని సాధించగలిగాడు.
ఒక నాడు అడివిలో ఏకలవ్యుడు విలువిద్యా నైపుణ్యం చూసిన ద్రోణుడు ఎక్కడ తన ప్రియ శిష్యుడు ఆర్జునుడిని మించిపోతాడనే అసూయతో ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణ గా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు.
5 రూపాయల ఈ తపాల బిళ్ళ లో తన బొటని వేలును సమర్పించుతున్న ఏకలవ్య ని చూడవచ్చు. గురు భక్తి కి, పట్టుదలకి,వర్ణ వివక్షకు చిహ్నం గా ఏకలవ్యడు చరిత్రలో నిలిచిపోయాడు.
Comments