Skip to main content

భారతీయ విద్య భవన్

India Post released a stamp on 7th November 2013 to commemorate 75 years of Bharatiya Vidya Bhavan, which was set up by Dr. K.M Munshi in 1938

Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi
భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తోస్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం  మున్షీ  గారు స్థాపించారు . "Let noble thoughts come to us from every side" అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది. 
Dr. K.M.Munshi - Stamp Issued in 1988

నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు -
  • Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram
  • Bhavan's Vidyashram - Guntur
  • Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad
  • Bhavan's Vidyalaya - Hyderabad
  • Bharatiya Vidya Bhavan's Public School - Vidyashram, Hyderabad 
  • Bhavan's Vidyashram - Hyderabad
  • International Residential Public School - Rajahmundry
  • Bhavan's Varalakshmi Vidyashram - Rajam
  • Bhavan's Public School - Ramachandrapuram, Hyderabad
  • Bhavan's Kamala Rani Sanghi Public School - R.R. District
  • Bhavan's Sri Ramakrishna Vidyalaya - Sainikpuri
  • Bhavan's Residential Public School - Tadepalligudem
  • Bhavan's Sri Venkateshwara Vidyalaya - Tirupati
  • The Primary School, Visakha patnam 

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...