
త్యాగరాజు (1767 -1847 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. కాకర్ల త్యాగ భ్రహ్మం పూర్వీకులు ప్రకాశం జిల్లా, కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.వీటిలో చాలావరకు ఆయన మాతృభాష తెలుగులో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. వారి 114 వ వర్ధంతి ( జనవరి 6, 1961 ) న ప్రతేక తపాల బిళ్ళ విడుదల చేసారు. ఇది మన తెలుగువారిపై విడుదలైన రెండవ తపాల బిళ్ళ.
Comments