
త్యాగ రాజు గారి ప్రియ శిష్యుడు కర్నాటక సంగీత లో నిష్ట్నాతుడు,వాగ్గేయ కారుడు శ్రీ వేంకట రమణ భాగవతార్. త్యాగ రాజ స్వామి తన మరణం కు ఒక నెల రోజుల ముందు వేకట రమణ భాగావతర్ను పిలిచి తన ఆరాధ్య దైవం శ్రీ రామ చంద్ర మూర్తి పూజా విగ్రహాన్ని ,దానితో పాటు తన తాళ పత్ర కృతులు ఇచ్చి తన సంగీత వారసత్వాన్ని కొనసాగించమని కోరాడు. త్యాగ రాజ స్వామి శిష్య పరంపర కొనసాగటానికి వేంకటరమణ భాగవతర్ చేసిన కృషి మరువ లేనిది. తెలుగు, సంస్కృతాలలో మంచి ప్రావీణ్యం ఉన్న శ్రీ వేంకటరమణ భాగవతార్ గారు అనేక కృతులను రచించారు.వీరి గౌరవార్దం 27-12-2009 లో ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల అయింది.
Comments