"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 30 November 2015

మహా కవి గురజాడ

India Post Released one Commemorative postal stamp  on Great Telugu Poet and writer Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013.
మన భారత తపాలా శాఖ మహా కవి గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సందర్బంగా
 21-09-2013 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. 
   
Gurajada Venkata Apparao

గురజాడ వెంకట అప్పారావు (జ. 21-09-1862 - మ. 30-11-1915)
దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్  
వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ 
అని వేలుగేత్తి చాటిన  తెలుగు జాతి వైతాళికుడు మహాకవి 
గాసట బీసట గాధలతో , గజిబిజి గా ఉన్న  గ్రాంధిక తెలుగు సాహిత్యాన్నిసామాన్యులకు చేరువచేసి భాషను సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ ఒకడు. హేతువాది. 
19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలనుపొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీఅర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.

గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది.

2 comments:

Kishore Yalamanchili said...

It's great to see the stamp on Sri Gurajada. The design could have been better, but better late than never!

kodali srinivas said...

మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు