India Post Issued a Commemorative postage stamp on Jiddu Krishnamurti on 11-05-1987
![]() |
Jiddu Krishnamurti |
ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) మదనపల్లి లో జన్మించారు.కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్దాపించి కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. మొదట తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. జగద్గురువుగా అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి వాటికి విలువ ఇవ్వక తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తన విశ్వాసానికి విరుద్దంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా వుండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచ లేదు. చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " ను రద్దుపరచాడు. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని లోకానికి చాటాడు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్చాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి గొప్ప జీవన శిల్పిగా,మహా తత్వవేత్తగా రూపొందాడు.
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
వీరి గౌరవార్దం మన తపాల శాఖ 11-05-1987 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదలైయింది.
![]() |
First Day Cover On J. Krishanamurti |
Comments