Skip to main content

Guntur Numismatic and Philatelic Society(GNPS)

అందంగా ఉన్న చిన్న పేపరు ముక్క ఎన్నో సంగతులు చెబుతుంది. సమాజానికి కావలిసిన జ్ఞానం అనేక విధాలగా అందించుతుంది.చరిత్ర కు ఒక గుర్తుగా నిలుస్తుంది.విశ్వవ్యాప్తంగా సోదర భావాన్ని పెంచుతుంది. అదే తపాల బిళ్ళ అయినా కావచ్చు లేకపోతే కరెన్సి ముక్క అయిన కావచ్చు.
రాబోయే యువతరాన్ని సరైన మార్గంలో పెట్టె మంచి అలవాట్లల లో  తపాల బిళ్ళల/నాణేల సేకరణ కుడా ఒకటి.మనస్సుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే హాబి లలో అతి ముఖ్యమైనది తపాల బిళ్ళ ల సేకరణ. బాల్యం లోనే దీనిని పరిచయం చేస్తే విద్యార్దులు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు. సెల్ ఫోనులు వచ్చాక ఉత్తరాలు రాయటం పోయింది. నేటి తరానికి తపాల బిళ్ళ ల గురించి తెలుసుకొనే తీరిక కోరిక సన్నగిల్లింది. ఈ తరుణం లో ఒక ప్రయోజన కరమైన హాబిని యువతలో విద్యార్దులలో పెంపొందిచటానికి తపాలా బిళ్లల మరియు నాణేల గురించి తెలిపే ప్రదర్శనలు విరిగా  పెట్టాలి.
ఈ ఆశయం తోనే గుంటూరు బాలాజీ కళ్యాణ మంటపం, బృందావన గార్డెన్స్ లో Guntur Numismatic and Philatelic Society(GNPS), Guntur వారి ఆద్వర్యంలో 2012 అక్టోబర్ 13,14 తేదిలలో తపాల మరియు నాణె ముల ప్రదర్శన  జరిగింది.
GNPS గత 18 సంవత్సరాలగా గుంటూరు పరిసరాలలో ఇలా  అనేక ప్రదర్శనలు జరిపి విద్యార్దులలో తపాలా బిళ్ళలు,నాణె ముల  సేకరణ లో ఆసక్తి కలిగేలా విశేషమైన కృషి చేస్తున్నది.ఇంకా ఈ సంఘం వారిచే గుంటూరు ప్రాంత ఒచిత్యాన్ని,సంస్కృతిని ప్రతిబింబిచే ఆనేక ప్రత్యేక పోస్టల్ కవర్స్ విడుదల చేసారు. గుంటూరు పరిసరాలలోని స్కూల్,కాలేజీ లలో స్టాంప్స్ మరియు నాణేల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ అబిరుచి గురించి తెలియజేస్తూన్నారు. ఈ సంఘ సభ్యులు జాతీయ, అంతర జాతీయ తపాలా ప్రదర్శనలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు.
GNPS  సొసైటి లో దాదాపు 190 మంది జీవిత కాలపు సభ్యులు ఉన్నారు.శ్రీ A.V కృష్ణా రావు గారు అధ్యక్షునిగా శ్రీM.V.S  ప్రసాద్ గారు కార్యదర్శిగా పనిచేస్తున్న ఈ సంఘ సభ్యులు పతి నెలా రెండవ ఆదివారం సమావేశం అవుతారు. సమాజానికి GNPS  వారు చేస్తున్న సేవ నిజంగా అబినందించ వలిసిన విషయమే.
చిరునామ 
Guntur Numismatic & Philatelic Society Frequency : Monthly , 2nd Sunday, 6pm
Venue: 
Kanna Concept School, 3/2, Arundelpet, Guntur 522002
Contact: M V S Prasad, Secretary 09866710379
Email: 
prasad_mandali@yahoo.com

Comments

ముందుగా తేదీలు ప్రకటిస్తే బావుండేది, కదా...
kodali srinivas said…
ధన్యవాదాలు భాస్కర్ గారు,ఇటువంటి తపాలా బిళ్ళల/ నాణేల ప్రదర్సనలు ముందుగా నే ప్రకటించ టానికి ప్రయత్నం చేయగలను.
Hi Srinivas garu,

Please email us grandpacoins@gmail.com if you have any intersting articles. We will publish with your copyright name and website.

Thanks
www.grandpacoins.com
www.grandpacoins.in
Unknown said…
I am coins and currency collector
Suggest how to improve collection and their history

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...