ప్రఖ్యాత తత్వవేత్త రచయిత విద్యావేత్త మరియు పద్మ విభూషణ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 25-09-2024న ఒక ప్రత్యేక తపాలా కవరు (తపాలా చంద్రిక) ను విడుదల చేసారు. ఇది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఉన్న ' Prof Kotha Sachidanada Murty centre for Studiesbin Afro- Asian Philosophies' వారి సౌజన్యంతో విడుదల చేసారు.
Special cover on Dr. Kotha Sachidanada Morty |
కొత్త సచ్చిదానందమూర్తి (1924 సెప్టెంబరు 25 - 2011 జనవరి 25) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు.
Comments